మార్చి 29 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు పర్సనల్ లైఫ్ -ప్రొఫెషనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేస్తారు
Rasi Phalalu Today 29th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తొందరపడి ఏ పనీ చేయకపోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీరు పనిచేసే చోట గౌరవం పొందుతారు..పురోగతి కూడా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ధోరణులకు దూరంగా ఉండండి. మానసిక అశాంతి ఉంటుంది. స్నేహితుల నుంచి సమయానికి సహాయం అందుతుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. తలపెట్టిన పనిలో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంటారు. అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులు కృషి, తెలివితేటలతో కష్టమైన పనిని సులభంగా పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
మిథున రాశి
కుటుంబంలో వ్యవహారాలు కార్యాలయ వ్యవహారాలు రెండింటినీ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయగలుగుతారు. ముఖ్యమైన పనులన్నీ పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు భవిష్యత్ కోసం ముందుకు సాగేందుకు కొత్త కోర్సుల్లో చేరేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. అన్నదానం చేయండి.
కర్కాటక రాశి
పెద్ద పెద్ద ఆస్తి ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ శక్తిని, తెలివితేటలని సరిగ్గా ఉపయోగించండి. ఆర్థిక వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న వారికి ఈ రోజు కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్లాన్ చేసుకోండి. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి పెరుగుతుంది.
సింహ రాశి
ఈ రోజు మీకు బలహీనమైన రోజు. ఆరోగ్యం క్షీణించవచ్చు...జాగ్రత్తగా ఉండండి. తప్పుడు ఆలోచనలు మిమ్మల్ని డామినేట్ చేస్తాయి జాగ్రత్తపడండి. ప్రత్యర్థులు ఉత్సాహంగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగులకు శుభదినం. ప్రేమ జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. వైవాహిక జీవితం గడుపుతున్న వారు శుభవార్త వింటారు.
Also Read: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
కన్యా రాశి
ఈ రోజు మీరు కొంతమంది కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. కార్యాలయంలో సహోద్యోగులతో సంతోష సమయం గడుపుతారు. కుటుంబంలోనూ ఆనందం ఉంటుంది. విద్యార్థులు ఉన్నత చదువులకోసం ప్లాన్ చేసుకోవడం మంచిది. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.
తులా రాశి
ఈ రాశివారు నిర్ణయాలు తీసుకునేముందు ఆలోచించాలి. వృత్తి జీవితంలో మంచి మంచి అవకాశాలొస్తాయి. ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా మారాలంటే అందుకు తగిన ఆలోచన చేయడం మంచిది. కుటుంబ సంబంధాలు, పరిచయాలు బాగుంటాయి.తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం పొందాలనే ఆలోచన కన్నా..కష్టానికి తగిన ఫలితం రావాలని కోరుకోవడం మంచిది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీ ప్రయత్నాలతో ఈ రోజును గొప్పగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి సంతోషం పొందుతారు. ప్రేమ జీవితం గడిపే వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు పనిచేసే రంగంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.సహోద్యోగులతో జాగ్రత్త ...వారి నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
భాగస్వామ్యం వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు, ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. మీకు అప్పగించిన పనిని పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. పనివిషయంలో సిన్సియర్ గా ఉంటారు.
మకర రాశి
ఈ రోజు మీరు మీ జీవనశైలిలో మరియు మీ వ్యక్తిత్వంలో కొన్ని మార్పులుంటాయి. మీ ఔదార్యం కొందరికి నచ్చుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ విషయంలో ప్రణాళికలు సరిగ్గా వేసుకోవడం మంచిది. వైవాహిక జీవితంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తెలివైన పని.
Also Read: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు
కుంభ రాశి
ఈ రోజు మీకు ఒడిదొడుకులతో నిండిన రోజు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఇతరుల పట్ల అనురాగం, ప్రేమ భావన కలిగి ఉంటారు. మీరు పని పరంగా కూడా మంచి ఫలితాలను పొందుతారు. మీ కృషిని, నైపుణ్యాలను చూపించే అవకాశం లభిస్తుంది.
మీన రాశి
మీరు చేసే పనులకు కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారానికి సంబంధించి మీ భార్య సలహా తీసుకుంటారు.