News
News
వీడియోలు ఆటలు
X

ఏప్రిల్ 28 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఆసక్తికరమైన మలుపు ఉండబోతోంది!

Rasi Phalalu Today 28th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

ఏప్రిల్ 28 రాశిఫలాలు

మేష రాశి

మేష రాశివారికి ఈ రోజు మిశ్రమఫలితాలున్నాయి. రాజకీయాలవైపు అడుగేయాలి అనుకునే యువతకు అనుకూల సమయం ఇది. బడ్జెట్ కి అనుగుణంగా ఖర్చు చేయడం మంచిది. ఇంటి అలంకరణ, మరమ్మత్తు కోసం కూడా చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. శుభకార్య నిర్వహణ గురించి చర్చించుకుంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రయాణ సమయంలో మీ విలువైన వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కార్యాలయంలో అధిక పనిభారం కారణంగా ఉద్యోగులు అలసిపోతారు. మీరు మీ అధికారుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. రోజంతా సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. వ్యాపారంలో లాభాలొస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ప్రయోజనం పొందుతారు.వ్యాపారంలో ధనలాభం ఉండవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి లభించే సూచనలున్నాయి. ఈ రోజు మీరు పాత స్నేహితుడిని కలుస్తారు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ప్రేమ జీవితం పట్ల యువత సంతోషంగా ఉంటారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయి. అనుకున్న ప్రయాణం వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులు ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. 

మిథున రాశి

మిథున రాశి వారికి ఈరోజు మంచి రోజు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు పొందుతారు. విద్యార్థులు చదువుకి సంబంధించి కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. వివాహంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పిల్లల పెళ్లికి సంబంధించిన ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. కొత్త వ్యాపారం వృద్ధి చెందుతుంది.  స్నేహితుల సహాయంతో ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. దూరపు బంధువు నుంచి శుభవార్త అందుకుంటారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి మంచి రోజు. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ అవసరాలను తీర్చడానికి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రణాళికలు వేస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులను భరించాలి. బ్యాంకింగ్ రంగంలోని ప్రజలకు మేలు జరుగుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రుల నుంచి ఆశీస్సులు తీసుకుని వెళితే పనులు విజయవంతం అవుతాయి. బయటి వ్యక్తుల జోక్యం వల్ల కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి. ఉద్యోగులు కార్యాలయంలో అప్పగించిన పని సకాలంలో పూర్తిచేస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బ్యాచిలర్స్ పెళ్లి గురించి చర్చించుకుంటారు.

సింహ రాశి

సింహ రాశికి ఈ రోజు ఆహ్లాదకరమైన రోజు. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబసభ్యులు మీకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తారు. రాజకీయాల్లో విజయావకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకు వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి.పనిభారం ఎక్కువ కావడం వల్ల అలసట ఉంటుంది. విద్యార్థులు తమ స్నేహితులతో గడిపే సమయం ఎక్కువవుతుంది..చదువుపై దృష్టి సారించలేరు. 

Also Read: మే 5న చంద్రగ్రహణం ఈ మూడు రాశులవారికి అదృష్టాన్ని తెస్తోంది

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు మంచి రోజు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. పిల్లలతో మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరంగా బావుండండంతో ఇంట్లో సంతోషం ఉంటుంది. నిలిచిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా మీదే పైచేయి అవుతుంది. వ్యాపారులకు మంచి సమయం . ఉద్యోగంలో ఏదైనా కొత్త బాధ్యతను స్వీకరించవచ్చు. కొత్తగా ఏదైనా పని చేసే ముందు పెద్దలను సంప్రదించాలి. పూర్వీకుల వ్యాపారంలో మార్పు కోసం తన సీనియర్ సభ్యులతో మాట్లాడతారు. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన రోజు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యా లేకండా ఉండాలంటే డబ్బు ఆదాచేయడం ఎలాగో నేర్చుకోవాలి. ఈ రోజు పిల్లల పురోగతికి ప్రశంసలు లభిస్తాయి. ఈ రోజు మీరు కుటుంబ అభివృద్ధి కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బును పొందుతారు. విద్యారంగంలో విజయం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.  ఇల్లు, దుకాణం, ప్లాట్లు కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. కొత్త ప్రాజెక్టు కోసం అప్పు తీసుకోవాలి అనుకుంటే ఈ సమయం మంచిది. వ్యాపారంలో లాభాలొస్తాయి.

వృశ్చిక రాశి 

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. రాజకీయాలలో ఉన్నవారికి ఈ రోజు విజయం ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు కొత్త ప్రాజెక్ట్‌లో పని చేయవలసి ఉంటుంది.ఉద్యోగులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త...ఎక్కడా మాట తూలొద్దు...ఎవరి ప్రలోభాలకు లోను కావొద్దు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ప్రయోజనం పొందుతారు. కుటుంబ సహకారం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.  ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన వాహన ఆనందాన్ని పొందుతారు. విద్యార్థులు చదువులో ఎదురవుతున్న సమస్యలపై తల్లిదండ్రులతో మాట్లాడతారు.

ధనుస్సు రాశి

మీ రోజు బాగానే ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూల సమయం. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది. పై అధికారుల నుండి కొన్ని శుభవార్తలు అందుతాయి, దీని వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో డబ్బు వచ్చే సూచనలున్నాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. నిలిచిపోయిన అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే సూచనలున్నాయి. 

Also Read: మే మొదటివారం చంద్రగ్రహణం, ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు చాలా బాగానే ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కొన్ని పెద్ద అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లు వస్తాయి, ఆదాయం బావుంటుంది. ఈ రోజు మీ జీవితంలో ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన మలుపు ఉండబోతోంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మంచి సమాచారం వింటారు. ఈ రోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది..ఇది మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. ఆగిపోయిన పనులను పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలను పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మాటలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది. మీ సంబంధంలో ఇతర వ్యక్తులు జోక్యం చేసుకోనివ్వకండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు ఆనందంతో నిండి ఉంటుంది. మీరు అన్ని రంగాల నుంచి శుభవార్తలను వింటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. విద్యారంగంలో సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృత్తి జీవితంలో కూడా పెద్ద విజయాలు సాధించవచ్చు. ఏదైనా వ్యాపార సంబంధిత పనిని ప్రారంభిస్తారు. చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. మనసులోని విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. పిల్లల అవసరాలు తీరుస్తారు.  గృహ జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ పురోభివృద్ధి కోసం పని చేయడం కనిపిస్తుంది.

మీన రాశి

మీ రోజు బాగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వివాదానికి ముగింపు పలికేందుకు ఈరోజు సరైన సమయం. ఇంట్లోనే పూజలు, పాఠాలు నిర్వహిస్తారు. ఈరోజు మీరు ఏ పని చేసినా అది మీకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. దంపతుల మధ్య విభేదాలు ఏర్పడవచ్చు జాగ్రత్తగా ఉండండి. పిల్లల పట్ల గర్వంగా ఫీల్ అవుతారు.పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి.  మీరు మీ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు.

Published at : 28 Apr 2023 05:31 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today Horoscope for 28th April 28th April Astrology

సంబంధిత కథనాలు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

Weekly Horoscope 29 May to 04 June:  జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

మే 28 రాశిఫలాలు, ఈ ఐదు రాశుల వారి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

NTR Satajayanti: నిష్ఠాగరిష్ఠుడు తారకరాముడు - అందుకే ఆయనని దైవాంశ సంభూతుడు అంటారంతా!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

Sri Dakshinamurthy: ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దేవుడి ఫొటో ఇది!

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా