AB Devilliers | వరల్డ్ కప్ వరకు జట్టులో ఉండాలంటే రోహిత్, కోహ్లీ పరుగులు చేయాల్సిందేనన్న డివిలియర్స్
2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా జట్టులో ఉంటారని గ్యారెంటీ లేదని సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. ప్రపంచకప్ 2027 ఆడబోయే ఇండియన్ టీంలో చోటు దక్కాలన్నా, సెలక్టర్లు వాళ్లపై నమ్మకం ఉంచి టీమ్‌లోకి సెలక్ట్ చేయాలన్నా.. రోహిత్, విరాట్‌లు చాలా కష్టపడాలని, కనీసం వన్డే జట్టులో కంటిన్యూ కావాలన్నా రాబోయే సిరీస్‌ల్లో ఇద్దరూ భారీగా పరుగులు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని అన్నాడు. అంతేకాకుండా.. వన్డే క్రికెట్‌లో టీమిండియా కొత్త కెప్టెన్‌గా గిల్‌ను సెలక్ట్ చేయడంపై కూడా డివిలియర్స్ రియాక్ట్ అయ్యాడు. సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించిన ఏబీడీ.. గిల్ అద్భుతమైన కెప్టెన్. దానికి తోడు రోహిత్, విరాట్ వంటి సీనియర్ ప్లేయర్స్ జట్టులో ఉండటం వల్ల అతను చాలా నేర్చుకోగలుగుతాడన్నాడు. ఇదిలా ఉంటే టీమ్ ఇండియా త్వరలోనే ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లబోతోంది. ఈ టూర్‌లో 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్‌తోనే శుభ్‌మన్ గిల్ వన్డేలకి కెప్టెన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సిరీస్‌తోనే రోహిత్, కోహ్లీ ఇద్దరూ చాలా కాలం తర్వాత వన్డేలు ఆడబోతున్నారు. మరి డివిలియర్స్ చెప్పినట్లే రోహిత్, కోహ్లీ ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారిస్తారో లేదో చూడాలి. అయితే ఒకవేళ ఈ సిరీస్‌లో వీళ్లిద్దరూ పరుగుల వరద పారించకపోతే.. ఆ తర్వాతి సిరీస్ నుంచే వీళ్లని జట్టు నుంచి తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదు.





















