ఫిబ్రవరి 28 రాశిఫలాలు, ఈ రాశి ఉద్యోగులు బాగా పనిచేస్తారు కానీ భావోద్వేగాలు నియంత్రించుకోవడంలో ఫెయిల్ అవుతారు
Rasi Phalalu Today 28th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
ఈ రోజు మీరు శుభవార్త వింటారు. ఉద్యోగులు పురోగతి పొందుతారు, సంపద పెరుగుతుంది. సామాజిక సమస్యలపై పూర్తి దృష్టి సారిస్తారు. దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు ఒక పనిని పూర్తి చేయడంతో మీ ధైర్యం పెరుగుతుంది. మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్తపడడండి. ఏపనిని అయినా భాగస్వామ్యంతో చేయడం మంచిది.
వృషభ రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంలో జరుగుతున్న గొడవలను బయటి వ్యక్తుల ముందు బహిర్గతం చేయకండి. మీరు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందడం సంతోషంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. సృజనాత్మక పనుల పట్ల మీ ఆసక్తి అలాగే ఉంటుంది. దూరపు కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారు పొదుపు పథకాలపై పూర్తి దృష్టి పెడతారు.
మిథున రాశి
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. మీ సన్నిహితుల నమ్మకాన్ని సులభంగా గెలుచుకోగలుగుతారు కానీ అనవసరమైన చర్చలకు దిగొద్దు.ఈ రాశిఉద్యోగులు పనిబాగా చేస్తారు కానీ భావోద్వేగాలు నియంత్రించుకోవడంలో విఫలమవుతారు. అదే సమస్యలను తెచ్చిపెడుతుంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేసుకోవడం మంచిది. మీ మాటతీరు మీపై గౌరవాన్ని పెంచుతుందని గుర్తుంచుకోండి.
కర్కాటక రాశి
ఈ రాశి విద్యార్థువు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి...ఆలోచనలు పక్కదారి పట్టకుండా ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు. నిరుద్యోగులకు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పకపోవచ్చు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఎవరైనా మీతో తప్పుడు ఒప్పందం చేసుకోవచ్చు. మీరు కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది..లేదంటే ఆ తర్వాత సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఓ రహస్య సమాచారాన్ని అందుకుంటారు
Also Read: గుండెల్లో ప్రేమను తెలిపే గుప్పెడు రంగు, వెన్నదొంగ చిలిపి ఆలోచనే హోలీ!
సింహ రాశి
ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు మంచి చేస్తుంది. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఎక్కువ సమయం గడుపుతారు. పోటీదారులకన్నా ముందు దూసుకుపోయి మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రోజు పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కన్నవారి సేవలో మానసిక ప్రశాంతతను పొందండి.
కన్యా రాశి
ఈ రోజు మీ హోదా, ప్రతిష్ఠ పెరుగుతుంది. అదృష్టం మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ మీ జోరును కొనసాగిస్తారు. వ్యాపారులకు ఏదైనా సలహా అవసరమైతే అనుభవజ్ఞుల నుంచి తీసుకోవడం మంచిది. చట్టపరమైన వ్యవహారాల్లో మీరే విజయం సాధిస్తారు. ఈ రోజు కొంతమంది అపరిచిత వ్యక్తులను కలుసుకుంటారు..వారితో అన్ని విషయాలను గలగలా షేర్ చేసేసుకోవద్దు.
తులా రాశి
ఈ రోజు వ్యాపారులకు మంచి రోజు. పాత ప్రణాళికలు అమలు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఆలోచించాలి. కుటుంబంలో పిల్లల తప్పులను క్షమించడం ద్వారా సంతోషం నిండి ఉంటుంది. రాజకీయాల్లో పనిచేసే వారికి కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
Also Read: హోలీ రోజు మీరు చల్లే రంగు మీ మనసులో ఏముందో చెప్పేస్తుంది
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు ఆకస్మిక ప్రయోజనాలు కలిగించే రోజు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. మీకు మీ జీవిత భాగస్వామి నుంచి చాలా మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో ఏదైనా పని గురించి మీ అధికారులతో వాదనలకు దిగి సమస్య పెంచుకోవద్దు. మీ ప్రత్యర్థులు కొందరు ఈ రోజు చురుకుగా ఉంటారు..వారికి చెక్ పెట్టేందుకు వ్యూహ రచన చేయండి. చట్టానికి సంబంధించిన వ్యవహారంలో మీరు విజయం సాధిస్తారు
ధనుస్సు రాశి
ఈ రోజు కష్టపడి పనిచేస్తేనే ఫలితం అందుకుంటారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు. మీ సన్నిహితులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. గృహ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి భాగస్వామితో కొంత సమయం ఒంటరిగా స్పెండ్ చేయడం ద్వారా మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. ఆస్తుల కొనుగోలుకు ఇదే మంచి సమయం. వ్యాపారాలు చేసేవారు సమయానికి సరైన నిర్ణయం తీసుకుని ఇతరులను ఆశ్చర్యపరుస్తారు.
మకర రాశి
ఈ రోజు మీకు ఉత్సాహంగా ఉంటుంది. మీలో మితిమీరిన శక్తిని సరైన విషయాలకు ఉపయోగించాలి..లేదంటే సమస్యల్లో పడతారు. సామాజిక సేవ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగులు తమ జూనియర్లతో సత్ప్రవర్తనను కొనసాగించాలి. మీ ఆదాయానకి అనుగుణంగా ఖర్చులు ప్లాన్ చేసుకోకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తంది. మీ శత్రువులు ఉత్సాహంగా ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండండి.
కుంభ రాశి
ఈ రోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది. కళారంగంలో ఉన్నవారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి పేరు సంపాదిస్తారు. ఏదైనా పనిని ఉత్సాహంగా చేస్తారు. కొన్ని వ్యక్తిగత పరిస్థితుల్లో నియంత్రణ కలిగి ఉండాలి. మీరు మీ స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబానికి సమయం కేటాయించండి.
మీన రాశి
ఈ రోజు మీకు ఉత్తేజకరమైన రోజు అవుతుంది. కొత్త ఆస్తి కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. పెద్దల సలహాలను పాటించడం ద్వారా మీరు మంచి పేరు పొందుతారు.కుటుంబంలో ఎవరితో వాదనలకు దిగకూడదు. ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కొన్ని ఆనందాల కోసం ఖర్చు చేస్తారు.