Image Credit: Freepik
Lunar Eclipse 2023 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం మే 5 న ఏర్పడబోతోంది. ఆరోజు వైశాఖ పౌర్ణమి. చంద్రుడు, సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటుంది. మే 5న రానున్న చంద్రగ్రహణం ఈ మూడు రాశులవారికి అదృష్టాన్ని తీసుకొస్తోంది. ఈ మూడు రాశుల్లో మీరున్నారా....
2023 సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మిథున రాశివారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు పదోన్నతి పొందుతారు..జీతాలకు సంబంధించి పెరుగుల ఉంటుంది. కార్యాలయంలో ఇతర ప్రయోజనాలు పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభాలు ఆర్జిస్తారు. మీకు అదృష్టం కలిసొస్తుంది. విదేశాలకు వెళ్లాలని ఆలోచించేవారు..ముందడుగు వేసేందుకు ఇదే సరైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి..మాట తూలొద్దు..
Also Read: మే మొదటివారం చంద్రగ్రహణం, ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో వస్తోన్న మొదటి చంద్రగ్రహణం సింహరాశివారికి అనుకూల ఫలితాలనిస్తోంది. కొత్తగా ఏదైనా ప్రాజెక్ట ప్రారంభించేందుకు, నూతన ప్రణాళికలు అమలుచేసేందుకు ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి..అన్నింటా మంచి ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక కార్యాల్లో పాల్గొంటారు. ఆస్తి లేదా మరేదైనా విషయంలో కోర్టు కేసు నడుస్తున్నట్లయితే, మీరు ఉపశమనం పొందవచ్చు. నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. అయితే అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం లేదా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాలి.
Also Read: ‘విరూపాక్ష’కూ ఓ ఆలయం ఉంది, ఆ రహస్యాన్ని బ్రిటీషర్లు కూడా తెలుసుకోలేకపోయారు - ఏమిటా వింత?
ఈ చంద్రగ్రహణం మకరరాశివారికి ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ సమయంలో మీరు స్థిరాస్తులు వృద్ది చేసేందుకు ధైర్యంగా అడుగేయవచ్చు. వాహన యోగం కూడా ఉంది. నూతన ప్రణాళికలు అమలుచేసేందుకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు పదవులు, ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు మీ కెరీర్‌లో ముందుకు సాగడానికి అవకాశాలను పొందుతారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. అకస్మాత్తుగా ద్రవ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక రాదు అనుకున్న సొమ్ము వసూలు అయ్యే అవకాశం ఉంది. సంతోషంగా ఉంటారు.
గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం
జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!
Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!
Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!
Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు