Chanakya Niti: స్త్రీలలో ఈ 5 లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం అవుతుందట!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కొంతమంది మహిళలు ఇంటిని నాశనం చేయడానికి పని చేస్తే, కొంతమంది కుటుంబానికి అదృష్టాన్ని తెస్తారని చెప్పాడు. మరి అలాంటి స్త్రీలను ఎలా గుర్తించాలి..?
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ప్రపంచంలోని గొప్ప పండితులలో ఒకడిగా గుర్తింపుపొందాడు. చాణక్య నీతి తన జ్ఞానం, అనుభవం ఆధారంగా రాసిన చాణక్య నీతి ఏ వ్యక్తినైనా అనేక రకాల సమస్యలు, అడ్డంకుల నుంచి రక్షిస్తుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంధంలో వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, జీవితం, డబ్బు, ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఆలోచనల గురించి వివరించాడు. ఈ కారణంగానే నేటికీ ప్రజలు చాణక్య నీతి సూత్రాలను పాటిస్తున్నారు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇంటిని నాశనం చేసే మహిళల గురించి కూడా పేర్కొన్నాడు. ఇంటిని ధ్వంసం చేసే మహిళలను ఎలా గుర్తించాలి..?
పెద్ద అరచేతులు కలిగిన స్త్రీలు
అరచేతులు పెద్దగా ఉండటం మంచిదని భావిస్తారు. అయితే పెద్ద అరచేతులు ఉన్న మహిళలు అదృష్టం పరంగా పేదవారు. వారు జీవితంలో తక్కువ ఆనందం, ఎక్కువ కష్టాలను పొందుతారు. వారు తరచుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అలాంటి వారితో కలిసి జీవించే వ్యక్తి అదృష్టం కూడా దిగజారడం ప్రారంభమవుతుంది.
పొడవాటి మెడ ఉన్న స్త్రీలు
ఆచార్య చాణక్యుడు తన గ్రంధంలో చిన్న మెడ ఉన్న స్త్రీలు సాధారణంగా నిశ్శబ్ద స్వభావం కలిగి ఉంటారని పేర్కొన్నాడు. వారి అదృష్టం చాలా బాగుంటుంది. అటువంటి స్త్రీలే కాదు, అలాంటి స్త్రీలతో ఉన్న వ్యక్తి కూడా ప్రయోజనాలను పొందుతాడు. మరోవైపు, పొడవైన మెడ ఉన్న మహిళలు తెలివైన మహిళలు. కానీ, అలాంటి స్త్రీలు స్వార్థపరులు. అలాంటి మహిళలు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు, ఇంట్లో ఇతరుల గురించి ఆలోచించరు.
పసుపు కళ్లు గల స్త్రీలు
ఆచార్య చాణక్య ప్రకారం, బూడిద రంగు కళ్లు ఉన్న స్త్రీలు కుటుంబాన్ని కలిసి ఉంచాలని భావిస్తారు. కానీ పసుపు రంగు కళ్లు ఉన్న స్త్రీలు అనారోగ్యంతో బాధపడుతుంటారు. దీనివల్ల వారికి అనారోగ్యానికే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. ఫలితంగా భర్త సంపాదన ఆమె వైద్యానికి ఖర్చుచేయాల్ని వచ్చి పేదవాడు అవుతాడు.
పెద్ద దంతాలు కలిగిన స్త్రీలు
ఆచార్య చాణక్య ప్రకారం పొడవైన, పెద్ద దంతాలు కలిగిన స్త్రీలు తమ జీవితంలో ఎక్కువ భాగం దుఃఖంలో గడుపుతారు. వారు కోపంగా, చిరాకుగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో పొడవైన, పెద్ద దంతాలు ఉన్న స్త్రీ కుటుంబాన్ని నాశనం చేస్తుందని సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుందని చాణక్యుడు పేర్కొన్నాడు.
Also Read : ఈ 3 చిట్కాలతో ఎంత కష్టమైన పని అయినా చిటికెలో పూర్తి చేసెయ్యొచ్చు
పొడవాటి వేళ్లు ఉన్న స్త్రీలు
ఆచార్య చాణక్య ప్రకారం, కాలి బొటనవేలు కంటే తర్వాత వేలు పొడవుగా ఉన్న స్త్రీలు కుటుంబానికి మేలు చేయరు. అలాంటి స్త్రీలు గొడవపడే స్వభావం కలిగి ఉంటారని, ఇంట్లో ఎప్పుడూ కలహాలు సృష్టిస్తారని భావిస్తారు. ఎదుటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేలా వారి కోపం ఎప్పుడూ ముక్కుపైనే ఉంటుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.