News
News
X

మార్చి 9 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారి జీవితంలో అనుకూల మార్పులొస్తాయి

Rasi Phalalu Today 9th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి

ఈ రాశివారు రోజంతా ఆలోచనల్లో మునిగితేలుతారు. మాటలపై నియంత్రణ పాటించడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితులను కలుస్తారు. కుటుంబంలో శుభకార్యం ప్లాన్ చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

వృషభ రాశి 

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆనందంగా ఉంటారు. ఖర్చులు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైవాహిక జీవితం బలహీనంగా ఉంటుంది...జీవిత భాగస్వామితో గొడవపడే అవకాశం ఉంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు

మిథున రాశి

ఈ రోజు మీ జీవితంలో మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైన రోజు. మీరు కొత్త కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలని ఆలోచిస్తారు. అకస్మాత్తుగా ఏదో ఒక ఆదాయ వనరు ఏర్పడడం వల్ల రోజంతా మనసు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెడతారు. వ్యాపారులు అనుబవజ్ఞులతో చర్చించి నూతన పెట్టుబడులు పెట్టొచ్చు

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

కర్కాటక రాశి

ఈ రోజు కార్యాలయంలోని సమస్యలను పరిష్కరించడం ద్వారా మీరు మీ పనిపై దృష్టి పెట్టగలుగుతారు. వ్యాపారులు లాభదాయకమైన ఒప్పందాలు  కుదుర్చుకుంటారు.  జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. 

సింహ రాశి

ఈ రోజు మీకు మంచి రోజు. మీరు మీ జీవిత భాగస్వామి మనసుని అర్థం చేసుకుంటారు..ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. ప్లాన్ చేసుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు సాధారణ ఫలితాలు పొందుతారు. 

కన్యా రాశి

ఈ రోజు మీరు ఒక వ్యక్తి నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇంటికి సంబంధించిన పనులు పూర్తిచేయడంలో పెద్దల అభిప్రాయం తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఈ రాశి ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు.వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొచ్చు.

తులా రాశి

ఈ రోజు ఎలాంటి తప్పుడు అడుగులు వేయకండి.  డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు తీరిపోతాయి. వ్యాపార రంగంలో అద్భుతమైన పురోగతి ఉంటుంది. సినిమా, మీడియా రంగాల్లోని వ్యక్తులు తమను తాము బిజీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. 

వృశ్చిక రాశి

ఈ రోజు ఈ రాశివారికి సవాలుగా ఉంటుంది. కుటుంబంలో సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఉద్యోగులు పనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి..కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు కొన్ని మంచి ఫలితాలను పొందవచ్చు.

Also Read: మార్చి నెలలో ఈ రాశులవారికి వ్యవహార జయం, ఆర్థిక లాభం

ధనుస్సు రాశి

ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి సంతోష సమయం గడుపుతారు. ఉద్యోగుల పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. టూరిజంతో అనుబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి

మకర రాశి

ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి పేరు సంపాదించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

కుంభ రాశి

ఈ రోజు మీకు కొద్దిగా బలహీనంగా ఉంటుంది...అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. కొన్ని మాధ్యమాల ద్వారా ఆదాయం వస్తుంది కానీ మీలో సంతృప్తి ఉండదు.

మీన రాశి

ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. మీరు కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కష్టపడితేనే పనులు పూర్తవుతాయి. ఈ రోజు మీకు పెద్దల పూర్తి సహకారం లభిస్తుంది.

Published at : 09 Mar 2023 05:32 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today 2023 holi horoscope 8th March holi Horoscope March 9th Horoscope 9th March Astrology Horoscope for 9th March

సంబంధిత కథనాలు

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!

2023 Panchangam in Telugu: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు

2023 Panchangam in Telugu: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా