అన్వేషించండి

Horoscope 09th February 2024: మౌని అమావాస్య రోజు ఈ రాశులవారిపై పెద్దల ఆశీస్సులు ఉంటాయి , ఫిబ్రవరి 09 రాశిఫలాలు

Horoscope 8th February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 9th February 2024  - ఫిబ్రవరి 9 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఉద్యోగంలో మీ లక్ష్యాలను పూర్తి చేయమని మీపై ఒత్తిడి ఉంటుంది. కెరీర్‌పై సీరియస్ గానే దృష్టి సారిస్తారు. కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ధార్మిక పనులకు డబ్బు ఖర్చు చేస్తారు. విద్యార్థులకు చదువులో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభ రాశి (Taurus  Horoscope Today)

కార్యాలయంలోని సహోద్యోగుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. అధికారులతో అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. గత కొంతకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు ఈరోజు పోగొట్టుకున్న లేదా దాచిన వస్తువు బయటపడుతుంది. గుడ్ న్యూస్ వింటారు. మనోధైర్యం పెరుగుతుంది. 

మిథున రాశి (Gemini Horoscope Today) 

కుటుంబ వాతావరణం కొంత ఉదాసీనంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలను అంత సీరియస్ గా తీసుకోవద్దు. వ్యాపారంలో దురాశ కారణంగా నష్టపోతారు. ఉద్యోగంలో మీ పనితీరులో ప్రత్యేకత ఏమీ ఉండదు.  సంకోచం కారణంగా మీరు మీ సమస్యలను కూడా పంచుకోలేరు.

Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

కర్కాటక రాశి వారు తమ జీవిత భాగస్వామితో  ఆలోచనలను పంచుకోగలరు. మీ మాటతీరు ఆకట్టుకునేలా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహణకు ప్లాన్ చేస్తారు. ప్రత్యర్థులు మీకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తారు జాగ్రత్త.

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రాశివారు అసంపూర్తిగా ఉన్న వ్యాపార ప్రణాళికల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. విద్యార్థులు పరీక్షా ఫలితాల్లో మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ తెలివితేటలతో వివాదాలకుఫుల్ స్టాప్ పెడతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.  పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి.  

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

మీరు ఆత్మవిశ్వాసంతో అన్ని పనుల్లో ముందుకు సాగుతారు. విదేశాల్లో వ్యాపారం చేసే వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. పిల్లల ప్రవర్తన చూసి మీరు బాధపడతారు. వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఉండొచ్చు. 

Also Read: ఈ అమావాస్య నుంచి కొన్ని రాశులవారికి మంచి రోజులు మొదలవుతున్నాయ్!

తులా రాశి (Libra Horoscope Today) 

ఉద్యోగంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది.  పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి గౌరవం పోగొట్టుకుంటారు. అనవసర విషయాలవైపు ఆసక్తి చూపవద్దు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయవచ్చు. కుటుంబానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

వృశ్చిక రాశి వారు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారి జీతాలు పెరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి పూర్తవుతాయి. కార్యాలయంలో మీ కీర్తి పెరుగుతుంది. స్నేహితునితో ఏదైనా వివాదం ఈరోజు పరిష్కారమవుతుంది. 

Also Read: ఈ ఏడాది 3 నెలలు మూఢం, ఈ టైమ్ లో శుభకార్యాలు ఎందుకు నిర్వహించకూడదు!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 
 
కార్యాలయంలో కొంత అస్థిరత ఉండవచ్చు. ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించకూడదు. పెద్దల సలహాలను నిర్లక్ష్యం చేయకండి. మీరు మీ తల్లిదండ్రుల సలహాతో కొత్త పనిని ప్రారంభించడం శుభప్రదం. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.

మకర రాశి (Capricorn Horoscope Today) 

మకర రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. నిర్మాణ సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. వైవాహిక సంబంధాల తీవ్రత పెరుగుతుంది. గృహ జీవితంలో శాంతి ఉంటుంది. మీ అభిప్రాయాలను అందరూ ఏకీభవిస్తారు. పెండింగ్‌లో ఉన్న ఒప్పందం ఈరోజు ఖరారు కావచ్చు.

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఏదో విషయం మీకు చెడుగా అనిపించవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. శారీరకంగా బలహీనంగా ఉంటారు. వ్యాపారంలో కొన్ని ప్రయోగాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఆశించిన ఫలితాలు సాధించలేరు. 

Also Read: ఫిబ్రవరి 9 మౌని అమావాస్య, ఈ రోజు ఇవి పాటించడం మర్చిపోవద్దు!

మీన రాశి (Pisces Horoscope Today) 

వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు పొందుతారు. ఉద్యోగుల పనిలో నాణ్యత పెరుగుతుంది.  కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అప్పుగా ఇచ్చిన డబ్బును అందుకుంటారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. 

గమనిక:  ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget