News
News
వీడియోలు ఆటలు
X

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

Rasi Phalalu Today 26th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మార్చి 27 ఆదివారం రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీ ప్రత్యర్థులు మీ ప్రతిష్టను పాడుచేయడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త. ముఖ్యమైన లేదా బాధ్యతాయుతమైన  పనులు చేయాల్సి వస్తే ఈ రోజు వాయిదా వేయడమే మంచిది. కుటుంబ జీవితం బావుంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. 

వృషభ రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మనసులో సంతోషం ఉంటుంది. అందరితోనూ ఇట్టే కలసిపోతారు. తలపెట్టిన పనులకు సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది..వారిని జాగ్రత్తగా చూసుకోండి. 

మిధున రాశి

ఈ రోజు ఈ రాశివారికి ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ఈ రాశి స్త్రీలకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. పిల్లల్ని సంతోషంగా ఉంచేందుకు కొన్ని ప్లాన్స్ చేస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తవుతాయి.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ జీవితం బావుంటుంది. రోజంతా చురుకుగా ఉంటారు. ఉద్యోగుల పని సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. కోపంతో ఏ పనీ చేయకూడదు.

సింహ రాశి 

ఈ రోజు మీకు కొద్దిగా బలహీనంగా ఉండొవచ్చు. ఆరోగ్యం దెబ్బతిట్టుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. తలపెట్టిన పనికి సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. 

కన్యా రాశి

ఈ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. ఓ పెద్ద కంపెనీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.

Also Read: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

తులా రాశి

ఈ రోజు ఈ రాశివారు కొత్త బాధ్యతలు పొందుతారు. అంకితభావంతో కష్టడి పనిచేస్తే..ఉన్నతాధికారుల కృపకు పాత్రులవుతారు. ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించండి..అంతా శుభమే జరుగుతుంది. సానుకూల ఆలోచనలే కొనసాగించండి..ప్రతికూల ఆలోచనలకు తావివ్వవద్దు. 

వృశ్చిక రాశి 

ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనిలో స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ఈ రాశికి చెందిన ఆర్ట్స్ విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఇప్పటికే ఇచ్చిన ఏదైనా పోటీ పరీక్షలు రాసి ఉంటే విజయం సాధిస్తారు. ఆర్థిక రంగంలో స్థిరత్వం ఉంటుంది.

ధనుస్సు రాశి

ఈ రోజు మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మీరు ఏదో ఒక అయోమయ స్థితిలో ఉంటారు. మీరు పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంలో సమస్యలు రావొచ్చు.

మకర రాశి

ఈ రోజు మీ ప్రత్యర్థులు బహిరంగంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. చాలా పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మీరు మీ భావోద్వేగ స్థితి గురించి చాలా ఆందోళన చెందుతారు.

కుంభ రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా మీరు అడ్డంకులను అధిగమిస్తారు. ఖర్చులను ఎలా నియంత్రించుకోవాలో మీరు నేర్చుకోవాలి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. 

మీన రాశి 

ఈ రోజు మీరు ఏ పనిని పూర్తి చేయాలనుకుంటున్నారో, ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. 

Published at : 26 Mar 2023 05:32 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today Sri Sobhakritu Nama Samvatsara uadi Ugadi Predictions 2023-2024 March 26th Horoscope 26th March Astrology Horoscope for 26th March 26th March Horoscope

సంబంధిత కథనాలు

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!