By: RAMA | Updated at : 07 Mar 2023 02:38 PM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
Holi 2023 Astro Tips: ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు హోలీ జరుపుకుంటారు. ప్రేమ, ఆప్యాయతకి చిహ్నంగా జరుపుకునే ఈ వేడుకలో పాల్గొనడం, రంగులు చల్లుకోవడం ద్వారా అదృష్టం మారుతుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. హోలీ రోజు ఏ రంగు దుస్తులు వేసుకున్నా డ్రెస్ రంగుల మయం అయిపోతుంది కానీ..మీ రాశిని బట్టి మీరు వేసుకునే రంగులుంటాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మేషం నుంచి మీన రాశివరకూ మీరు ఏ రంగు దుస్తులు ధరించి హోలీ ఆడాలో తెలుసుకోండి...
మేష రాశి వారు శక్తివంతంగా, ఉద్వేగభరితంగా, ధైర్యంగా ఉంటారు. ఈ రాశి వారికి ఎరుపు, నారింజ, పసుపు రంగులు అనుకూలంగా ఉంటాయి.
వృషభ రాశివారు హోలీ రోజు గులాబీ, నీలం రంగు దుస్తులు ధరించాలి. ఈ రంగు ఈ రాశివారికి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
మిథున రాశికి చెందిన వ్యక్తులు తెలివైనవారు, బహుముఖ ప్రజ్ఞావంతులు. అందుకే పసుపు, ఆరెంజ్ రంగుల దుస్తులు ధరించడం వీరికి అనుకూలం.
Also Read: రాశిచక్రం ఆధారంగా మహిళల స్వభావం, ఈ రాశి స్త్రీల మనస్సులో ఏముందో ఎవ్వరూ గ్రహించలేరు!
కర్కాటక రాశి వారు భావోద్వేగ పూరిత, సున్నితమైన స్వభావం కలవారు. వీరు హోలీ రోజు బ్లూ, పింక్ కలర్ దుస్తులు ధరించాలి. ఈ రంగులు వారి ప్రేమ స్వభావాన్ని సూచిస్తాయి.
సింహరాశి వారు హోలీ రోజు ఎరుపు, ఆరెంజ్, గోల్డ్ కలర్ దుస్తులు ధరించాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ రంగులు వీరి గంభీరమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి
హోలీ రోజు కన్యా రాశి వారు ఆకుపచ్చ, గోధుమ రంగు దుస్తులు ధరించడం అనుకూలం. వీరి స్వభావం ఆచరణాత్మకంగా ఉంటుంది. అందుకే ఈ హోలీ రోజు ఈ రంగులు ధరించడం మంచిది
తులా రాశి వారు దౌత్యానికి కేరాఫ్ అని చెప్పొచ్చు. ప్రశాంతంగా ఉంటారు కానీ పనులు మాత్రం చక్కగా చక్కబెట్టేస్తారు. ఈ రాశివారు పింక్, బ్లూ కలర్స్ సరిగ్గా సరిపోతాయి.
Also Read: ప్రేమ, క్షమ, ఆత్మాభిమానం, సహనానికి కేరాఫ్ - అందుకే యుగయుగాలకు ఆమె ఆదర్శం
వృశ్చికం నీటి రాశి అంటారు. హోలీ రోజు ఈ రాశివారు నలుపు, మరూన్, ఉదా రంగులు ధరించడం మంచిది. వీరి లోతైన భావాలను ఈ రంగులు ప్రతిబింబిస్తాయి
ధనుస్సు రాశి వారు ఆశావాదులు, స్వేచ్ఛా స్ఫూర్తిని కలిగి ఉంటారు. హోలీ రోజు మీరు ప్రశాంతంగా కనిపించే తెలుపు రంగు ధరించడం మంచిది. ఇది మీ ప్రియమైన అనుభూతిని, ప్రకాశవంతమైన మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
మకర రాశి వారు కష్టపడి పనిచేస్తారు, బాధ్యతాయుతంగా ఉంటారు. గ్రే, బ్లూ కలర్స్ వీరి స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. హోలీ రోజు ఈ రెండు రంగుల దుస్తులు వీరికి అనుకూలం
కుంభ రాశి వారిలో సృజనాత్మకత ఎక్కువ. అందుకే ఈ రాశివారు హోలీ రోజు తమ హోలీ డు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే రంగులను ధరించాలి. ఊదారంగు వీరికి అనుకూలం
మీన రాశివారికి సానుభూతి చాలా ఎక్కువ. ఊహాత్మక , కళాత్మక స్వభావం వీరిది. ఈ రాశివారికి ఆకుపచ్చ, లావెండర్, ఎరుపు రంగులు హోలీ రోజు సరైనవి
Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!
Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది
Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు
మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది
మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!