Today Horoscope in Telugu: మార్చి 24 ఆదివారం రాశి ఫలాలు (24/03/2024) - ఈ రోజు ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది!
Horoscope Prediction 24th March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
Daily Horoscope for March 24th 2024
మేష రాశి
మీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ పనిలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు కుటుంబ కార్యక్రమాల్లో లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆఫీసులో పనిలో సవాళ్లు పెరుగుతాయి. సహోద్యోగుల సహకారంతో పనిలో తప్పులు నివారిస్తారు. ఈ రోజు పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది..రోజంతా ఆనందంగా ఉంటారు.
వృషభ రాశి
వృత్తి జీవితంలో శక్తి, ఉత్సాహం వాతావరణం ఉంటుంది. మీరు కొత్త పనులకు బాధ్యత వహించడంలో నమ్మకంగా కనిపిస్తారు. ఈ రోజు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించండి. కుటుంబ జీవితంలో కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. విజయాన్ని సాధించడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తూ ఉండండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఆర్థికంగా అదృష్టవంతులు అవుతారు. ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రదేశాల నుంచి నిధులు సులభంగా లభిస్తాయి. గృహోపకరణాల కొనుగోలుకు ఈరోజు అనుకూలమైన రోజు. వైవాహిక జీవితం బావుంటుంది.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. వృత్తి జీవితంలో పై అధికారుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు తమ చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయకండి.
సింహ రాశి
సింహ రాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఒంటరి వ్యక్తులు ప్రతిపాదనను పొందవచ్చు. ఈ రోజు సోదర సోదరీమణుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. పెట్టుబడి సంబంధిత నిర్ణయాలలో నిపుణుల సలహాలను తప్పకుండా తీసుకోండి. ఇది భవిష్యత్తులో మీకు లాభాలను తెస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
కన్యా రాశి
ఈరోజు కన్యా రాశి వారికి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతాయి కానీ అన్నీ సర్దుకుంటాయి. కెరీర్లో పురోగతికి కొత్త అవకాశాలపై నిఘా ఉంచండి. కెరీర్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలను కచ్చితంగా తీసుకోవాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈ రోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!
తులా రాశి
ఈ రోజు తులా రాశి వారికి చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉంటాయి. జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి
ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత పాటించండి. ఆర్థిక స్థిరత్వం కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ రోజు మీ కలలన్నీ నిజమవుతాయి. మీ పని తీరుని ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనితీరుపై శ్రద్ధ వహించండి. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. మీ కెరీర్‌లో కొత్త విజయాలు సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి.
ధనుస్సు రాశి
ఈ రోజు మీ మనస్సు చంచలంగా ఉంటుంది. ఈ రోజు న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో పదోన్నతి అవకాశాలుంటాయి. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులకు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండండి. ఇది కెరీర్ ఎదుగుదలకు పుష్కలమైన అవకాశాలను అందిస్తుంది.
మకర రాశి
ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోకండి. ఈ రోజు పాత పెట్టుబడుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. అనేక మూలాల నుండి ధనం వస్తుంది. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి.
వృషభ రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కుంభ రాశి
కుంభరాశి వారు జీవితంలో కొత్త మార్పులను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు చేపట్టిన పనుల్లో జాప్యం ఉంటుంది. కష్టపడి పని చేసిన తర్వాతే అన్ని పనులు విజయవంతమవుతాయి. ఆఫీసులో సవాళ్లు పెరుగుతాయి. మీరు పనిలో అడ్డంకులను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మీన రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. సోమరితనానికి దూరంగా ఉండండి. పని పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. ఎదుటివారి హృదయాన్ని గాయపర్చేలా మాట్లాడొద్దు. మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. మీ బంధాల మధ్య సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.