By: RAMA | Updated at : 30 Jan 2023 05:53 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Freepik
Horoscope Today 30th January 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బు అందుతంది. వైవాహిక జీవితం బావుంటుంది. రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు.విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు వృత్తిపరమైన, వ్యాపార పరంగా కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి అనుకూలమైన సమయం. కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం మరింత పరిణతి చెందుతుంది. కుటుంబ సంబంధాలలో ఏదో ఒక విషయంలో గందరగోళం ఏర్పడవచ్చు.
మిథున రాశి
ఈ రోజంతా మీరు తల్లిదండ్రులతో స్పెండ్ చేస్తారు. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు ఈరోజు ఎక్కువ పని చేయకుండా ఉండాలి..ఇది మీకు ఒత్తిడిని కలిగిస్తుంది. కుటుంబ సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకోవడం మంచిది
సింహ రాశి
విదేశీ వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలను ఖరారు చేయడానికి ప్రయాణ ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఆకస్మికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..ప్రత్యామ్నాయం ఆలోచించుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు.
Also Read: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
కన్యా రాశి
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. స్నేహితులను కలుస్తారు. పనిపై శ్రద్ధ పెరుగుతుంది.
తులా రాశి
ఈ రోజు మీరు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. స్నేహితులను కలుస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపారులకు మంచిరోజు.
వృశ్చిక రాశి
వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు అద్భుతమైన పురోగతి సాధిస్తారు. స్నేహితుల నుంచి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. రాబోయే రోజుల్లో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పని పట్ల మీ ఉత్సాహం అలాగే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఈరోజు ప్రయోజనం పొందుతారు.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు
మకర రాశి
మకర రాశి వారు ఈరోజు ఏదైనా కొత్త పని ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపేందుకు ప్రణాళిక రూపొందించుకుంటారు. వైవాహిక జీవితంలో అబద్ధాలు చెప్పకండి..మీ భాగస్వామి మీపై నమ్మకం కోల్పోవచ్చు
కుంభ రాశి
విద్యార్థులకు ఈరోజు శుభసమయం. విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకుంటే ఆ ప్రయత్నం ఫలిస్తుంది. సమస్యలను పరిష్కరించడంలో మీ ప్రత్యేక ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు లాభాలు పొందుతారు.
మీన రాశి
ఈ రోజు మీకు శుభప్రదమైనది. స్నేహితుల ఇంటికి విందుకు వెళతారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందుతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. రిలేషన్ షిప్ లో ఏ విధమైన గొడవలు ఉన్నా అవి తీరిపోతాయి.
Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది
Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు
మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది
మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి