Horoscope Today 28 December 2021: ఈ రాశివారికి ఆర్థికంగా అనుకూల సమయం, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
దక్షిణాయనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ పక్షం నవమి: మ. 1.18 తదుపరి దశమి, చిత్త: రా. 12.16 తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.8.49 నుంచి 10.22 వరకు; తిరిగి తె.వ. 5.36 నుంచి; దుర్ముహూర్తం: ఉ. 8.44 నుంచి 9.28 వరకు తిరిగి రా.10.43 నుంచి 11.35 వరకు
డిసెంబరు 28 మంగళవారం రాశి ఫలాలు
మేషం
మేష రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగత్తగా ఉండండి, వాహనప్రమాదం ఉంది. ఒంటరి ఆలోచనలు వదిలిపెట్టి, నలుగురిలో కలిసేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఓ వ్యవహారంలో కుటుంబ సభ్యల సహకారం లభిస్తుంది. అనవసర వాదనలకు దిగొద్దు. ఉద్యోగస్తులు పని విషయంలో రాజీ పడొద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పట్టుదలతో అనకున్నది సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి.
మిథునం
మనోబలం మిమ్మల్ని గొప్పగా నిలబెడుతుంది. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అన్నిటికీ ఆవేశపడొద్దు.
కర్కాటకం
అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది.వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం
మంచి పనులు చేస్తారు, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారితో పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కొత్త పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకోండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్య
ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించినదాని కన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. . ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు బాగా సహకరిస్తారు. ధన లాభం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ది సాధిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
తుల
శ్రమకి తగిన ఫలితం పొందుతారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్దిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
వృశ్చికం
మంచి ఫలితాలు ఉన్నాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి, ప్రశంసలు అందుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంటుంది.
ధనుస్సు
శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి సమయం. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు.
మకరం
మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.
కుంభం
నమ్మకంతో ముందుకు సాగండి అన్నీ శుభఫలితాలు పొందుతారు. కొత్త పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగేయాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనారోగ్య సూచనలున్నాయి. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి.
మీనం
శుభవార్త వింటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి.అనవసర ఖర్చులు నియంత్రించండి. ఉద్యోగం అనుకూలంగా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
Also Read: ఈ రాశుల్లో పుట్టిన పిల్లలు గాడ్ గిఫ్టే... మీ పిల్లలు ఉన్నారా ఇందులో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి