Horoscope Today 16th October 2022: ఈ రాశివారి మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది, అక్టోబరు 16 రాశిఫలాలు
Horoscope Today 16th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 16th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారి మనస్సు ఈ రోజంతా సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు మంచి రోజు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. పెద్దల ఆశీశ్సులు మీపై ఉంటాయి. కుటుంబ కలహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సోదరుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త.
మిథున రాశి
మిథున రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. ఇంట్లో కొంత అసౌకర్యాన్ని ఫీలవుతారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.
Also Read: ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొన్నా మంచిదే!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మానసిక సమస్యలతో మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలవైపు ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
సింహ రాశి
సింహ రాశి విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం..ప్రొసీడ్ అవండి.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో లాభాలు రావడంతో సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి
కన్యారాశి వారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యారంగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి.
తులారాశి
తులారాశి వారికి మనస్సులో శాంతి, సంతోషం ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఇంటి నిర్వహణ ఖర్చులు భారమవుతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ప్రయాణం చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. స్నేహితుల సహకారంలో మీలో ఆనందం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతుతాయి. మనసు సంతోషంగా ఉంటుంది.
Also Read: రాశిమారుతున్న కుజుడు ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభఫలితాలే!
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి స్వీయ సంయమనం అవసరం. రోజంతా ఏదో చిరాకుగా ఉంటారు. వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు.
మకర రాశి
మకర రాశి వారు ఏదో కలత చెందతున్నట్టు ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇంటికి సంబంధించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభ రాశివారు సంయమనం పాటించాలి. అనుకున్న పనులు చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ పూర్తవుతాయి. మీకు తల్లిదండ్రులకు పూర్తి మద్దతు లభిస్తుంది. అయినప్పటికీ మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
మీన రాశి
మీన రాశివారు ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా ఉండదు. ఇంటా బయటా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి.