News
News
X

Shani Effect In Zodiac Signs: శని మకరరాశిలో ప్రవేశం,ఈ రాశులవారికి దీపావళి ముందే వచ్చేసింది

శనీశ్వరుడు అక్టోబర్ 24న, ధనత్రయోదశినాడు కుంభరాశి నుంచి మకరరాశికి వక్రమార్గంలో ప్రయాణించనున్నాడు. దానివల్ల కొన్ని రాశులకు కనకవర్షం కురవనుంది. మరి ఆ రాశులేంటో తెలుసుకోండి.

FOLLOW US: 
 

జ్యోతిష్య శాస్త్రంలో శ‌నీశ్వ‌రుడు చాలా ప్ర‌ధాన‌మైన గ్ర‌హం. శ‌నీశ్వ‌రుడి గ‌మ‌నాన్ని బ‌ట్టే వ్యక్తుల లేదా ప‌రిస్థితుల శుభాశుభ కాలాన్ని నిర్ణ‌యించ‌వ‌చ్చు. శని గ్రహానికి మందుడు అని పేరు. ఇతను చాలా నెమ్మదిగా కదులుతాడు సాధార‌ణంగా శ‌నీశ్వ‌రుడు ఒక రాశి నుంచి మ‌రొక రాశి లోకి వెళ్ల‌డానికి రెండున్న‌ర సంవ‌త్స‌రాల స‌మ‌యాన్ని తీసుకుంటాడు.

శ‌నీశ్వ‌రుడు ప్ర‌స్తుతం సొంత రాశి చ‌క్ర‌మైన కుంభ‌రాశిలో తిరోగ‌మ‌నంలో ఉన్నాడు. ఇప్పుడు అక్టోబ‌ర్ 23 న ఉద‌యం నాలుగు గంట‌ల పంతొమ్మిది నిమిషాల‌కు తిరిగి మ‌క‌ర‌రాశికి చేరుకోనున్నాడు. ఆరోజు ధ‌న త్ర‌యోద‌శి కూడా. మ‌క‌ర‌రాశిలో చేరుకున్న‌ప్ప‌టికీ శ‌ని వ‌క్ర‌మార్గంలో ప్ర‌యాణిస్తాడు. దీనివ‌ల్ల కొన్నిరాశుల వారికి అశుభ ఫ‌లితాలు క‌లుగుతాయి. మ‌రికొన్ని రాశుల వారికి శుభ‌ఫ‌లితాలు క‌లుగుతాయి. ఈ రాశిలో శ‌ని జ‌న‌వ‌రి 2023 వ‌ర‌కు ఉంటాడు. ఆ త‌ర్వాత తిరిగి కుంభ‌రాశిలోకి వెళ్తాడు. ఈ సంద‌ర్భంగా శ‌ని మ‌క‌ర‌రాశిలో ప్ర‌వేశించ‌డం మూలానా కొన్నిరాశుల వారికి లాభ‌దాయ‌క సూచ‌న‌లు ఉన్నాయి. ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆ రాశుల‌కు క‌న‌క‌వ‌ర్షం కుర‌వనుంది.  మ‌రి ఆ రాశులేంటో తెలుసుకుందాం!

మేష రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు వక్రమార్గంలో మకరరాశిలోకి చేరుతున్నందున్న ఈరాశి వారికి శుభఫలితాలుంటాయి. ప్రస్తుతం శని ఈ రాశివారికి 10వ స్థానంలో ఉన్నాడు. అది శుభప్రదం. అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది. అంతేకాదు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి శుభసమయం. అయితే డబ్బు కొంత అధికంగా ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ఖర్చు మంచి వాటికోసం మాత్రమే వినియోగిస్తారు. దానివల్ల భవిష్యత్తులో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఇంటా, బయట గౌరవమర్యాదలు కలుగుతాయి.

తులా రాశి

తులారాశి వారికి ఈ శనిగ్రహ సంచారం లాభాన్ని చేకూరుస్తుంది. ఎప్పటి నుంచో చేయకుండా అలాగే  ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో వ్యయప్రయాసలు ఉన్నా అవన్నీ పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో ఉన్న ఆర్థికపర ఇబ్బందులన్నీ సమసిపోతాయి.  ఆర్థికపరమైన విషయాలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. రుణబాధలు తీరిపోయే సూచనలు ఉన్నాయి. ఇది మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

News Reels

ధ‌న‌స్సు రాశి

శని మకరరాశిలో ప్రవేశిస్తున్నందున్న ధనస్సురాశి వారికి అదఈష్టం కలిసిరానుంది. కనకవర్షం కురుస్తుంది.  ఈ రాశి వారికి జనవరి వరకు లాభదాయకంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. దాని వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఎప్పటి నుంచో రాని మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో కీర్తిప్రతిష్టతలు పెరుగుతాయి.

మీన రాశి

శని మకరంలోకి వెళ్లడం వల్ల ఈ రాశివారు అన్నింటా అఖండమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలున్నాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. మానసిక ఉల్లాసంతో కాలం గడుపుతారు. ఆర్థికపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ ప‌రంగా అనుకూలంగా ఉంటుంది. వ్య‌వ‌సాయ‌దారుల‌కు అనుకూల‌మైన కాలం.

Also Read: ఈ నెల 25న సూర్యగ్రహణం, దీపావళి 24 లేదా 25 ఎప్పుడు జరుపుకోవాలి!

Published at : 14 Oct 2022 05:05 PM (IST) Tags: zodiac signs deepavali Shani Astrology shani dev kumba rasi makara rasi dhana trayodashi

సంబంధిత కథనాలు

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!

Geetha Jayanthi2022: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022:  ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి

Geetha Jayanthi2022:  ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే  మార్గదర్శి

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 3rd December 2022: ఈ రాశివారు ధీమా వీడకపోతే వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd  December 2022:  ఈ రాశివారు ధీమా వీడకపోతే  వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్ "ఘాజీ "కీ అమెరికాకు లింకేంటి ? ఘాజీ శకలాలను చూస్తారా !

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Mlc Kavitha Meets CM KCR :  సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!