జూన్ 27 రాశిఫలాలు, ఈ రాశులవారు మహా మాటకారులు - ఈ రోజు అనుకున్న పనులు పూర్తిచేసేస్తారు!
Rasi Phalalu Today June 27th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
జూన్ 27 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. వ్యాపార రంగంలో కూడా విజయాన్ని అందుకుంటారు. ఈరోజు మీకు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కమ్యూనికేషన్ పెరుగుతుంది. కొత్త పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు సేవాకార్యక్రమాలకు కూడా అనుకూలమైన రోజు. మానసిక ఆనందం కొనసాగుతుంది.
వృషభ రాశి
ఈరోజు మీరు అన్నిటిలో విజయం సాధిస్తారు. మీ ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకుంటారు, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త సంబంధాలు ఏర్పడి భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదవడం, రాయడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీరు ఫలితం గురించి ఆందోళన చెందనప్పటికీ, కష్టపడి పని చేస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
మిథున రాశి
ఈ రోజు మీరు కొత్త సంబంధాన్ని ఏర్పరచుకునే దిశగా ముందుకు సాగవచ్చు. మనసులో ఆందోళన ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల మానసిక అలసట ఎక్కువ అవుతుంది. ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యులతో డబ్బుకు సంబంధించిన వివాదం రావచ్చు. ఈరోజు ప్రయాణం వాయిదా వేసుకోవటం మంచిది.
Also Read: ఈ వారం ఈ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ సమయం, జూన్ 26 నుంచి జూలై 2 వారఫలాలు
కర్కాటక రాశి
ఈ రోజు లాభం ఉంటుంది. బంధువులను కలవడం ద్వారా సంతోషం పొందుతారు. కొత్త ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై విజయం ఉంటుంది. సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది.
సింహ రాశి
మీ కుటుంబ సభ్యులతో సంతోషం పెరుగుతుంది. సంబంధాలలో దృఢత్వం ఉంటుంది, ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. మితిమీరిన ఖర్చులను నివారించాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక ప్రకారం పని చేసినా అనుకున్న విజయం దక్కదు. కొన్ని పనుల్లో లాభం ఉంటుంది. కొన్నిటిలో నష్టముంటుంది.
కన్యా రాశి
ఈరోజు మీకు శుభదినం . ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. బంధువులను కలుస్తారు. ప్రయాణం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే కార్యక్రమం ఉంటుంది. మీ ప్రవర్తనలో మార్పును గమనిస్తారు.
తులా రాశి
ఓర్పు,సహనం తో ముందుకు సాగండి. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. నూతన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టు పనుల్లో జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మికత, దైవభక్తి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభదినం. అవివాహితులకు వివాహానికి అవకాశం ఉంది. వ్యాపార రంగంలోనూ విశేష ప్రయోజనాలు ఉంటాయి. అధికారులు మీ పని పట్ల సంతోషిస్తారు. మిత్రులను కలుస్తారు. ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మంచి ఆనందకరమైన రోజు. పనిలో విజయం సాధిస్తారు. లాభం పొందే అవకాశం ఉంది. వ్యాపార పనులపై ఎక్కడికైనా వెళ్లాల్సి రావచ్చు. బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలను మెరుగైన మార్గంలో పూర్తి చేయగలుగుతారు.
Also Read: సీతా దేవి నేపాల్‌లో పుట్టిందా -భారత్ లో పుట్టిందా, ఆధారాలేంటి - ఏది నిజం!
మకర రాశి
ఈ రోజు మీరు వ్యాపార రంగంలో కొత్త ఆలోచనల ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తారు. సృజనాత్మకత వైపు మొగ్గు చూపుతారు. మీ మానసిక ఆరోగ్యం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎవరి వల్లనైనా మీరు బాధపడే అవకాశముంది. అధిక ఖర్చులుంటాయి. ప్రత్యర్థులతో చర్చలకు దూరంగా ఉండండి.
కుంభ రాశి
అనవసర పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. మాటపై సంయమనం పాటించండి. మీరు వివాదాలకు దూరంగా ఉండగలరు. ఒక సంఘటనను సానుకూల దృక్కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధిక వ్యయం కారణంగా ధన సంక్షోభం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. శారీరక, మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మీన రాశి
ఈ రోజు మీరు మీ ప్రతిభను కనబరచడానికి అవకాశం పొందుతారు. మీరు భాగస్వామ్య పనులలో లాభపడతారు. శారీరక ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. పర్యాటకాన్ని ఆస్వాదించగలుగుతారు. దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం, మధురానుభూతి ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.