News
News
వీడియోలు ఆటలు
X

జాతకంలో కేతు దోషం ఉందా? ఈ పరిహారాలు పాటించాల్సిందే

రాహు కేతువులు మన జీవితం మీద ఎప్పుడైనా ప్రభావం చూపించవచ్చు. ఈ గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో, పండితులు చెబుతున్న వివరాలు

తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

శని తర్వాత బాగా భయపెట్టే గ్రహాలు నక్షత్ర మండలంలో రాహు, కేతువులు. ఒక రకంగా ఇవి గ్రహాలు కావు. కానీ వాటిని ఛాయ గ్రహాలు అంటారు. శనితో న్యాయం అందించే వాడిగా పరిగణిస్తారు. కర్మ ఫలాలను అందిస్తాడు. తప్పు చెయ్యని వారికి హాని తలపెట్టడు. కానీ రాహుకేతువులు అలా కాదు.  

రాహు కేతు దశలు

కేతువు క్షుద్ర గ్రహం కావడం మూలంగా బ్రాంతి కలిగిస్తాడు. జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. జాతకంలో రాహు కేతువు పరిస్థితిని తెలుసుకుని పరిహారాలు చేసుకోవచ్చు.  రాహువు కంటే కేతువు మరింత హానికరం. జాతకంలో కేతు గ్రహం ఉచ్ఛ, నీచాల మీద మరింత శ్రద్ధ పెట్టాలి. కేతువు బ్రాంతులకు లోను చేసి నేరాలు చేయిస్తాడు. జాతకంలో కేతు దోషం ఉన్నవారు ఎప్పుడూ తప్పుడు మార్గంలోనే నడుచుకుంటారు. మంచి విషయాలను, మంచి వ్యక్తులను ఇష్ట పడరు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోలేరు.

కేతువు మీన రాశ్యాధిపతి

కేతువు మీన రాశి పాలక గ్రహం. అందుకే ఈ రాశి వారికి జాతకంలో రాహుం స్థానం చాలా ముఖ్యం. అంతే కాకుండా ధనస్సులో ఉచ్చ స్థితిలో ఉండి మిథునంలో క్షీణిస్తుంది. కాబట్టి ఈ మూడు రాశుల మీద కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేతువు ప్రభావం ఉన్న వ్యక్తుల లక్షణాలను చూస్తే అర్థమవుతుంది. జాతకంలో కేతు ఉచ్ఛ నీచ స్థితులు వ్యక్తుల లక్షణాలను బట్టి చెప్పవచ్చు.

జాతకంలో కేతు దోశం ఉన్న వ్యక్తులు చాలా సంవత్సరాలు సాధారణ జీవితాన్ని గడపుతారు. కానీ ఒక వయసు తర్వాత నెమ్మదిగా ప్రభావం కనిపిస్తుంది. మీనం, ధనస్సు, మిథున రాశి వారి జాతకంలో కేతువు ఉచ్చమైన దశ ఉంటే దాని ప్రభావం సాధారణంగా 48 నుంచి 54 సంవత్సరాల్లో కనిపిస్తుంది.

జాతకంలోని లగ్న, ఆరవ, పదకొండవ ఇంట్లో కేతువు ఉండడం అశుభం. అందువల్ల ఈ ఇళ్ళలో ఎక్కడ కేతువు ఉన్నా వెంటనే పరిహారాలు చేసుకోవాలి. లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అతడు నేరాలు చెయ్యవచ్చు, జైలుకు కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.

పరిహారాలు

కేతు దోష నివారణకు జ్యోతిషంలో కొన్ని పరిహారాలు సూచించారు. వాటిలో ఎర్ర చందనంతో చేసిన 108 పూసల జపమాల తీసుకుని పండితుల సమక్షంలో అభిమంత్రించి ప్రతి మంగళ వారం ధరించాలి. ఈ మాల ధరించడానికి ముందు ‘‘తారక గ్రమ మస్తక్, రౌద్రం రౌద్రతకం ఘోరం తన్ కేతుమ్ ప్రాణమామ్యహం’’ అని 108 సార్లు జపించి తర్వాత ఈ మాల ధరించాలి.

రత్న ధారణ

కేతు దుష్ప్రభావాలను నివారించేందకు వైడూర్యం ధరించాలి. ఇది నకిలీది కాకుడదు. సరైన రత్నం ధరించకపోతే మరింత నష్టం జరగవచ్చు.

కేతు యంత్రం

ఇంట్లో కేతు యంత్రం పెట్టుకుంటే ఇంట్లో వాళ్లందరిని కేతు దోషం నుంచి రక్షించవచ్చు. ఇనుము లేదా మిశ్రమ లోహంతో తయారు చేయబడిన ఈ యంత్రాన్ని పెట్టుకోవచ్చు. ‘‘ఓం ప్రాణ్ ప్రీం ప్రౌన్ సహ కేత్వే నమ:’’ అనే మంత్రాన్ని 10008 సార్లు జపించడం ద్వారా కేతువును ఆవాహనం చెయ్యవచ్చు. పూజా స్థలంలో లేదా కుటుంబ సభ్యులందరికి కనిపించే స్థలంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే కేతు దృష్టి దోషం ఎప్పటికీ మీ ఇంటి మీద పడదు.

సరస్వతి పూజ

కేతు దోషంతో మేధస్సు భ్రష్టు పట్టించేది కనుక దాని దుష్ప్రభావాలను నివారించేందకు సరస్వతి, గణపతిని పూజించడం మంచిది. అంతేకాక లక్ష్మీదేవిని కూడా క్రమం తప్పకుండా పూజించాలి. ఫలితంగా సంపద, గౌరవం కోల్పోకుండా ఉంటారు.

దానాలు

శని కటాక్షం కోసం దానం చెయ్యడం వల్ల కేతు దుష్ప్రభావల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. శనిని ఆరాధించడం, దాన ధర్మాలు చెయ్యడం, అవసరమైన వారికి సహాయం చెయ్యడం వల్ల కొంత వరకు మంచి ఫలితాలు పొందవచ్చు.

Also read: హనుమంతుడి నుంచి ఎన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ తెలుసుకోవచ్చో తెలుసా?

Published at : 22 May 2023 12:15 PM (IST) Tags: ketu dosham parihara pooja ketu yantra

సంబంధిత కథనాలు

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!

మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!