News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Horoscope Today 20 November 2023: ఈ రాశివారి ఉద్యోగ జీవితం కొత్త మలుపు తిరగబోతోంది!

Today Rasi Phalalu: మేష రాశి నుంచి మీన రాశివరకూ నవంబరు 20 రాశిఫలాలు

FOLLOW US: 
Share:

 Today Rasi Phalalu In Telugu

మేష రాశి (Aries Horoscope in Telugu)

కుటుంబ సంబంధాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి..చిన్న చిన్న విషయాలకు మాటతూలొద్దు. కఠినంగా వ్యవహరించవద్దు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి..ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకునేందుకు భయపడొద్దు. ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉన్నారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. 

వృషభ రాశి  (Taurus Horoscope in Telugu)

కుటుంబ వివాదాలు మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు . కార్యాలయంలో ఎదురైన సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ రోజు మీరు  ఆర్థికంగా బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు కలసిరావు. మీ వ్యక్తిగత సంబంధాలలో మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రోత్సహించవద్దు. సహనంగా వ్యవహరించాలి. 

మిథున రాశి (Gemini Horoscope in Telugu)

ఫైనాన్స్, విదేశీ క్లయింట్లతో పనిచేసే వ్యక్తులు వృద్ధికి మరిన్ని అవకాశాలున్నాయి. వ్యాపారవేత్తలు ఈరోజు కొత్త భాగస్వాములను చేర్పించుకోపోవడమే మంచిది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉండేవారు స్ట్రాంగ్ గా ఉంటారు. స్టాక్ మార్కెట్, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ మరియు మ్యూచువల్ ఫండ్‌ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయం.

Also Read: లింగరూపంలో కొలువైన పరమేశ్వరుడి ఆరాధన వెనుకున్న ఆంతర్యం ఇదే!

కర్కాటక రాశి  (Cancer Horoscope in Telugu)
ఈ మీ ప్రయాణం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఊహించని బాధ్యతలు స్వీకరించాల్సి రావొచ్చు.మీ జీవితంలో వచ్చే మార్పులను స్వీకరించి ముందుకు సాగిపోవడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. 

సింహ రాశి ( Leo Horoscope in Telugu)

ఆర్థిక విషయాల్లో కొంత భారంగా అనిపిస్తుంది. మీ కృషి వల్ల కొన్ని ఒడిదొడుకుల నుంచి బయటపడతారు. ఆర్థికవ్యవహారాలపై నియంత్రణ పాటించాలి. మీ ప్రియమైన వారికి సమయం కేటాయిస్తారు. శారీరక ఆరోగ్యంతో పాటూ మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే అని గుర్తుంచుకోవాలి. వృత్తి పరమైన సలహాలు తీసుకునేందుకు వెనుకాడవద్దు.

కన్యా రాశి (Virgo Horoscope in Telugu)

ఈ రోజు మీరు పనిలో కొన్ని ఊహించని సవాళ్లను ఎదుర్కోవచ్చు కానీ నిరుత్సాహపడొద్దు. కార్యాలయ పనిలో మీ సహోద్యోగులు సహకరిస్తారు..ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. త్వరగా ధనవంతులయ్యే ప్రణాళికలు నమ్మి మోసపోవద్దు. 

Also Read: కార్తీకమాసంలో ఇందులో ఒక్క క్షేత్రం దర్శించుకున్నా చాలు!

తులా రాశి (Libra Horoscope in Telugu)

ఈ రోజు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ఇతరులతో కనెక్ట్ అయ్యే రోజు. మీ సన్నిహితులతో అభిప్రాయాలను పంచుకోవడానికి బయపడకండి. కుటుంబంలో కొంత ప్రశాంతత నెలకొంటుంది. మీలో మీరు సంఘర్షణకు లోనయ్యే కన్నా మీ ప్రియమైనవారితో బహిరంగంగా మాట్లాడడం మంచిది. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)

భావోద్వేగాల మధ్య ఉండిపోవద్దు..మీ భాగస్వామికి మీరేంటో వ్యక్తపరచండి. మీ ప్రయత్నాన్ని మీ భాగస్వామి అభినందిస్తారు. వృత్తి జీవితంలో కొత్త మలుపు రాబోతోంది. మీ కెరీర్ లక్ష్యాలను ప్రతిబింబించే అవకాశంగా దీన్ని తీసుకోండి. మీరు ఉన్న చోట సంతోషంగా ఉన్నారా లేదా మీకు మార్పు అవసరమా అనేది ఆలోచించి అడుగేయండి. గ్రహాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. 

Also Read: కలిపురుషుడికి - కార్తీక వనభోజనాలకి - ఉసిరిచెట్టుకి లింకేంటి!

ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)

మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులేకు అనవసర వాగ్ధానాలు చేయవద్దు. అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు లేదా ఇంటి మరమ్మతులకు ఖర్చు చేస్తారు. వాహనం కొనాలని అనుకుంటే ఈరోజు దానికి అనుకూలమైన రోజు. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఆర్థిక నిపుణుల సహాయాన్ని తీసుకోవచ్చు.

మకర రాశి (Capricorn Horoscope in Telugu)

ఈ రోజు మీ వృత్తిపరమైన జీవితం సవాలుగా ఉంటుంది. కొత్త పని భుజాలపై పడుతుంది. ఈ రోజు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కార్యాలయంలో కుట్రకు బాధితులు కావచ్చు. బాధాకరమైన పరిణామాలను కలిగించే పనికిరాని అంశాలపై వాదనలను పెట్టుకోవద్దు. ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లు పెళ్లి  దిశగా ఆలోచించేందుకు ఇదే మంచిసమయం. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. 

కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)

ఆర్థిక వనరులను ఎలా మెరుగ్గా ఉపయోగించుకోవాలనే దాని గురించి మెరుగైన వ్యక్తుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ శారీరక, మానసిక  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.

Also Read: కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!

మీన రాశి (Pisces Horoscope in Telugu)

దీర్ఘకాలిక లాభాల కోసం స్టాక్స్ , మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇది శుభసమయం. మీ స్నేహితుడి సమస్య మీకు బాధ కలిగించవచ్చు . పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఏకాంత సమయం కోరుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. సంతోషంగా ఉంటారు

Published at : 19 Nov 2023 11:16 PM (IST) Tags: Astrology Horoscope Today Daily Horoscope  Today Rasi Phalalu In Telugu

ఇవి కూడా చూడండి

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో  ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

Horoscope Today  December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో  ముఖ్యమైన రోజులివే!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
×