Horoscope Today 22 April 2024 : ఈ రాశివారు మాటలు అదుపులో ఉంచుకోవాలి - ఏప్రిల్ 22 రాశిఫలాలు!
Daily Horoscope For All 12 Zodiac Signs: ఏప్రిల్ 22 సోమవారం ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
ఏప్రిల్ 22 సోమవారం రాశిఫలాలు (Horoscope Today 22nd April 2024 )
మేష రాశి
ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు శుభసమయం. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
వృషభ రాశి
అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మీ కెరీర్ కి ఉపయోగపడే వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగులకు ప్రమోషన్ లభించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరుగుతుంది
మిథున రాశి
మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వనరుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. కుటుంబ వాతావరణం బాగుంటుంది.
కర్కాటక రాశి
అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. ధనలాభం పొందే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మీరు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
సింహ రాశి
ఈ రాశివారికి సన్నిహితులతో విభేదాలు రావొచ్చు. అనవసర ఒత్తిడికి లోనవుతారు. ప్రయాణాలు వాయిదా పడవచ్చు. న్యాయపరమైన విషయాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేయవద్దు.
కన్యా రాశి
ఈ రాశివారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పిల్లలకు సమయం కేటాయిస్తారు. అనుకోని అతిథులు ఇంటికి వస్తారు. ఇంటి మరమ్మత్తుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!
తులా రాశి
ఈ రోజు మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. వాహన ఆనందాన్ని పొందుతారు. పిల్లల వైపు నుంచి గుడ్ న్యూస్ వింటారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు అధికపని వల్ల అలసిపోతారు. సన్నిహితులను కలుస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉండవచ్చు. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
ధనస్సు రాశి
ఈ రోజు మీరు ఎక్కువ సమయం ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. కార్యాలయంలో ఏదో ఒక సమస్య గురించి పై అధికారితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పొద్దు...
Also Read: ఏప్రిల్ 23 నుంచి జూన్ 01 వరకూ ఈ పారాయణం చేయండి - ఫలితం మీరు ఊహించలేరు!
మకర రాశి
మీరు ఈ రోజు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు. చాలా సంతోషంగా ఉంటారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
కుంభ రాశి
మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. శుభ కార్యాలలో పాల్గొంటారు. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో మంచి లాభాలు ఉండవచ్చు
Also Read: పిల్లలకు అందుకే హనుమాన్ సూపర్ హీరో!
మీన రాశి
కుటుంబంలో కొందరి సభ్యుల ప్రవర్తన మీ విషయంలో మారుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆరోగ్యం బావుంటుంది. సంతోషంగా ఉంటారు..
Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మార్పులుంటాయి