Horoscope Today January 05, 2024 : ఈ రాశులవారు మాటల్లో పొదుపు పాటించడం మంచిది, జనవరి 05 రాశిఫలాలు
Happy New Year 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
Horoscope Today 05th January 2024 - జనవరి 05 రాశిఫలాలు
మేష రాశి (Aries Horoscope Today)
విద్యార్థులకు చదువుపై ఆసక్తి ఉంటుంది కానీ ఏదో ఆలోచనలో ఉండిపోతారు. కుటుంబ జీవతం బావుంటుంది. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగుల పని పరిధి విస్తరించవచ్చు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మేధోపరమైన పనిలో ఉండేవారు బిజీగా ఉంటారు.
వృషభ రాశి (Taurus Horoscope Today)
ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ అతిగా ఉత్సాహంగా ఉండకండి. స్నేహితుని సహాయంతో ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఏదో విషయంలో మనసు కలత చెందుతూనే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉండవచ్చు. చేపట్టే పనులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. వాక్కు ప్రభావం పెరుగుతుంది
మిథున రాశి (Gemini Horoscope Today)
రోజంతా బిజీబిజీగా ఉంటారు. తొందరగా కోపం వచ్చేస్తుంది..అంతలోనే నార్మల్ గా మారిపోతారు. తండ్రి ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోండి. ఖర్చులు ఎక్కువ అవుతాయి. సంగీతం పట్ల ఆసక్తి ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది కానీ కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు.
కర్కాటక రాశి (Cancer Horoscope Today)
రోజంతా ఆనందంగా ఉంటుంది. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. దాంపత్య సంతోషం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా
ఉంటుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే విద్యార్థులకు అడ్డంకులు తొలగిపోతాయి. సంభాషణలో ఓపికగా ఉండండి. కుటుంబం నుంచి మీకు అవసరమైన మద్దతు లభిస్తుంది. అనవసరమైన తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
సింహ రాశి (Leo Horoscope Today)
వివాదాలకు దూరంగా ఉండాలి, మాట తూలవద్దు. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మనసులో నిరాశ, అసంతృప్తి ఉండవచ్చు. కార్యరంగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆశ, నిరాశ మిశ్రమ భావాలు మనస్సులో ఉంటాయి. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
Also Read: ఈ రాశులవారిపై దేవగురువు అనుగ్రహం, అప్పులుండవ్ ఇక ఆదాయమే!
కన్యా రాశి (Virgo Horoscope Today)
వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగులుకు పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు మీపై ప్రభావం చూపుతాయి. మతపరమైన సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
తులా రాశి (Libra Horoscope Today)
మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కానీ మీరు సహనంగా ఉండాలి. అదో చికాకుగా అనిపిస్తుంది. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉంటుంది. సోదరుల నుంచి సహకారం ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుకుంటారు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ఇతర విషయాలపట్ల ఆకర్షితులు కాకుండా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలుంటాయి. వాహన సౌఖ్యం తగ్గుతుంది.
Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
అనవసరమైన కోపానికి దూరంగా ఉండండి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశాలు ఉండవచ్చు స్థలం మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కళ లేదా సంగీతం పట్ల ఆసక్తి ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. రాజకీయ నాయకుడిని కలుస్తారు. వ్యాపారం విస్తరిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
మకర రాశి (Capricorn Horoscope Today)
కుటుంబానికి సమయం కేటాయించాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితుడి సహాయంతో మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి పెట్టుబడి పెట్టవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. మేధోపరమైన పని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. కొన్ని ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది.
Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి!
కుంభ రాశి (Aquarius Horoscope Today)
అనవసరమైన కోపం , వాదనలకు దూరంగా ఉండండి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అదనపు ఖర్చులు ఉంటాయి. ఏదైనా ఆస్తి నుంచి ఆదాయం పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చదువులపై ఆసక్తి ఉంటుంది. అనుకోకుండా పాత స్నేహితుడిని కలుస్తారు. పురోభివృద్ధికి అవకాశాలున్నాయి.
మీన రాశి (Pisces Horoscope Today)
మీ మాటల్లో మాధుర్యం ఇతరులను కట్టిపడేస్తుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కార్యాలయం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. బాధ్యతలు పెరుగుతాయి, ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. మీలో ఓర్పు లోపిస్తుంది. ఈ రోజు సాధారణంగా ఉంటుంది.
Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోవాలి అనుకుంటారెందుకు!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.