అక్టోబరు 26 రాశిఫలాలు - ఈ రాశులవారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి!
Dussehra Horoscope 26th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబరు 26 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు సానుకూల ఆలోచనతో ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాహిత్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీరు వృద్ధుల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మంచి రోజు అవుతుంది.
వృషభ రాశి
ఈ రోజు మీరు కార్యాలయంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. డబ్బు సమస్య తీరుతుంది. పిల్లలు చదువుల్లో బిజీగా ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. ఎవరైనా మిమ్మల్ని కంగారు పెట్టవచ్చు.
మిథున రాశి
ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి సలహాలు వస్తాయి. మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు జరుగుతాయి. ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందుతారు. యువతకు శాశ్వత ఆదాయ వనరులు లభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త పథకాలలో పెట్టుబడి పెట్టడం చాలా లాభదాయకంగా ఉంటుంది.
Also Read: దీపావళి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 అద్భుతమైన విషయాలు!
కర్కాటక రాశి
ఈ రాశి ఉద్యోగులు పదోన్నతి లేదా బదిలీకి సంబంధించిన సమాచారం వింటారు. కొన్ని చిన్న విషయాలపై కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండవచ్చు. కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి
ఈ రోజు మీ ఆలోచనల్లో కొంత మార్పు ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అప్పులు తీర్చడానికి ఇది మంచి సమయం. రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. వివాహ సంబంధాల మధ్య దూరం తగ్గవచ్చు. వ్యాపారంలో అదనపు శ్రమ ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజు స్నేహితులతో సమయం కేటాయిస్తారు. చేపట్టిన పనుల్లో నష్టపోతారు. ఇతరుల పట్ల అసూయ భావాలు ఉండవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. కొంతమంది మీ సలహాను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సంయమనంతో మాట్లాడండి. అధిక ఖర్చుల వల్ల ఇబ్బందులు ఉంటాయి.
తులా రాశి
ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఈ రోజు ప్రారంభం అవుతాయి. ఇంటి నిర్మాణానికి ప్లాన్ చేసుకోవచ్చు. అధికారుల అంచనాలకు తగ్గట్టుగా ఈ రాశి ఉద్యోగుల పనితీరు ఉంటుంది. నూతన జీవితం ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.
వృశ్చిక రాశి
ఈ రోజు కొత్త ప్లాన్‌లను ప్రారంభించవచ్చు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. కుటుంబ సభ్యుల కోసం నచ్చిన బహుమతి కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇల్లు , కార్యాలయంలో సమతుల్యతను కాపాడుకోండి.
Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!
ధనస్సు రాశి
ఈ రోజు మీరు కుటుంబం పట్ల బాధ్యత వహిస్తారు. ఎవరికైనా సహాయం చేయడం పట్ల మీ వైఖరి ఉదారంగా ఉంటుంది. మీరు కొన్ని పనులపై అనుకోని ప్రయాణం చేయవలసి రావచ్చు. బహుమతులు అందుకుంటారు. స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.
మకర రాశి
మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేస్తారు...అప్రమత్తంగా వ్యవహరించండి. వృత్తి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ప్రవర్తనని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. ముఖ్యమైన పనులు అసంపూర్తిగా మిగిలిపోతాయి. ప్రతికూల అంశాలు మీపై చాలా ప్రభావం చూపిస్తాయి.
కుంభ రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. మీ నైపుణ్యంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇతరులతో మీ ప్రవర్తనావిధానం మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. బంధాల విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించేందుకు మంచి సమయం ఇది.
Also Read: దీపావళి రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే శనిదోషం మాయం - విధానం ఇదే!
మీన రాశి
వ్యాపారంలో కొత్త భాగస్వామితో కలిసి పని చేసే అవకాశం మీకు లభిస్తుంది. కర్మాగారాల్లో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణానికి అవసరమైన కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.