By: RAMA | Updated at : 28 Mar 2023 06:30 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Astrology News: శుభ ముహూర్తాలు లేకుండా వివాహం జరగదు. మంచి తేదీలు, అద్భుతమైన మహూర్తం కోసం పండితులను ఆశ్రయిస్తారు. ప్రస్తుతం చైత్రమాసం నడుస్తోంది..వైశాఖమాసం రాగానే పెళ్లిళ్ల సందడి మొదలవుతుంది. మీ జీవితాన్ని మరో మలుపు తిప్పే వివాహానికి మీ రాశి ప్రకారం మీకు కలిసొచ్చే రోజులు, కలిసొచ్చే తేదీలు, కలిసొచ్చే రంగులు తెలుసుకోండి..
మేషరాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలు 1, 5, 6, 9, 10, 11,13. ఈ రాశిచక్రానికి అంగారకుడు అధిపతి. అందుకే మేషరాశి వారి వివాహానికి మంగళవారం అనుకూలమైన రోజు. అనుకూలమైన రంగు ఎరుపు. అయితే కొందరికి మంగళవారం ఏ పనీ ప్రారంభించడం మంచిదికాదనే సెంటిమెంట్ ఉంటే..మరికొందరు మాత్రం మంగళవారాన్ని జయవారంగా భావిస్తారు.
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వివాహానికి అనుకూలమైన తేదీలు 8, 9, 10, 11, 15, 16, 20 . వీరికి కలిసొచ్చే రోజు శుక్రవారం, కలిసొచ్చే రంగు నారింజ రంగు.
మిథున రాశివారికి వివాహానికి అనుకూలమైన తేదీలు 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీలు మిథున రాశివారికి శుభం. బుధవారం వీరికి కలిసొచ్చే రోజు కాగా... ఆకుపచ్చ రంగు వీరికి శుభప్రదం
Also Read: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
కర్కాటక రాశివారికి వివాహానికి అనుకూలమైన తేదీలు 23, 24, 26, 27 . వీరికి అత్యంత పవిత్రమైన రోజు సోమవారం , శుభప్రదమైన రంగు తెలుపు.
సింహరాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలు 23, 24, 27, 28, 29. ఈ రాశివారికి ఆదివారం ఉత్తమ రోజు. ఎరుపు శుభప్రదమైన రంగు.
23, 24, 27, 28, 29 కన్యా రాశి వారికి వివాహానికి అనుకూలమైన తేదీలు. ఈ రాశిచక్రం అదృష్ట రంగు ఆకుపచ్చ, తగిన రోజు బుధవారం.
తులా రాశి వారికి 5, 6, 7, 8, 9, 11, 15 వివాహానికి అనుకూలమైన రోజు కాగా..శుక్రవారం, ఆకుపచ్చ రంగు శుభప్రదం.
వృశ్చిక రాశి వారికి 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీలు వివాహానికి అనుకూలం. ఈ రాశి వారికి మంగళవారం, కుంకుమ రంగు శుభప్రదం
Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!
ధనస్సు రాశివారికి 3, 14, 15, 17, 22, 23, 28 కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అనుకూలమైన తేదీలు. వివాహానికి అత్యంత అనుకూలమైన రోజు గురువారం, వీరికి మంగళకరమైన రంగు పసుపు.
మకర రాశివారికి అత్యంత అనుకూలమైన వివాహ తేదీలు 19, 25, 26, 27, 30, 31. ఈ రాశి వారికి శనివారం అనుకూలమైన రోజు కాగా నీలం రంగు శుభప్రదం
కుంభ రాశి వారికి 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీలు అనుకూలమైనవి. వివాహానికి శుభదినం శనివారం, కలిసొచ్చే రంగు వెండి రంగు..
మీన రాశివారికి ఉత్తమ వివాహ తేదీలు 14, 15, 17, 22, 23, 28. సోమ, గురువారాలు మంచి రోజులు, అదృష్టాన్నిచ్చే రంగు పసుపు.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!
June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే
జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!
కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?
Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!
Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్