Horoscope Prediction in Telugu 11 july 2024 : ఈ రాశులవారు ఈ రోజు వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి - జూలై 11 రాశిఫలాలు!
Horoscope Prediction 11th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
జూలై 11 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అధిక ఒత్తిడికి లోనవుతారు. కార్యాలయంలో అధికారులతో అనవసర వాగ్వాదాలుంటాయి. మాట్లాడేటప్పుడు ఆలోచించండి. వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి. వ్యక్తిగతజీవితం సంతోషంగా ఉంటుంది.
వృషభ రాశి
ఆలోచించకుండా పెట్టుబడి ప్రణాళికలు వేయకండి..తీవ్రంగా నష్టపోతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
మిథున రాశి
ముఖ్యమైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కర్కాటక రాశి
ఈ రోజు మీరు ముఖ్యమైన పనులకు సంబంధించి అధికారులను కలుస్తారు. స్నేహితుల నుంచి శుభవార్త అందుకుంటారు. బ్యాంకు సంబంధిత పనులు ఆగిపోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పెరగుతాయి. ఎవరికీ సలహా ఇవ్వకండి.
సింహ రాశి
విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ కు సంబంధించి సమాచారాన్ని పొందుతారు. వ్యాపారంలో కొనసాగుతున్న వారికి శుభసమయం.
కన్యా రాశి
వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకుంటారు. ఆర్థిక లాభం ఉంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన సొమ్ము తిరిగి పొందుతారు. వాహనం జాగ్రత్తగా నడపండి. వైవాహిక జీవితం బావుంటుంది.
తులా రాశి
ఈ రోజు సంతోషకరమైన రోజు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబ పెద్దల ఆశీస్సులు పొందుతారు. సన్నిహితులను కలుస్తారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. సలహాలు స్వీకరించినా తుది నిర్ణయం మీదే కావాలి. ప్రేమికులకు కలిసొచ్చే రోజు.
వృశ్చిక రాశి
ఖర్చులు తగ్గించుకోవాల్సిన సమయం ఇది. అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఫ్యాక్టరీలు లేదా ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు భద్రతా ప్రమాణాలను పూర్తిగా పాటించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమికుల రోజు సాధారణంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు శుభవార్తలు అందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బావుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పరీక్షల గురించి ఆందోళన చెందుతారు.
మకర రాశి
ఈ రోజు మీరు దగ్గర బంధువులను కలుస్తారు. ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితానికి సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి
కుంభ రాశి
ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఆహ్లాదకరమైన సంఘటనను ఆనందిస్తారు. సమీప బంధువులను కలుస్తారు. పూర్వీకుల సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమికులు తమ భాగస్వాములకు బహుమతులు అందజేస్తారు.
మీన రాశి
ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒకరి సలహా వినడం వల్ల మీకు హాని కలుగుతుంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో సమయం స్పెండ్ చేస్తారు. ఈ రోజు స్నేహితుడిని కలుస్తారు.