అన్వేషించండి

Zodiac Signs: ఈ రాశులవారికి అసూయ చాలా ఎక్కువ - ఎదుటివారి సక్సెస్ ను అస్సలు భరించలేరు!

Astrology: అసూయ..ఇది సాధారణంగా మనిషికుండే భావోద్వేగం. తామెంత గొప్పగా ఆలోచిస్తాం అనుకున్నా ఏదో ఒక సందర్భంలో వేరొకరి విజయాన్ని చూసి అసూయచెందుతారు. ఇలాంటి భావోద్వేగం ఈ రాశులవారిలో ఎక్కువగా ఉంటుందట..

Zodiac Signs:  వేరొకరి ఎదుగుదల చూసి సహించలేనివారు అసూయతో రగిలిపోతుంటారు. తమకన్నా ఎదుటివారి ఎక్కువ అనే భావనను అస్సలు జీర్ణించుకోలేనివారుంటారు. ఈ ఓర్వలేని తనం కొందరు బహిరంగంగా వ్యక్తపరిస్తే మరికొందరు లోలోపలే ఫీలవుతారు.  అయితే ఈ స్వభావం  వారి జన్మరాశులపై అధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అందరిలోనూ ఈ స్వభావం ఏదోఒక సందర్భంలో బయపడుతుంది కానీ అందరికన్నా ఈ నాలుగు రాశులవారు అంతకుమించి అనేలా ఉంటారట... మరి ఎదుటివారిని చూసి అసూయపడే రాశులలో మీరున్నారా...ఇక్కడ చెక్ చేసుకోండి...
 
మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రాశివారు విజయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు...ఓటమిని అస్సలు అంగీకరించలేరు. కొన్నిసార్లు తమకు రావాల్సిన సక్సెస్ వేరొకరి వెళ్లిపోయిందనే ఆలోచనలో మునిగిపోయి వారిని చూసి అసూయ చెందుతారట. ఈ విషయాన్ని అంత తొందరగా బయటకు చెప్పలేరు కానీ లోలోపలే అసూయతో రగిలిపోతుంటారు...

Also Read: మిథున రాశిలోకి శుక్రుడు - ఈ రాశులవారికి కనవర్షమే!
 
వృషభ రాశి   (Taurus) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈ రాశివారు కష్టపడి పనిచేస్తారు..కానీ అందుకు తగిన ప్రతిఫలం రాకపోతే మాత్రం అస్సలు భరించలేరు. అనుకున్న పని అవకపోతే నిరాశ చెందడం కామన్ కానీ ఈ రాశివారు అసూయపడతారట. ఇతరుల అదృష్టాన్ని ,అభివృద్ధిని చూడలేరంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
 
సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రాశివారు ఎప్పుడూ ఇతరుల నుంచి ప్రశంసలు మాత్రమే కోరుకుంటారు...వాటినే స్వీకరిస్తారు. విమర్శను భరించలేరు. పోటీ స్వభావం ఉంటుంది కానీ ఓటమిని అంగీకరించలేరు. వేరొకరు తమను మించిపోతున్నారని భావిస్తే చాలు తెగ బాధపడిపోతుంటారు... 

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం,అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశివారు ఎక్కువగా జీవిత భాగస్వామి విషయంలో అసూయ చెందుతారు. వారెప్పుడూ తమ స్వాధీనంలో ఉండాలని కోరుకుంటారు... ఆ విషయాన్ని బయటపడనివ్వరు కానీ మనసులో అదే భావనతో ఉంటారు. అందుకే తమ బాగస్వామి వేరొకరి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని తెలిస్తే అసూయచెందుతారు. 
 
ధనస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారు ఎదుటివారిని చూసి అసూయపడుతుంటారు. వీరు సక్సెస్ అయితే పర్వాలేదు కానీ వీరు ఫెయిలై ఎదుటివారు సక్సెస్ అయితే మాత్రం ఆ ఆనందాన్ని ఆనందంగా అంగీకరించలేరు. లోలోపలే అసూయపడతారు. తాము తప్ప మరొకరి సక్సెస్ ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేరు. 

Also Read: అత్యంత ఆకర్షణీయమైన రాశుల్లో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!

మకర రాశి  (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఈ రాశివారు ఇతరులను చూసి అసూయపడుతంటారు. వీరి కారణంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఎదుటివారు వారి ప్రపంచంలో హ్యాపీగా ఉండడాన్ని జీర్ణించుకోలేరు. వీరి ముఖంలో అసూయ కనిపించదు కానీ మనసులో చాలా ఉంటుంది.  

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం
అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Embed widget