Horoscope 5th January 2025: ఈ రాశులవారు ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
జనవరి 05 రాశిఫలాలు
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. కుటుంబంలో ఒత్తిడి దూరమవుతుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి
వృషభ రాశి
ఈ రోజు మీరు ఏదో ఓ విషయంలో మీ స్నేహితులతో వాగ్వాదానికి దిగుతారు. మీ ప్రసంగాన్ని నియంత్రించండి...మాట తూలొద్దు. సమయం వృధా చేయవద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి
కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. ఎవరికీ అప్పు ఇవ్వకండి. కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు.
కర్కాటక రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. మీ స్నేహితులను కలుస్తారు. మీ సమర్థతతో ఏదైనా వివాదాన్ని పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఈరోజు బంధువులను కలుస్తారు. వ్యాపారానికి సంబంధించి గొప్ప అవకాశాలు ఉంటాయి:
సింహ రాశి
ఈ రోజు కుటుంబంలో పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. రుణ లావాదేవీలను జాగ్రత్తగా చేయండి. మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ గురించి సమాచారాన్ని వింటారు.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశికి సంబంధించి సాహిత్య రంగంలో ఉండేవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త పరియస్తులను దూరంగా ఉంచండి. పిల్లలకు సమయం కేటాయిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు.
తులా రాశి
ఈ రోజు ఓపిక పట్టండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త పనుల్లో లాభం ఉంటుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. పిల్లల చదువులపై ఓ కన్నేసి ఉంచాలి. కెరీర్‌కు సంబంధించిన సమస్య త్వరలో పరిష్కారమవుతుంది. మీరు స్నేహితుడి నుంచి శుభవార్త పొందవచ్చు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీ ఆలోచనను మెరుగుపర్చుకోండి. చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకండి. కుటుంబానికి సమయం కేటాయించండి. ఆలయాలను సందర్శిస్తారు.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు ప్రతి పనిని సమయానికి పూర్తిచేస్తారు. మీ జిజ్ఞాస పెరుగుతుంది. గృహంలో సమస్యలను పరిష్కరించుకోగలరు. రిస్క్ తీసుకోవడం మానుకోండి. మీ ఆహారాన్ని నియంత్రణలో ఉంచుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది
మకర రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్తలను అందుకుంటారు. అదృష్టం మీ వైపు ఉంటుంది. కొత్త మూలాల నుంచి ఆదాయం ఉంటుంది. పిల్లలకు ఏది కావాలంటే అది ఇస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే ప్రణాళికలు వేసుకుంటారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు
కుంభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కొంచెం కష్టపడితే పెద్ద విజయం సాధించవచ్చు. ఆస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
మీన రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.