అన్వేషించండి

జూన్ 23 రాశిఫలాలు, ఈ రాశివారు బిజీ లైఫ్ లోంచి కొంత సమయం కుటుంబానికి కేటాయించాలి!

Rasi Phalalu Today June 23nd : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

జూన్ 23 రాశిఫలాలు

మేషరాశి
ఈరోజు మీకు శుభ ప్రదంగా ఉంటుంది . మీరు ఎదుటి వారిని చూసి కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈ రోజు అందరి తో  మీ వైఖరి బాగుంటుంది. స్నేహితులతో  ఉన్న అపార్థాలు ఈరోజు తొలగిపోతాయి. మీరు కొన్ని పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. నమ్మకంతో  కష్టపడి పనిని పూర్తి చేసి విజయం సాధిస్తారు. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు వ్యాపారంలో సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. 

వృషభ రాశి
ఈరోజు మొత్తం ఆనందంగా గడుపుతారు . ఇంటికి అతిథిల రాకతో సంతోషం పెరుగుతుంది. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా విషయాన్ని చాలా చక్కగా పరిష్కరిస్తారు. కర్మాగారానికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి  ఈ రోజు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదో ఒక పనిలో పెద్దల నుంచి సలహాలు పొందుతారు. 

మిధున రాశి
ఈరోజు కార్యాలయంలో మీ బాస్ మీకు అప్పగించిన పనిని నిజాయితీగా పూర్తిచేస్తారు. మీ బిజీ లైఫ్ నుంచి  కొంత సమయాన్ని,  మీ కుటుంబం కోసం కూడా వెచ్చిస్తే మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో చేసే పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు మీ పనిని ఇతరుల ద్వారా పూర్తి చేయగలుగుతారు. కర్మాగారాల్లో పనిచేసే వారికి ఈరోజు మంచి లాభాలు ఉంటాయి. మీ తెలివితేటలతోనే ఖర్చు చేయండి. 

Also Read: మీరు ఈ టైమ్ లో జన్మించినట్టైతే మీ వ్యక్తిత్వం చాలా మంచిది!

కర్కాటక రాశి
ఈరోజు విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ ఉనికికి ప్రాముఖ్యత లభిస్తుంది. మిమ్మల్ని ఆకట్టుకునే వ్యక్తిని మీరు కలుస్తారు. ఎప్పటి నుంచో వసూల్ కాని రుణాలు ఇప్పుడే పొందే అవకాశం ఉంది . ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు తమ చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. మీ విజయానికి అవకాశాలు లభిస్తున్నాయి. క్రీడలతో అనుబంధం ఉన్న వ్యక్తులు వారి కోచ్ నుంచి కొత్తగా నేర్చుకుంటారు.  వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. 

సింహ రాశి 
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. తెలియని వ్యక్తిని ఎక్కువగా విశ్వసించవద్దు వారివల్ల మీకు హాని కలిగే అవకాశం ఉంది.  ఇంటి పెద్దల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ ప్రవర్తనతో అందరిని మీ వైపుకి తిప్పుకుంటారు. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు ప్లాన్ చేస్తారు.  నేత్ర  సంబంధిత సమస్యల  విషయంలో నిర్లక్ష్యం చేయకండి. 

కన్యా రాశి
ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆస్తికి సంబంధించి చర్చలు జరుగుతాయి, ఫైనాన్స్‌కు సంబంధించిన కొన్ని ప్రణాళికలు వేస్తారు. కుటుంబాన్ని కలిసి కట్టుగా నడిపించటానికి  మీరు కృషి చేస్తారు. అవసరమైన వారికి సహాయం చేస్తారు. అనవసర చర్చలకు దూరంగా ఉంటారు. మీరు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. మీ మంచి ఆలోచనలు వలన మీకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది.  తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా  ఉండండి.

తులా రాశి
ఈరోజు మీరు విజయాన్ని పొందుతారు. మీ సహోద్యోగులు, స్నేహితుల మద్దతు పొందడం వల్ల ఈరోజు మీ వ్యాపారంలో ఎదురైన  సమస్యలు తొలగిపోతాయి. మీరు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉంటుంది. ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఉపాధ్యాయులకు గౌరవం దక్కుతుంది. 

వృశ్చిక రాశి
ఈ రోజు  ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. మీరు పనులు చేయడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. కార్యాలయంలో మీ సహోద్యో గులకి ఆదర్శంగా మారతారు. ప్రజలకు సహాయం చేయాలనే తపన మనస్సులో పుడుతుంది. వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. ఈ రోజు మీరు స్నేహితుడి నుంచి డబ్బును పొందుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దంపతుల మధ్య కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి,సంబంధాలు బలంగా మారుతాయి.

ధనుస్సు రాశి
ఈ రోజు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి సమయం. శ్రమకు తగ్గ  ఫలితాలు వస్తాయి.స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.పాత స్నేహితుల్ని కలిసే అవకాశముంది. ఈరోజు ముఖ్య మైన పనుల గురించి చర్చిస్తారు. శత్రు పక్షాలు మీ ప్రణాళికలకు తలవంచుతారు. 

Also Read: పూరీలో వంటకాలను స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందట అందుకే అంత రుచి!

మకర రాశి
ఈ రోజు మీకు అత్యంత శుభదినం. మీ క్లిష్ట పరిస్థితుల్లో, మీకు కుటుంబం అండగా ఉంటుంది . ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు ఈ రోజు తొలగిపోతాయి. సంబంధాలు మెరుగు పడతాయి. అదృష్టం కలిసి రానందు వలన ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అదృష్టం మీద ఆధారపడకండి. రాజకీయాలతో ముడిపడిన వారికి పెద్ద పదవులు దక్కుతాయి. 

కుంభ రాశి
ఈరోజు  మీకు శుభదినం. తలపెట్టిన పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో విజయానికి కూడా ఉపయోగపడుతుంది. ఇతరుల అభిప్రాయాలను తీసుకోవడం మానుకోండి. పనిలో సన్నిహితులు, ప్రియమైన వారి సహాయం తీసుకోవడం మంచిది, అప్పుడు పని సులభంగా విజయవంతమవుతుంది. మీ కృషి మీ జీవితంలో విజయ బావుటా ఎగరేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో పండగ  వాతావరణం ఉంటుంది. సానుకూల ఆలోచనను కొనసాగించండి.

మీన రాశి
ఈ రోజు మీకు శుభ దినం కానుంది. వ్యాపారులు ఈరోజు లాభాలు గడిస్తారు. ఈ రోజు మీ జీవితంలో కొనసాగుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఎవరితోనైనా వాగ్వాదం రావచ్చు. మీరు శక్తి యుక్తులతో పని చేస్తారు. ఏదైనా పని చేసే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి, తద్వారా మీరు పని చేయడం సులభం అవుతుంది. సోషల్ మీడియాలో ప్రముఖులకు ఈరోజు మంచి రోజు. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో చేసే పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజున మీరు మీ పనిని ఇతరుల ద్వారా పూర్తి చేయగలుగుతారు. కర్మాగారాల్లో పనిచేసే వారికి ఈరోజు మంచి లాభాలు ఉంటాయి. తెలివిగా ఖర్చు పెట్టండి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget