అన్వేషించండి

Horoscope Today 29 May 2024: ఈ రాశులవారికి ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది - 2024 మే 29 రాశిఫలాలు!

Rasi Phalalu Today: మే 29 ఏ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి...ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today 29 May 2024 : మే 29 రాశిఫలాలు  

మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి చాలా అనుకూలమైన రోజు. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు అందుతాయి. బంధువులతో కలిసి కొన్ని కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు.  ఆస్తి వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది.

వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశి వారి జీవితంలో చాలా పెద్ద మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారు. మీరు మీ కెరీర్‌లో అఖండ విజయాన్ని పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొందరికి విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు ఆఫర్లు రావచ్చు. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారు చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. గణేశుడి అనుగ్రహంతో జీవితంలో ఆనందం లభిస్తుంది. పనిలో సవాళ్లు తొలగిపోతాయి. మీరు ప్రతి పనిలో మంచి ఫలితాలను పొందుతారు. కొంతమందికి ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆస్తి కొనుగోలుకు ఈ రోజు అనుకూలమైన రోజు.

కర్కాటక రాశి
ఈ రోజు శుభదినం. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలతో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. కెరీర్‌లో ఎదుగుదల కోసం   బంగారు అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం  ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు పొందుతారు.  

Also Read: అత్యంత ఆకర్షణీయమైన రాశుల్లో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!

సింహ రాశి
ఈ రోజు సింహ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్ కోసం బాధ్యత పొందుతారు. కెరీర్‌లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహకారంతో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

కన్యా రాశి
కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వృత్తి జీవితంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. జీవితంలో ఉత్సాహంతో కూడిన వాతావరణం ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో మీ భాగస్వామి భావోద్వేగాల గురించి సున్నితంగా ఉండండి. 

తులా రాశి
ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. ఉద్యోగాలు మారాలనుకునే వారు ఈరోజు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొంతమంది కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ రోజు ప్రేమ జీవితంలో పాత జ్ఞాపకాలు  తలుచుకుంటారు.  

వృశ్చిక రాశి
మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆఫీసు పనులను ఆత్మవిశ్వాసంతో నిర్వహించగలుగుతారు. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు అవసరమైన పత్రాలను చాలా జాగ్రత్తగా చదవండి. ఆర్థిక విషయాలలో అజాగ్రత్తగా ఉండకండి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. 

ధనస్సు రాశి
ఈ రోజు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. వృత్తి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. చేపట్టిన ప్రతి పని మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మూడ్ స్వింగ్స్ కారణంగా మీ భాగస్వామితో వివాదం ఉండవచ్చు. మీ ప్రేమికుడితో అనవసర వాదనలకు దూరంగా ఉండండి.

మకర రాశి
ఈ రోజు మీ వృత్తి జీవితం బాగుంటుంది. భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. కెరీర్‌లో మంచి ఫలితాలు సాధిస్తారు. సామాజిక హోదా  పెరుగుతుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి మీరు కార్యాలయంలో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. ఒంటరి వ్యక్తుల జీవితంలో మాజీ ప్రేమికుడు తిరిగి రావచ్చు.వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి. 

కుంభ రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నూతన పెట్టుబడులకు అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత వృత్తి జీవితంలో అదృష్టం కలిసొస్తుంది. మీ జీవితంలో ప్రతి రంగంలో అపారమైన విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల ఫలిస్తుంది. చేపట్టిన పనిలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. కెరీర్లో ఆటంకాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం 

మీన రాశి
ఈ రోజు మీరు ఆస్తిని అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి జీవితం బావుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఇదే మంచి సమయం.  కార్యాలయంలో సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. కెరీర్‌లో పురోగతి బావుంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

17-10-2026 శనివారం ధనస్సు, మకర, కుంభ, మీనం రాశిఫలాలు: మీ అదృష్టం, సవాళ్లు ఇవే!
17-10-2026 శనివారం ధనస్సు, మకర, కుంభ, మీనం రాశిఫలాలు: మీ అదృష్టం, సవాళ్లు ఇవే!
17-10-2026 శనివారం సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల్లో ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త అవసరం?
17-10-2026 శనివారం సింహం, కన్యా,తులా, వృశ్చిక రాశుల్లో ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త అవసరం?
17-10-2026 శనివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల భవిష్యత్తుకు గ్రహాల సూచనలు
17-10-2026 శనివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల భవిష్యత్తుకు గ్రహాల సూచనలు
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget