అన్వేషించండి

Horoscope Today January 17th 2024 :ఈ రాశివారి ఉద్యోగ జీవితంలో కీలక మలుపు రాబోతోంది, జనవరి 17 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 17th January  2024  - జనవరి 17 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 
ఈ రోజు కార్యాలయంలో కొన్ని ఊహించని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది, కానీ అవి మిమ్మల్ని నిరుత్సాహపరచవు.  సహోద్యోగులు,  ఉన్నతాధికారుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు వ్యక్తిగతంగా , వృత్తిపరంగా పరిచయాలు పెంచుకుంటారు. మీ అభిప్రాయాలను పంచుకోవడానికి భయపడకండి. ఇతరుల సలహాలు స్వీకరించాలి కానీ మీకు సంబంధించిన నిర్ణయం పూర్తిగా మీరే తీసుకోవడం మంచిది. ఈ రోజు కుటుంబంలో కొంత ప్రశాంతత ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీ ప్రియమైన వారితో  నిజాయితీగా మాట్లాడేందుకు ప్రయత్నించాలి. 

మిథున రాశి (Gemini Horoscope Today) 

డబ్బుకు సంబంధించిన విషయాలు మీ మనస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే భయపడొద్దు..కృషిని మధ్యలోనే ఆపేయవద్దు. ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ ఉంచండి. స్వీయ సంరక్షణ కోసం సమయాన్ని వెచ్చించండి. మిమ్మల్ని సంతోషపరిచే కార్యకలాపాలలో పాల్గొనండి. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మీ మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మీకు అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికి సంకోచించకండి.

Also Read: హోమాలు, యజ్ఞయాగాలు ఎందుకు - వాటివల్ల ఏం ఉపయోగం!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

మీ భాగస్వామికి మిమ్మల్ని మీరు వ్యక్తపరచండి..మీ మనసులో ఉన్న మాటని చెప్పండి. విరోధువకు చెక్ పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీ వృత్తి జీవితంలో కొత్త మలుపు రాబోతోంది. మీ కెరీర్ లక్ష్యాలను ప్రతిబింబించే అవకాశంగా దీన్ని తీసుకోండి. మీరు ఉన్న చోట సంతోషంగా ఉన్నారా లేదా మీకు మార్పు అవసరమా అన్నది మరోసారి ఆలోచించి అడుగువేయండి. ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా తీసుకోండి. 

సింహ రాశి (Leo Horoscope Today)

ఈరోజు మీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. చేయాలి అనుకున్న పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి..మధ్యలోనే ఆపేయవద్దు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. కుటుంబ జీవితం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

మీ ఆరోగ్యం బాగుంటుంది. తీవ్రమైన వ్యాధి నుంచి మీరు బయటపడతారు. తల్లిదండ్రులకు సమయం కేటాయించాలి.  ఇంట్లో సంతోషకరమైన వాతావరణం క్రియేట్ చేసుకోవడం మంచిది. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయవద్దు. వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఆర్థిక సంబంధిత విషయాల్లో మార్గదర్శకత్వం కోసం మీరు ఆర్థిక నిపుణుల సహాయాన్ని కూడా తీసుకోవచ్చు.

Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 

తులా రాశి (Libra Horoscope Today) 

ఫైనాన్స్ ,విదేశీ క్లయింట్‌లతో పనిచేసే వ్యక్తులు వృద్ధికి మరిన్ని అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలు ఈరోజు కొత్త భాగస్వామ్యాలను ప్రారంభించకూడదు, ఎందుకంటే గ్రహాలు అనుకూల ఫలితాలనివ్వడం లేదు. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు బలంగా ఉంటారు. స్టాక్ మార్కెట్, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ , మ్యూచువల్ ఫండ్‌లు దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయం

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

మీ వృత్తి జీవితం సవాలుగా ఉంటుంది. మరికొంత పని మీ భుజాలపై పడుతుంది. ఈ రోజు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు కార్యాలయంలో కుట్రకు బాధితులు కావచ్చు. బాధను పెంచే అంశాలకు దూరంగా ఉండడం మంచిది. ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లు పెళ్లి గురించి ఆలోచించవచ్చు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండ మంచిది. 

Also Read: 'రామో విగ్రహవాన్ ధర్మః' అని ఎందుకంటారు - రాముడు ధర్మం తప్పిఉంటే !

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

గృహ జీవితంలో వివాదాలు మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కార్యాలయంలో సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఈరోజు ఆర్థికంగా బాగా రాణిస్తారు. ఈ రోజు మీ ప్రేమ జీవితం ఊహించినంత ఆనందంగా ఉండదు. కుటుంబ బంధాల్లో మూడో వ్యక్తి అవకాశం ఇవ్వవద్దు.కాస్త ఓపికగా వ్యవహరించడం మంచిది. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

ఈ రోజు ఆర్థిక సంబంధిత విషాలకు మంచి సమయం. ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటే కలిసొస్తాయి. ఆర్థిక వనరులను సక్రమంగా ఉపయోగించుకోవాలి. మీ భావోద్వేగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి .  శారీరక, మానసిక  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మీకు ప్రియమైనవారితో కఠినంగా వ్యవహరించవద్దు. వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకునేందుకు ప్రయత్నిస్తేనే మంచి ఫలితాలు సాధిస్తారు. పిల్లల కోసం అండగా నిలబడడండి. ఉద్యోగులు, వ్యాపారులకు ఎదురైన సవాళ్లు వాటికవే సమసిపోతాయి. 

Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!

మీన రాశి (Pisces Horoscope Today) 

దీర్ఘకాలిక లాభాల కోసం స్టాక్స్ , మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిది. స్నేహితుల్లో ఒకరి సమస్య మీకు బాధ కలిగించవచ్చు .కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునేముందు మీ మనసు చెప్పింది వినండి. ఒంటరిగా సమయం గడపాలని అనిపిస్తుంది. వైవాహిక జీవితం బావుంటుంది.

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, నిందితులకు బెయిల్
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
PV Sindhu Wedding: ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
ఘనంగా పీవీ సింధు వివాహం, ఉదయ్‌పూర్‌లో వెంకట దత్తసాయితో ఏడడుగులు వేసిన స్టార్ షట్లర్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Weather Update Today: ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలతో అలర్ట్, మత్స్యకారులకు వార్నింగ్- తెలంగాణపై నో ఎఫెక్ట్
Embed widget