News
News
X

International Women's Day: రాశిచక్రం ఆధారంగా మహిళల స్వభావం, ఈ రాశి స్త్రీల మనస్సులో ఏముందో ఎవ్వరూ గ్రహించలేరు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

International Women's Day 2023:  ఆడవారంతా ఒక్కటే అనేస్తారు కానీ వారి వారి రాశిచక్రాన్ని బట్టి వారి స్వభావం, లక్షణాల్లో చాలా మార్పులుంటాయి. అవి మీరు సరిగ్గా తెలుసుకోగలిగితే వారితో మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మరి ప్రేమ భాగస్వామి, మీ జీవిత భాగస్వామి, మీ స్నేహితుల రాశి ఏంటో తెలిస్తే వారి స్వభావం ఇలా ఉంటుంది..

మేషరాశి 

మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి దృష్టిని ఆకర్షించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. అందరి మనసులో స్థానం సంపాదించేందుకు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. మెరుగైన జీవనశైలి నడిపేందుకు ఇష్టపడతారు. తమ సంతోషమే తమకు ముఖ్యం అన్నట్టు వ్యవహరిస్తారు. స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు..అదే సమయంలో కుటుంబం, స్నేహితుల విషయంలో విశ్వసనీయంగా ఉంటారు. ఈ రాశి స్త్రీలతో సహజంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువ. హఠాత్తుగా కోపాన్ని వ్యక్తం చేస్తారు..అంతలోనే క్షమించేస్తారు.

వృషభ రాశి 

వృషభం రాశి స్త్రీల జీవితం కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. కుటుంబమే వారి ప్రాధాన్యత. ఎలాంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు. కష్టపడి పనిచేస్తారు. ఈ రాశి స్త్రీలు తమ సొంత నిబంధనలు షరతులపై జీవితాన్ని గడుపుతారు. విశ్వసనీయతకు మారుపేరు. మొండితన ప్రదర్శించినప్పటికీ అందులో ప్రేమ, ఆప్యాయత నిండిఉంటుంది. 

మిధున రాశి 

మిథునరాశి స్త్రీలు మనసు చదవగలిగే తెలివైనవారు. బహుముఖ ప్రజ్ఞ వీరిసొంతం. ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కోనేందుకు, సాహసాలు చేయడానికి, కొత్త విషయాలను కనుగొనడానికి అస్సలు వెనుకడుగు వేయరు.  జీవితం పట్ల వారి ఆసక్తి వారిని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతుంది.ఈ రాశి స్త్రీలు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అందుకే తమప్రియమైనవారి పట్ల భావోద్వేగంతో ఉంటారు. నిర్ణయం తీసుకోవడంలో వారు అనిశ్చితంగా అస్థిరంగా ఉన్నప్పటికీ, ఉత్తేజపరిచే చర్చలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు.

Also Read: స్త్రీ శపథం చేస్తే ఇంత స్ట్రాంగ్ గా ఉండాలి!

కర్కాటక రాశి 

కర్కాటక రాశి స్త్రీలు ఇతరుల పట్ల చాలా శ్రద్ధ కనబరుస్తారు. ప్రియమైన వారిని చూసుకోవడం కన్నా వారికి ముఖ్యమైనది ఏమీ ఉండదు. ఈ రాశి స్త్రీలలో కూడా సున్నితత్వం, భావోద్వేగాలు ఎక్కువే అయినప్పటికీ ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చాలా చాకచక్యంగా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వారి ప్రశాంతమైన ప్రవర్తన దయగల స్వభావం ఇతరులను వారి వైపు ఆకర్షిస్తాయి. ఇతరుల అవసరాలను తమ సొంత అవసరాల కన్నా ఎక్కువగా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో మూడీగా అయిపోతారు.

సింహ రాశి 

సింహ రాశి స్త్రీలు చాలా శక్తివంతులు. ప్రేమను ప్రేమించే వ్యక్తికి వీరిచ్చే ప్రయార్టీనే వేరు. ఈ రాశి స్త్రీలలో ఉండే స్వతంత్ర స్వభావం ఇతరులను ఆకర్షిస్తుంది...ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా నిలబెడుతుంది. వీరు సవాళ్లను సంతోషంగా స్వీకరిస్తారు. జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. 

కన్యా రాశి 

కన్యారాశి స్త్రీలు చాలా నిజాయితీపరులు. అది వారి సహజసిద్ధమైన సామర్ధ్యం కూడా. వారి సరళత , విశాల దృక్పథం జీవితంలో అత్యంత సమస్యాత్మకమైన పరిస్థితిని కూడా సులభంగా నిర్వహించడానికి  సహాయపడుతుంది. ఈ రాశి స్త్రీలు తాముచేసే పనిని న్యాయంగా చేయాలి అనుకుంటారు. మాటల్లో కన్నా ఆచరణలో వీరు సిద్ధహస్తులు. కష్టపడి పనిచేస్తారు..అన్ని విషయాల్లో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

తులా రాశి 

తులా రాశి స్త్రీలు వాదనలు, భావోద్వేగ ప్రదర్శనలకు దూరంగా ఉంటారు. జీవితాన్ని పునరుద్ధరించుకునేందుకు వీరి ప్లానింగే వేరుగా ఉంటుంది. తమచుట్టూ ఉన్నవారంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అన్నీ వ్యవహారాలు సరిగ్గా జరగాలని కోరుకుంటారు. బంధాల్లో సమతుల్యతను పాటిస్తారు.

Also Read: ప్రేమ, క్షమ, ఆత్మాభిమానం, సహనానికి కేరాఫ్ - అందుకే యుగయుగాలకు ఆమె ఆదర్శం

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి స్త్రీలకు పనిపట్ల చాలా శ్రద్ధ. ఏ విషయంలో అయినా దృఢ సంకల్పం,  దృఢమైన మనస్సు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి స్త్రీలు తాము చూపించే ప్రేమకు పదిరెట్లు తిరిగి రావాలని ఆశిస్తారు.  శృంగార సంబంధంలో అత్యంత నిజాయితీపరులు. గెలుపు కోసం తీవ్ర స్థాయికి వెళ్లేందుకు కూడా వెనకాడరు. ఒక్కమాటలో చెప్పాలంటే వృశ్చికరాశి స్త్రీలలో ఉండే ప్రత్యేక వ్యక్తిత్వం..జీవితంలో ఎదురైన సవాళ్లను స్వీకరించి వాటిని అధిగమించేందుకు సహకరిస్తుంది. వీరిని అభిమానించేవారిని రక్షించేందుకు ఎంతవరకైనా పోరాడతారు.

ధనుస్సు రాశి 

ధనస్సు రాశి స్త్రీలు ప్రేమ, వ్యక్తిగతం జీవితంలో తొందరగా మునిగిపోతారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు చాలా ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఈ రాశి స్త్రీలు నిర్భయంగా మాట్లాడతారు. తమకు ఉన్నదాంట్లో సంతృప్తి కలిగి ఉంటారు. సహాసాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. తమ జీవితాన్ని సంతోషంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులు. వీరిలో ఆశావాదమే వీరిని ఆనందంగా ఉంచుతుంది. 

మకర రాశి 

మకర రాశి స్త్రీలు ఒక రహస్య స్వభావాన్ని ప్రదర్శిస్తారు..వీరి మనసులో ఏముందో ఇతరులు అస్సలు గ్రహించలేనంతగా వ్యవహరిస్తారు. ఈ రాశి స్త్రీలు కష్టపడిపనిచేస్తారు..తమ కలలను నెరవేర్చుకునేందుకు ఎంతదూరమైనా వెళతారు. తమ జీవితంలో ఎదురైన వ్యక్తులు ఎవర్ని ఎక్కడ ఉంచాలో వీరికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు స్వీయ నియంత్రణ చాలా ఎక్కువ. తాము తీసుకున్న నిర్ణయంపై స్ట్రాంగ్ గా నిలబడి ఉంటారు.

కుంభ రాశి 

కుంభ రాశి స్త్రీలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడతారు. ఇతరులను ఒప్పించడం కన్నా తమ స్వేచ్ఛా ప్రపంచంలో తాము ఉండాలి అనుకుంటారు. ఈ రాశి స్త్రీలు సృజనాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు. వీరు సమాజానికి భయపడతూ బతకాలని అస్సలు అనుకోరు. అలాగే స్వతంత్ర్య భావాలున్న భాగస్వామిని కోరుకుంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు.

మీన రాశి 

మీన రాశి స్త్రీలు చాలా సృజనాత్మకంగా, సున్నితంగా ఉంటారు. ఇతరుల పట్ల దయగల స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ జీవితంలో ఏం చేస్తున్నారో దానివల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో ఫుల్ క్లారిటీతో ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు.

Published at : 07 Mar 2023 07:31 AM (IST) Tags: International Women's Day International Women's Day 2023 International Women's Day history International Women's Day significance Personality Traits of Women as Per Their Zodiac Sign

సంబంధిత కథనాలు

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

మార్చి 31 రాశిఫలాలు,  ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి