By: RAMA | Updated at : 07 Mar 2023 06:23 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Holi 2023: పండుగ అంటే అదో ఆనందం, ఉత్సాహం..యాంత్రికంగా సాగిపోయే జీవితాల్లో ఓ ఆటవిడుపు. ఒక్కో పండుగ తీరు ఒక్కోలా ఉంటుంది. అయితే చిన్నా పెద్దా అందరిలోనూ సంతోషాన్ని నింపుతుంది హోలీ. ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఎన్నో పురాణ గాథలున్నాయి. అయితే వసంతరుతువు ఆగమనాననికి సూచికగా కూడా హోలీ జరుపుకుంటారు. ఎందుకంటే ప్రకృతి కొత్త రంగులు నింపుకున్నట్టే మనం కూడా రంగులతో పండుగచేసుకుంటాం. అయితే రంగులన్నీ కలగలపి ఎలాఅంటే అలా చల్లేసుకోవడం కాదు...ప్రతి రంగు వెనుకా అర్థం ఉంది. ఏ రంగు వెనుకున్న అర్థమేంటో అర్థం చేసుకుంటే ఆనందం మరింత రెట్టింపవడమే కాదు..మీరు ఎవరిపై అయితే రంగువేస్తారో వాళ్లపట్ల మీకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయకనే చేసినట్టవుతుంది. ఇంతకీ ఆ రంగుల వెనుకున్న ఆంతర్యం ఏంటంటే..
Also Read: శవాల బూడిదతో హోలీ వేడుకలు ఆరంభం, 5 రోజుల పాటూ కన్నులపండుగా రంగుల పండుగ
ఎరుపు రంగు
హోలీకి అందాన్ని తెచ్చేది, ఎన్నో రంగుల మధ్యన తళుక్కున మెరిసే ఎరుపు రంగు.. ప్రేమ, అనుబంధం, సాన్నిహిత్యానికి సూచన. అందుకే హోలీ సమయం రోజు వివాహిత మహిళలు పాపిట్లో సింధూరం తప్పనిసరిగా పెట్టుకుంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా తమ మనసైన వారితో కుంకుమ పెట్టించుకుంటారు.
పసుపు రంగు
పసుపు రంగు శుభానికి, శాంతికి, ఆనందానికి, శ్రేయస్సుకు ప్రతీక. మరీ ముఖ్యంగా హిందువులకు పసుపు లేనిదే ఏ పండుగ మొదలు కాదు..పూర్తికాదు. అసలు పసుపు రంగు లేకుండా హోలీ సెలబ్రేట్ చేసుకోవడంలో సంపూర్ణత ఉండదేమో అనిపిస్తుంది. ఈ రంగు చల్లితే మీరు ప్రసాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు అర్థం.
ఆకుపచ్చ రంగు
ఈ రంగు నూతన ప్రారంభాలకు, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. పచ్చని పంటలను, సంతోషాన్ని, సంతృప్తిని సూచిస్తుంది. ఈ రంగు చల్లితే కష్టాలు తీరి కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టే.
నీలిరంగు
నీలిరంగు అంటే ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే ఠక్కున గుర్తొస్తాడు శ్రీ కృష్ణుడు. శ్రీ కృష్ణుడికి దగ్గర రంగులో ఉండే నీలిరంగుని పురాణాల్లో ఆయనకు అంకితం ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే కృష్ణుడు కొలువైన మధుర లాంటి ప్రదేశాల్లో హోలీ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ రంగు విశ్వాసం, ఆధ్యాత్మిక, సానుకూల శక్తికి సూచికగా భావిస్తారు. హోలీ రోజు ఈ రంగు చల్లడం ద్వారా మీరు ఎదుటివారిపై విశ్వాసం కలిగి ఉన్నారని అర్థం
Also Read: కామం దహించి ప్రేమ-సౌభాగ్యం వెల్లివిరిసిన రోజు హోలీ, రంగుల వేడుక వెనుక ఎన్నో పురాణ కథలు
గులాబీ రంగు
గులాబీ రంగు.. ఆడపిల్లలు మచ్చే పింక్...చిన్నారులకైతే ఈ రంగు మరీ ఇష్టం. పిల్లల నవ్వు ఎంత ప్రశాంతంగా ఉంటుందో పింక్ కలక్ కూడా అలాగే ఉంటుంది. ప్రశాంతతకు, స్నేహానికి ప్రతీకగా ఈ రంగు చల్లుకుంటారు.ఈ రంగు చల్లితే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పకనే చెప్పడమే.
నారింజపండు రంగు
నారింజ ( ఆరెంజ్) ఇది సానుకూలతకు ప్రతీక. ఈ రంగుని కేవలం తమ ప్రియమైన వారిపై మాత్రమే చల్లుతారు. ఈ రంగు ఆధ్యాత్మికతకు ప్రతీక అని విశ్వసిస్తారు.
ఆకాశం రంగు
ఈ రంగు రాయల్టీకి ప్రతీకగా చెబుతారు. హోలీ సెలబ్రేషన్స్ లో మరింత కలర్ ను నింపుతుంది ఆకాశం రంగు.
ఎన్నో రంగుల మయమైన హోలీ అందరి జీవితాలను రంగుల మయం చేయాలని ఆశిస్తూ జరుపుకుంటే ఆ ఆనందమే వేరు...
Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే
Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!
Political Horoscope: 2023-2024 ఈ రాశులకు చెందిన రాజకీయనాయకులకు గడ్డుకాలమే!
ఏప్రిల్ 1 రాశిఫలాలు, అన్ని విషయాల్లో ఈ రాశివారి డామినేషన్ పెరుగుతుంది
ముఖం మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులా? ఇంకా ఎక్కడెక్కడ ఉంటే లక్ వరిస్తుంది?
మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?
Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?