అన్వేషించండి

అక్టోబరు 22 రాశిఫలాలు - ఈ రాశివారు జీవిత భాగస్వామి దగ్గర ఈ రోజు ఏ విషయం దాచొద్దు!

Dussehra Horoscope 22nd October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబరు 22 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు పనిలో ఒత్తిడి తగ్గుతుంది. రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. మీరు ప్రయాణానికి సంబంధించి మీ ప్రణాళికలలో మార్పులు చేసుకుంటారు. రాజకీయ నాయకులు, మీడియా రంగంలో ఉండేవారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో ప్రయోజనకరంగా మారుతాయి.
 
వృషభ రాశి

ఈ రోజు మీ ఆనందం , విజయం చూసి మీ ప్రత్యర్థులు అసూయపడతారు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు గుడ్ న్యూస్ వింటారు.  అధిక రక్తపోటు ఉన్న రోగులు వైద్యుడిని సంప్రదించాల్సి రావొచ్చు. ఈ రాశి స్త్రీలు పనిలో ఒత్తిడికి లోనవుతారు. 

మిథున రాశి

ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై పని చేయడం ప్రారంభించవచ్చు. స్త్రీలు ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. 

Also Read: ఈ దీపావళికి అయోధ్యలో అద్భుతం..అస్సలు మిస్సవకండి!

కర్కాటక రాశి

తీసుకున్న అప్పులు తిరిగి  చెల్లించే విషయంలో ఆందోళన చెందుతారు. ఇంటి విషయాల్లో బయటి వ్యక్తులెవరూ జోక్యం చేసుకోవద్దు. వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.  మైగ్రేన్ రోగులు జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. 

సింహ రాశి

ఈ రోజు ఈ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనికిరాని కార్యకలాపాలకు వృధాగా ఖర్చు చేస్తారు. నూతన ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. 
 
కన్యా రాశి

వ్యాపారంలో చాలా కష్టపడవలసి రావొచ్చు కానీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.  మీరు కుటుంబంలోని పెద్దలతో ముఖ్యమైన చర్చలు జరుపుతారు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

తులా రాశి

సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. యువత తమ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారు ఇంక్రిమెంట్ పొందవచ్చు. మీరు అందరితో ప్రేమగా ప్రవర్తిస్తారు మరియు అందరికీ ఇష్టమైనవారు అవుతారు. మీ ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉంచండి. 

Also Read: అక్టోబరు 29, 30 ఈ రెండు రోజులు సాయంత్రం ఈ దీపం వెలిగించడం మర్చిపోవద్దు!

వృశ్చిక రాశి

ఏదైనా వ్యసనాన్ని వదులుకోవడానికి మీరు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కార్యాలయంలో పురోగతిలో ఇబ్బంది ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులను జాగ్రత్తగా వాడండి. హోటల్ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామి దగ్గర ఏ విషయం దాచవద్దు. వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి 

ధనస్సు రాశి

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కెరీర్ గురించి మంచి సమాచారాన్ని పొందుతారు. అనుకున్న లక్ష్యాలను సమయానికి సాధిస్తారు. కొత్తగా పెళ్లైన  వారు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమికులు ఈరోజు పెళ్లి గురించి చర్చించుకోవచ్చు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది 

మకర రాశి

ఈ రోజు మీరు మీ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు. ఆర్థిక  లావాదేవీలలో పొరపాట్లు ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ రోజు మీరు సానుకూల ఆలోచనలతో ఉంటారు. వ్యక్తిగత సమస్యలు వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆకస్మికంగా పాత ఆస్తులను విక్రయించే అవకాశాలు ఉన్నాయి. 

కుంభ రాశి

ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఇంటికి అతిథులు వస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు శుభప్రదమైన రోజు అవుతుంది. ఒత్తిడి దూరం అవుతుంది. వ్యాపారంలో మార్పులు, చేర్పులకు ఇదే రైట్ టైమ్. ఉద్యోగులు పనిని నిర్లక్ష్యం చేయవద్దు.

మీన రాశి

ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది.  మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంలో అలసత్వం వహించవద్దు. సామర్థ్యాలను దుర్వినియోగం చేయవద్దు. 

Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఉద్యోగాల భర్తీ, ములుగు వర్శిటీకి భూకేటాయింపు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఉద్యోగాల భర్తీ, ములుగు వర్శిటీకి భూకేటాయింపు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Sabarimala Alert: ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ABP Southern Rising Summit:  కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
Best CNG Car Under Rs 10 Lakh: హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ Second Test Day 3 Highlights | మూడోరోజుల్లో భారత్ కథ ముగించేసిన న్యూజిలాండ్ | ABP DesamSai Durgha Tej On His Career | ABP Southern Rising Summit 2024 లో సాయి దుర్గ తేజ్ | ABP Desamనేనింకా ఎందుకు బతికున్నానని నా తల్లి వేదన, ప్రెస్ మీట్‌లో ఏడ్చేసిన షర్మిలసౌత్‌పై ఇంత చిన్న చూపా మోదీజీ, ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఉద్యోగాల భర్తీ, ములుగు వర్శిటీకి భూకేటాయింపు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఉద్యోగాల భర్తీ, ములుగు వర్శిటీకి భూకేటాయింపు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Sabarimala Alert: ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు నిబంధనల సడలింపు
ABP Southern Rising Summit:  కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
కేసులు పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి - ఏబీపీ సదరన్ సమ్మిట్‌లో రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు
Best CNG Car Under Rs 10 Lakh: హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ వర్సెస్ టాటా పంచ్ సీఎన్‌జీ - రెండిట్లో ఏది బెస్ట్ సీఎన్‌జీ కారు?
Anantapuram News: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
Jio Diwali Special Plan: జియో దీపావళి స్పెషల్ ప్లాన్ ఇదే - అన్‌లిమిటెడ్ 5జీ కూడా!
జియో దీపావళి స్పెషల్ ప్లాన్ ఇదే - అన్‌లిమిటెడ్ 5జీ కూడా!
Telangana News: స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటులో మరో ముందడుగు, మేఘా ఫౌండేషన్ రూ.200 కోట్ల విరాళం
స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటులో మరో ముందడుగు, మేఘా ఫౌండేషన్ రూ.200 కోట్ల విరాళం
ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Embed widget