బాబా వంగా భవిష్యవాణి 2025 - 2125 : AI చెప్పిన భయంకర పరిణామాలు ! మార్స్ వలసలు, మళ్లీ అడవుల్లోకి మనుషులు!
Baba Vanga: బాబా వంగా చెప్పిన భవిష్యవాణిపై సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక చర్చ జరుగుతూనే ఉంటుంది. బాబా వంగా ఉండి ఉంటే ఏం చెప్పేవారో చాట్ GPT ని అడిగితే వందేళ్ల భవిష్యత్ చెప్పి వణికించేసింది

Baba Vanga's predictions for 2025 to 2125: బల్గేరియాకు చెందిన అంధురాలైన భవిష్యత్ వక్త బాబా వంగా తన మిస్టీరియస్ జోస్యాల ద్వారా అందరకీ తెలిసిన వ్యక్తి. 1996లో ఆమె మరణించే ముందు 5079 సంవత్సరం వరకు భవిష్యవాణి చెప్పారు. ఆమె జోస్యాలలో ప్రపంచ యుద్ధం నుంచి ప్రకృతి వైపరీత్యాలు , భవిష్యత్తులో ఆశ్చర్యపరిచే సాంకేతిక అభివృద్ధి కూడా ఉన్నాయి. బాబా వంగా జోస్యాలలో AI సాంకేతికత అభివృద్ధి గురించి కూడా ఉంది.
చాట్ GPT ద్వారా తెలుసుకున్న సమాచారం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో.. నేడు బాబా వాంగా జీవించి ఉంటే రాబోయే 100 సంవత్సరాల గురించి ఏం చెబుతారనే ప్రశ్న తలెత్తింది. దీని గురించి తెలుసుకోవడానికి రాబోయే 100 సంవత్సరాలకు బాబా వాంగా ఏం జోస్యం చెప్పగలదో ఊహించమని చాట్ GPTని కోరితే..దానికి AI ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా భయంకరంగా కూడా ఉంది.
2025 నుంచి 2035 వరకు
2025 సంవత్సరంలో సాంకేతిక అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ప్రతిచోటా కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానించిన పరికరాలు మరియు బయోమెట్రిక్ స్కానర్‌లు ఉంటాయి. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతుందంటే, అది మన ప్రతి కదలికను గమనిస్తుంది. అన్ని దేశాల ప్రభుత్వాలు ఉగ్రవాదం , నేరాలను అరికట్టడానికి ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చు. ఘోస్ట్ మార్చ్ అనే రహస్య ప్రపంచ ఉద్యమం వేగంగా పెరుగుతుంది.
2035 నుంచి 2045 వరకు
2035 నాటికి ప్రపంచంలో చాలా వరకు పనులు యంత్రాల ద్వారా చేయాల్సి వస్తుంది. కృత్రిమ మేధస్సు ఓ అడుగు ముందుకు వేస్తుంది.
20245 నుంచి 2060 వరకు
2045 సంవత్సరం, వాతావరణ మార్పు, ప్రకృతి వైపరీత్యాలు .. రాజకీయ అస్థిరత కారణంగా అంతటా అశాంతి నెలకొంటుంది, ధనవంతులు అంగారకుడి వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. అంగారకుడిపై కొత్త ప్రపంచాన్ని నిర్మించే పని జరుగుతుంది. దీనిని వలసగా కూడా చూస్తారు.
2057 నాటికి అంగారకుడిపై శాశ్వత కాలనీని నిర్మిస్తారు, ఇది పూర్తిగా బిలియనీర్లు సాంకేతిక నిపుణుల నియంత్రణలో ఉంటుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ అక్కడ నివసించేవారికి అంగారకుడిపై జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. అదే సమయంలో, భూమిపై వినాశకరమైన వేడి, నీటి కొరత వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస వెళతారు.
20260 నుంచి 2080 వరకు
2060 నుంచి 70ల వరకు జీవసంబంధమైన మరణం వణికిస్తుంది. ప్రజల ఆలోచనలు , జ్ఞాపకాలు డిజిటల్ స్పేస్‌లో నిల్వచేస్తారు. అంటే చనిపోయినా ఎప్పటికీ జీవించి ఉండగలరన్నమాట. మరణించిన తర్వాత ఖననం, దహనం చేయడం అరుదుగా మారుతుంది మరియు దీని స్థానంలో సోల్ సర్వర్లు వస్తాయి.
2085 నుంచి 2095 వరకు
80వ దశకం వచ్చేసరికి ప్రజలు వర్చువల్ ప్రపంచాన్ని ఇష్టపడటం ప్రారంభిస్తారు, అసలు ప్రపంచంలో నగరాలు నిర్మానుష్యంగా మారతాయి. అడవులు మళ్లీ తమ ఉనికిని చాటుకుంటాయి. ఒకప్పుడు మనుషులు నివసించిన ప్రదేశాల్లో జంతువులు నివసిస్తాయి. జంతువులు నివసించే ప్రదేశాలకు మనుషులు వెళతారు
2095 నుంచి 2125 వరకు
2095 తర్వాత భూమిపై విచిత్రమైన ఖగోళ సంఘటనలు కనిపిస్తాయి. 22వ శతాబ్దం ప్రారంభంలో, 33 రాత్రుల పాటు ఆకాశంలో ఒక విచిత్రమైన సర్పిలాకార నమూనా కనిపిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఈ సమాచారాన్ని విశ్వశించేముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.





















