By: RAMA | Updated at : 10 Jan 2023 06:17 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 10th January 2023 (Image Credit: freepik)
10th January 2023 Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభదినం. మీ కుటుంబ సంబంధం బలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించవచ్చు. ఏదైనా పనిలో తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తీసుకోవడం మంచిది. మార్కెటింగ్ కు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు.
వృషభ రాశి
కష్టపడి పనిచేస్తే అందుకు తగిన ఫలితం పొందుతారు.మీ బంధాలు మెరుగుపర్చుకునేందుకు, వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఈ రోజు చాలా మంచి రోజు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొంత విశ్రాంతి తీసుకుని పనిని కొనసాగించండి. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు.
మిధున రాశి
ప్రతికూల ఆలోచనలు మానసిక అనారోగ్యంగా మారడానికి ముందే వాటిని తొలగించడంలో సక్సెస్ అవుతారు. స్వచ్ఛందంగా ఏదైనా పని చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఆభరణాలు, పురాతన వస్తువులలో పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి
కర్కాటక రాశి
ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. కుటుంబంలో తగాదాలు తగ్గుతాయి. ఏదో విషయంపై మీరు కలత చెందుతారు. స్నేహితునితో గొడవపడే అవకాశం కూడా ఉంది.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి గ్రహాలు అంత అనుకూలంగా లేవు, ఆరోగ్యం-ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త
సింహ రాశి
ఈ రోజు మీరు చేసే పని నైతిక విజయానికి కారణమవుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు...మరికొన్ని పనులు చిన్న చిన్న అడ్డంకుల వల్ల ఆగిపోతాయి. సామాజిక రంగంలో పనిచేసేవారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.అనుకోని సక్సెస్ మీ ఆనందాన్ని పెంచుతుంది.
కన్యా రాశి
మీరు మీ డిపాజిట్లను సాంప్రదాయకంగా పెట్టుబడి పెడితే డబ్బు సంపాదించవచ్చు. మీ వైఖరిని స్నేహితులు, బంధువులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు. దీనివల్ల మీకు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం ఉండదు..పైగా బంధాలు దూరమవుతాయి. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.
తులా రాశి
ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మీకు కలిసొస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు.ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని కొత్త బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈరోజు మంచి రోజు. అనుకున్న పనులు వేగంగా పుంజుకుంటాయి. కెరీర్లో ముందుకి సాగేందుకు కొత్త అవకాశాలు పొందుతారు. భూమి నిర్మాణ పనుల నుంచి, పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
Also Read: భూమి, ఇల్లు, వాహనం కొనుగోలుకి ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం
ధనుస్సు రాశి
స్థిరాస్తి సంబంధిత పెట్టుబడులు మీకు చాలా లాభాలను ఇస్తాయి. మీ కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేయండి. మీ చర్యల వెనుక ప్రేమ మాత్రమే ఉండేలా చూసుకోండి. ఉద్యోగులు, వ్యాపారులు , విద్యార్థులకు శుభసమయం.
మకర రాశి
ఈ రోజు మీరు స్నేహితుడితో కలిసి ఎక్కడికైనా ప్రయాణించేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు టెన్షన్ పెరుగుతుంది. పనిలో సవాళ్లుంటాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.
కుంభ రాశి
ఈ రోజు మీ ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. మీ శత్రువులు లేదా ప్రత్యర్థుల ప్రణాళికలు ఫలించవు. ఉద్యోగులకు కార్యాలయంలో మద్దకు పెరుగుతుంది. రోజంతా పాజిటివ్ గా ఆలోచించండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
మీన రాశి
ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న పనులు చేయడానికి మంచి రోజు. త్వరగా డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక మీ మనస్సులో ఉంటుంది. అందుకోసం ఏం చేసినా అడుగు ముందుకు పడుతుంది..లాభపడతారు. కోపం తగ్గించుకోండి.
Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు
Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!
Job And Business Astrology: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!
Horoscope Today 07th February 2023: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు
Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్