News
News
X

Horoscope Today 02nd February 2023: ఈ రాశివారికి తమ పనిపై కన్నా పక్కవారి పనిపై శ్రద్ధ ఎక్కువ, ఫిబ్రవరి 2 రాశిఫలాలు

Rasi Phalalu Today 02nd February 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 02nd February 2023: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం

మేష రాశి
ఈ రోజు మీరు సృజనాత్మక పనులు చేయడం ద్వారా గుర్తింపు పొందుతారు. మీ మాటతీరుతో ఎవ్వరినైనా ఆకర్షిస్తారు. ఓ నిర్ణయం తీసుకునే మందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఏదైనా విషయం గరించి ఆందోళన చెందుతున్నట్టైతే తల్లిదండ్రులతో మాట్లాడితే పరిష్కార మార్గం కనిపిస్తుంది.  విద్యార్థులకు ఒత్తిడి ఉన్నప్పటికీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
 
వృషభ రాశి
ఈ రోజు మీరు రిస్క్ తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. ప్రభుత్వాధికారులతో వ్యవహారాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అనుకున్న పనులు పెండింగ్ పడతాయి. విదేశీ పర్యటనకు వెళ్లాలి అనుకునేవారు ప్రయత్నాలు ప్రారంభించాలి. రోజంతా మీరు సంతోషంగా ఉంటారు.

మిథున రాశి
ఈ రోజు మీ  ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగులు గతంలో చేసిన తప్పులు ఈ రోజు బయటపడే అవకాశం ఉంది. వ్యాపారులకు శుభసమయం. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది.  కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక ప్రయాణం చేయాల్సి ఉంటుంది

Also Read: ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి సమస్యలు, సవాళ్లు తప్పవు - నెలాఖరు కాస్తంత రిలీఫ్

కర్కాటక రాశి
ఈ రోజు మీ పురోభివృద్ధి బావుంటుంది. కార్యాలయంలో మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. మీ దినచర్యను మెరుగ్గా నిర్వహిస్తారు. చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను ఉపాధ్యాయులతో ధైర్యంగా షేర్ చేసుకుంటారు. ఈ రోజు విద్యార్థులు కెరీర్ గురించి ఆందోళన చెందుతారు.

సింహ రాశి
ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తిచేయడంపై శ్రద్ధ వహించాలి. మీ సహోద్యోగులతో ఏదో ఒక విషయంలో గొడవ పడే అవకాశం ఉంది. ఎవ్వరికీ ఉచిత సలహాలు ఇవ్వొద్దు. ఇవాల్టి పనిని రేపటికి వాయిదా వేయడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. 

కన్యా రాశి
ఈ రోజు ఈ రాశి నిరుద్యోగులకు శుభసమయం. కొన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. మీ ప్రత్యర్థులు మీపై పైచేయి సాధించాలనుకుంటారు మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

తులా రాశి
ఈ రోజు మీరు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  భాగస్వాములతో కలసి చేసే వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి.  స్నేహితులు , సహోద్యోగుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చాలా రోజుల తర్వాత కొత్త స్నేహితుడిని కలుస్తారు.

Also Read: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ఉద్యోగులు పని ప్రదేశంలో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీరు మీ కంటే ఇతరుల పనిపై ఎక్కువ దృష్టి పెడతారు..ఇది మీకు మంచిదికాదు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో ఏదైనా విషయంలో వివాదం ఏర్పడితే పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం మంచిది. 

ధనుస్సు రాశి 
ఈ రోజు ఈ రాశి విద్యార్థులకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు రహస్య శత్రువల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ తెలివితేటలతో వారికి సమాధానం చెప్పాలి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల తరపున ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మాట్లాడకండి

మకర రాశి
ఈ రోజు మీ ఇంటికి అతిథి రాక కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవాన్ని కొనసాగించండి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో  పాల్గొంటారు. ఈ రోజు మీరు పిల్లలతో ఏదో ఒక విషయం గురించి వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి

కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారికి గౌరవం పెరుగుతుంది. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు వారి పనుల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందుతారు. డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ రోజు స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోండి. ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్లయితే వారికి తిరిగి ఇచ్చేందుకు ప్లాన్ చేసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు సంతోషకరమైన రోజు. మీ రక్త సంబంధాలలో కొనసాగుతున్న చీలిక తొలగిపోతుంది. మీలో వినయ స్వభావం అలాగే ఉంటే మంచిది. కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు జరిగే సూచనలు ఉన్నాయి. 

Published at : 02 Feb 2023 06:10 AM (IST) Tags: Horoscope Today Rasi Phalalu today Check astrological prediction today Aries Horoscope Today Gemini Horoscope Today bhogi Horoscope Today

సంబంధిత కథనాలు

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఆర్థికంగా బావుంటుంది కానీ మానసిక ఆందోళన తప్పదు

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఆర్థికంగా బావుంటుంది కానీ మానసిక ఆందోళన తప్పదు

Ugadi Panchangam in Telugu (2023-2024): ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువే - శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జీవితం పరీక్షా కాలమా అన్నట్టుంటుంది!

Ugadi Panchangam in Telugu (2023-2024): ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువే - శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జీవితం పరీక్షా కాలమా అన్నట్టుంటుంది!

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

మార్చి 21 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు నమ్మకద్రోహానికి గురవుతారు జాగ్రత్త!

మార్చి 21 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు నమ్మకద్రోహానికి గురవుతారు జాగ్రత్త!

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్