Shani dev: ఈ తప్పులకు తొందరగా పశ్చాత్తాపపడండి లేదంటే శిక్ష నుంచి తప్పించుకోలేరు!
Shani dev: శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలంటే శని దోషం నివారణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం..లేదంటే కొన్ని శిక్షల నుంచి తప్పించుకోలేరు

Astrology : ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారా? మీ జాతకంలో శనిదోషం వెంటాడుతోందా? శని ప్రభావం తీవ్రంగా ఉందా? అయితే ఏం చేయాలో కాదు..ఏ తప్పులు చేయకూడదో ముందుగా తెలుసుకోండి...
శని గాయత్రీ మంత్రం
ఓం కాకద్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి
తన్నో మందః ప్రచోదయాత్ ఓం
న్యాయ దేవత శని దేవుని మీన రాశిలో సంచరిస్తున్నాడు. 29 మార్చి 2025నుంచి మీనంలో ఉన్నాడు. శని గ్రహం యొక్క స్థితి మీన రాశిలో ప్రభావవంతంగా మారింది..ఈ సమయంలో అందరూ ఈ ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా పరిగణించాలి. ఈ తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఈ తప్పులు చేయకుండా ఉండాలి
అబద్ధం చెప్పకండి
శని అబద్ధాలు చెప్పే వారిని క్షమించడు..ఎప్పుడూ సత్యం మాట్లాడేవారిపై శని ప్రభావం తక్కువగా ఉంటుంది. కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చినా వారు ఆ చికాకుల నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారు
ఇతరులను మోసం చేయడం
ఇతరులను మోసం చేసి లాభం పొందాలి అనుకునేవారు ఈ రోజు సంతోషంగా ఉన్నా..రానున్న రోజుల్లో అందుకు మించిన ఫలితం అనుభవించక తప్పదు. ముఖ్యంగా శని ప్రభావం నుంచి అస్సలు తప్పించుకోలేరు. నిజాయితీగా ప్రవర్తించాలి..నమ్మినవారి నమ్మకాన్ని నిలబెట్టేలా ఉండాలి
సోమరితనం వీడండి
సోమరితనం, నిర్లక్ష్యాన్ని శని అస్సలు సహించడు. సాధారణ శని ప్రభావంకన్నా సోమరులపై శని ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకే సోమరితనం వీడి ఉత్సాహంగా మీరు చేయాల్సిన పనిలో దూసుకెళ్తే చాలు ...శని ప్రభావం మీపై ఊహించనంతగా తగ్గుతుంది. అందుకే కష్టపడండి, చమటోడ్చండి
ధర్మ బద్ధంగా వ్యవహరించండి
శనిని న్యాయ దేవతగా భావిస్తారు. న్యాయబద్ధంగా, ధర్మ బద్ధంగా వ్యవహరించేవారికి మంచి చేసే చెడు అధర్మం, అన్యాయం మార్గంలో నడిచేవారిని పట్టి పీడిస్తాడు. అందుకే న్యాయంగా వ్యవహించండి...అవసరమైనవారికి సహాయం చేయండి.
శని దేవుని పరిహారాలు
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి దానధర్మాలు చేయండి
శని దేవుని మంత్రాలను జపించండి..నిత్యం జపిస్తే మంచిది లేదంటే శనివారం తప్పనిసరి
శనివారం రోజు శని దేవుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి..శనికి నూనె సమర్పించండి
మంచి కర్మలు ఆచరించండి...మంచి ప్రవర్తనతో ఉండేవారితోనే మెలగండి
శని శాంతి మంత్ర స్తుతి
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
ఈ శ్లోకాన్ని 11 సార్లు జపించి కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఎన్నాళ్లుంటుంది... ఏ శని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి....
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాల ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. Abp Desam ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఇది కేవలం ప్రాధమిక సమాచారం. మీరు పరిగణలోకి తీసుకునేముందు అనుభవజ్ఞులైన, మీకు నమ్మకమైన ఆధ్యాత్మిక వేత్తల సలహాలు స్వీకరించండి





















