Horoscope Today 21st june 2024: ఈ రాశివారి మాటతీరులో ఉండే సౌమ్యత వారి గౌరవాన్ని పెంచుతుంది - జూన్ 21 రాశిఫలాలు !
Horoscope Prediction 21st june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
![Horoscope Today 21st june 2024: ఈ రాశివారి మాటతీరులో ఉండే సౌమ్యత వారి గౌరవాన్ని పెంచుతుంది - జూన్ 21 రాశిఫలాలు ! Horoscope Today 21st june 2024 Astrological prediction for june 20 2024 rasi phalalu in telugu Horoscope Today 21st june 2024: ఈ రాశివారి మాటతీరులో ఉండే సౌమ్యత వారి గౌరవాన్ని పెంచుతుంది - జూన్ 21 రాశిఫలాలు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/20/d7bcbd27c6b7dba481989884513dc1071718895340123217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Daily Horoscope Predictions in Telugu
మేష రాశి
ఈ రోజు వ్యాపారంలో నష్టపోయే సూచనలున్నాయి అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ వహించాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
వృషభ రాశి
వ్యాపారంలో వినూత్న ప్రయోగాలు చేసేందుకు మంచి రోజు. పాత స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు శుభసమయం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.
మిథున రాశి
ఈ రోజ మీరు ఆశించని పెద్ద ప్రయోజనం పొందుతారు. అనవసర ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. తొందరపడి ఏ పనీ చేయవద్దు. రహస్య శత్రువులు మీకు హానిచేసేందుకు పథకాలు వేస్తారు..ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించండి.
Also Read: జ్యేష్ట పౌర్ణమి విశిష్టత - ఈ రోజుని ఏరువాక పున్నమి అని ఎందుకంటారు..ఈ రోజు ఏం చేస్తారు!
కర్కాటక రాశి
నూతన ఆస్తులు విక్రయించాలి అనుకుంటే ఇదే సరైన సమయం. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కొన్నిపనులు మధ్యవర్తుల ద్వారా పరిష్కారం అవుతాయి.
సింహ రాశి
ఈ రాశి వ్యాపారులు పెద్ద మార్పులు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజంతా బిజీ బిజీగా ఉంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కారం అవుతాయి. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
కన్యా రాశి
ఈ రోజంతా ఈ రాశివారు ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్నేహితులతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం మంచిది.
తులా రాశి
ఈ రాశివారు నూతన పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టుల బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయంగా భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చేసే పనివిషయంలో అజాగ్రత్తగా వ్యవహరించవద్దు.
Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!
వృశ్చిక రాశి
మీడియా రంగంలో ఉండే ఈ రాశివారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ మాటతీరుతో చాకచక్యంగా కొన్ని క్లిష్టమైన విషయాలను పరిష్కరిస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో లాభపడతారు. పదోన్నతి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి.
ధనస్సు రాశి
ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులకు కార్యాలయంలో అవమానాలు ఎదురవుతాయి. భవిష్యత్ కోసం పెట్టే పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి.
మకర రాశి
ఈ రాశివారి జీవితంలో సానుకూల మార్పులు ఉండవచ్చు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!
కుంభ రాశి
ఈ రోజు మీరు చేసే దానధర్మాలు మానసిక ప్రశాంతతని ఇస్తాయి. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కొన్ని శుభవార్తలు మీ రోజును మారుస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన పట్ల మీరు కొంచెం కలత చెందుతారు. రోజంతా బిజీగా ఉంటారు.
మీన రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ పనులు ఈ రోజు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ మాటతీరులో ఉండే సౌమ్యత మీ గౌరవాన్ని పెంచుతుంది. ఆదాయం బావుంటుంది.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)