Rohit Sharma Records | వన్డేల్లో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డులు రోహిత్ శర్మ సొంతం
టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మని తొలగించి శుభ్‌మన్ గిల్‌ని జట్టుకి కొత్త కెప్టెన్‌గా అనౌన్స్ చేసింది BCCI సెలక్షన్ కమిటీ. ఈ డెసిషన్‌పై ఇప్పటికే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విపరీతంగా వ్యతిరేతక వస్తోంది. అయితే కొంతమంది మాత్రం.. కెప్టెన్సీ ఉన్నా.. లేకపోయినా రోహిత్ శర్మ రేంజ్ ఏ మాత్రం తగ్గదని, అసలు క్రికెట్లో హిట్‌మ్యాన్ క్రియేట్ చేసిన రికార్డులని బద్దలు కొట్టడం కాదు.. కనీసం టచ్ చేసే దమ్మైనా ఎవరికైనా ఉందా..? అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి.. రోహిత్ గురునాథ్ శర్మ.. ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్ సృష్టించిన రికార్డులని రాబోయే 100 ఏళ్లలో ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మన్ కూడా బద్దలు కొట్టలేడు. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. వాళ్లన్న మాట కూడా కొంతవరకు నిజమే. 38 ఏళ్ల వయసులోనూ రోహిత్ శర్మ ఇప్పటికీ ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో టాప్2లో ఉన్నాడు. ఓపెన్‌గా ఫస్ట్ బంతి నుంచే బౌలర్లకి చుక్కలు చూపించే హిట్ మ్యాన్.. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్ తన పేరిట రాసుకున్నాడు. అంతేకాకుండా.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులు చేసిన బ్యాటర్ కూడా రోహిత్ శర్మనే. ప్రపంచ క్రికెట్లో అత్యధికంగా 637 సిక్స్‌లు బాది సిక్స్‌ల వీరుడు క్రిస్‌గేల్‌ని కూడా దాటేశాడు హిట్ మ్యాన్. ఇక వలర్డ్ కప్ పేరు వినపడితే చాలు హిట్ మ్యాన్ సెంచరీలతో రెచ్చిపోతాడు. ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్స్‌లో మొత్తంగా 7 సెంచరీలు బాది.. వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే.. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఏకంగా 5 సెంచరీలు బాది.. ఒకే వరల్డ్ కప్‌లో ఇన్ని సెంచరీలు బాదిన రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కెప్టెన్‌గా 2024 టీ20 వరల్డ్ కప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2018 - 2023 ఆసియా కప్‌లు అందించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు జట్టును ఓటమనదే లేకుండా తీసుకెళ్లాడు. అలాగే రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా 56 వన్డేలు ఆడితే.. అందులో 75 పర్సెంట్ విన్నింగ్ రేట్‌తో 42 మ్యాచ్‌లు గెలిపించాడు. అది హిట్ మ్యాన్ సత్తా. మరి ఇలాంటి తిరుగులేని రికార్డులెన్నో సృష్టించాడు హిట్‌మ్యాన్. ఇవన్నీ చూస్తే నిజంగానే రోహిత్‌కి కెప్టెన్సీ లేకపోతే ఏం? అతడు సృష్టించిన రికార్డులు 100 ఏళ్లు కాకపోయినా.. మరో రెండు, మూడు దశాబ్దాల వరకు మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేరు. అది గ్యారెంటీ.




















