Horoscope Today 27th January 2023: ఈ రాశివారు మంచి మార్గంలో జీవిస్తారు, జనవరి 27 రాశిఫలాలు
Rasi Phalalu Today 27th January 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Horoscope Today 27th January 2023: ఈ రాశివారు మంచి మార్గంలో జీవిస్తారు, జనవరి 27 రాశిఫలాలు Horoscope Today 26th January 2023: Rasi Phalalu Astrological Prediction for Aries, leo, Gemini and other Zodiac signs in Telugu Horoscope Today 27th January 2023: ఈ రాశివారు మంచి మార్గంలో జీవిస్తారు, జనవరి 27 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/946588f304c559f36c97000ca3314cd61674742215670217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today 27th January 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశి ఉద్యోగులకు పురోభివృద్ధితో పాటూ ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీరు ఓ చెడు పనిలో విజయం సాధిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రోజంతా ప్రయాణంలో గడిచిపోతుంది. కార్యాలయ పనులతో బిజీగా ఉంటారు.బంధువులను కలుస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మిథున రాశి
ఈ రోజు మీకు ఆకస్మిక ద్రవ్య లాభాలు అందవచ్చు. పనిలో శ్రమ తర్వాత విజయం తక్కువగా ఉంటుంది... అందుకే కొంత ఓపిక అవసరం. పనికి సంబంధించి చేసే ప్రయత్నాల్లో జాప్యం జరగొచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకోవడం మంచిది
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులు, ఉద్యోగులకు మంచి రోజు. ఉద్యోగులకు ఉన్నతాధికారులనుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు బావుంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
Also Read: ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆచార్యుడు ఈ తరానికి సమతా మూర్తి చినజీయర్ స్వామి!
సింహ రాశి
ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. కెరీర్ పరంగా కొన్ని ప్రత్యేక మార్పులు ప్లాన్ చేసుకుంటారు. పిల్లల చదువుకి సంబంధించి కొంత సమయం కేటాయించండి. ఆహారం విషయంలో ఎలాంటి అజాగ్రత్త వద్దు.
కన్యా రాశి
ఈ రోజు మీ ప్రేమ జీవితానికి పరీక్షలా ఉంటుంది. మీ ప్రియమైన వారు మీతో చెప్పిన విషయం మిమ్మల్ని బాధిస్తుంది...కానీ ఓపికపట్టండి. కోపం తగ్గించుకోవడం మంచిది. కుటుంబానికి సమయం కేటాయంచి మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.
తులా రాశి
ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి..ఇది మీ ఇబ్బందులకు కారణం కావొచ్చు. కుటుంబంతో మీ సమన్వయం బావుంటుంది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్నాక..వారికి సహకరించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు తమ పనులపై శ్రద్ధ వహించండి.
వృశ్చిక రాశి
ఈ రోజు మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. రాబోయే కొద్ది రోజుల్లో మీరు కొన్ని పెద్ద పని కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంతో కలిసి మాట్లాడి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు.
Also Read: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయం పెరగడంతో పాటూ ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. మీ ఆలోచనా విధానం బావుంటుంది...మంచి మార్గంలో జీవిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
మకర రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు..ఈ కారణంగా మీరు ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటారు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి
ఈ రోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకుని వెళ్లడం మంచిది. బాధ్యతారహితమైన వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది..వారి ప్రభావం మీపై పడుతుందని తెలుసుకోండి.
మీన రాశి
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ప్రత్యర్థులను దూరం ఉంచుతారు. మీ ఆలోచన కొంతమంది కుటుంబ సభ్యుల దృక్పథాన్ని మార్చవచ్చు. ఇతరులపై మీ అభిప్రాయాన్ని రుద్దకండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)