సెప్టెంబరు 10 రాశిఫలాలు - ఈ రాశులవారు ఈ రోజు రహస్య విషయాలపై అధ్యయనం చేస్తారు!
Horoscope Prediction 10 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
![సెప్టెంబరు 10 రాశిఫలాలు - ఈ రాశులవారు ఈ రోజు రహస్య విషయాలపై అధ్యయనం చేస్తారు! Bhadrapada Masam 2024 Horoscope Today 10 September 2024 rasi phalalu today in telugu check your zodiac sign సెప్టెంబరు 10 రాశిఫలాలు - ఈ రాశులవారు ఈ రోజు రహస్య విషయాలపై అధ్యయనం చేస్తారు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/09/e635eb4e27f21ef18190e4a75c5f37da1725877969644217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Daily Horoscope for 10 September 2024
మేష రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందలేరు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలుంటాయి. స్వార్థపరులకు దూరంగా ఉండాలి. అవసరం అయిన సమయానికి డబ్బు చేతికి అందదు.
వృషభ రాశి
కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. ఇంటి అలంకరణ కోసం టైమ్ పెడతారు. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ రోజు శుభఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మిథున రాశి
వైవాహిక జీవితంలోని ఒత్తిడి దూరమవుతుంది. స్నేహితుల సలహాలు ఈరోజు మీకు ఉపయోగపడతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి - వార ఫలాలు ( సెప్టెంబరు 09 - 15)
కర్కాటక రాశి
చేసే పనిపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించండి. అధికారులు అకస్మాత్తుగా మీనుంచి ముఖ్యమైన సమాచారాన్ని కోరవచ్చు. పని నాణ్యతపై శ్రద్ధ వహించండి. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి..లేదంటే మీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. పిల్లలపై మీ అభిప్రాయాలు రుద్దవద్దు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
సింహ రాశి
ఈ రోజు కుటుంబంలో సంతోషం వాతావరణం ఉంటుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
కన్యా రాశి
ఈ రాశి వ్యాపారులు మంచి పురోగతి సాధిస్తారు..నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వైవాహిక జీవితంలో సామరస్యం బావుంటుంది. మీడియా రాంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వచనం మీపై ఉంటుంది. విద్యార్థుల ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొందుతారు.
తులా రాశి
ఆస్తులకు సంబంధించి కొనసాగుతున్న వివాదాలు ఈ రోజు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు అనిపిస్తాయి కానీ భవిష్యత్ లో ప్రయోజనం పొందుతారు. ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు తలెత్తుతాయి.
Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!
వృశ్చిక రాశి
ఈ రాశివారికి అనారోగ్య సమస్యలుంటాయి. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు గుడ్ న్యూస్ వింటారు. రహస్య విషయాలను అధ్యయనం చేస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి బహుమతులు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ధనస్సు రాశి
ఈ రాశివారు ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండాలి. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కోపంతో వైవాహిక బంధంలో చికాకులు ఏర్పడతాయి. పాత ప్రతికూల విషయాలు మీపై ఇప్పుడు ఆధిపత్యం చెలాయిస్తాయి.
మకర రాశి
ఈ రోజు మీ మానసిక స్థితి బావుంటుంది. అన్ని పనులు సులభంగా సమయానికి పూర్తిచేస్తారు. అతిగా ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వ్యాపారంలో పెరుగుదల ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు.
కుంభ రాశి
ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. సంక్లిష్టమైన విషయాలను మీకు అనుకూలంగా పరిష్కరిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో తీవ్రమైన సమస్యల గురించి చర్చిస్తారు. మీ వ్యక్తిత్వానికి అందరూ ఆకర్షితులవుతారు. ఉద్యోగంలో బదిలీలు జరిగే అవకాశం ఉంది.
మీన రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాల్సిన ఒత్తిడి మీపై ఉంటుంది. ఇంటి పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు చాలా మంచి రోజు.
Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)