Astrology : వివాహానికి అనుకూలమైన రాశులివే!
ఈ రాశుల వారు పెళ్లి చేసుకుంటే ఏడు జన్మలకి ఇలాగే భార్య భర్తలు అవుతారట. అంతేకాకుండా ఉత్తమ జంటల్లా నిలుస్తారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మీ జంట ఉందా ఇందులో...
Astrology : పెళ్లి చేసుకున్న ప్రతి జంటా సంతోషంగా ఉండాలి అనుకుంటారు. తమకు అనుకూలంగా ఉండే భాగస్వామిని కోరుకుంటారు. ప్రతి అడుగులోనూ, సుఖంలోను, దుఃఖంలోను ఒకరికి ఒకరు అండగా నిలిచి జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంటారు. ఇలా జీవించాలంటే ఇద్దరికీ సమన్వయం అవసరం. జీవిత భాగస్వామి రాశి, మీతో మ్యాచ్ అయితే ఇద్దరి మధ్య అన్యోన్య జీవితం ఉంటుంది. మీ వైవాహిక జీవితాన్ని మీ రాశి నిర్ణయిస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అందుకే మీ వివాహ బంధం కూడా అన్యోన్యంగా సాగాలంటే మీ మనస్తత్వానికి సరిపడా రాశివారిని ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. ఆ రాశులేంటో చూద్దాం..
మిథున రాశి - తులా రాశి
మిధున రాశి , తులా రాశి వారి జోడి అదుర్స్ అనేలా ఉంటుంది. ఒకరిపై ఒకరు చాలా ఇష్టంగా ఉంటారు. పరస్పర అవగాహన ద్వారా సంబంధాన్ని దృఢంగా మలుచుకుంటారు. జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఏడేడు జన్మలకు కలసి ఉండాలని కోరుకుంటారట.
సింహ రాశి - తులా రాశి
ఈ రెండు రాశులకు చెందిన వ్యక్తులు పెళ్లిచేసుకుంటే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇద్దరికీ సమాజ సేవపై ఆసక్తి ఉంటుంది. నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ఇష్టపడతారట.
మేష రాశి-కుంభ రాశి
మేష రాశివారికి కుంభరాశికి చెందిన వ్యక్తులు పర్ ఫెక్ట్ జోడీ. ఈ రెండు రాశులవారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుంటారు. వీళ్లె కుంభ రాశుల వారు పర్ఫెక్ట్ మ్యాచింగ్. మెడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటుంది ఈ రెండు రాశుల జంట. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎదుర్కొంటారు కానీ కలసే ఉండేందుకు ఇష్టపడతారు.
Also Read: వీధిపోటు ఈ దిశగా ఉంటే ఆస్తి నష్టం, కోర్టు కేసులు - ఆ 4 దిశల్లో ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం!
వృషభ రాశి - వృశ్చిక రాశి
వృషభ రాశివారికి సరైన జోడీ వృశ్చిక రాశికి చెందినవారు. ఈ రెండు రాశుల వారు పెళ్లి చేసుకుంటే గొడవలకి ఆస్కారం ఉండదు. ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించాలి అనుకోరు. నాయకత్వం విషయంలో ఎప్పుడూ ఘర్షణ పడరు. ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవిస్తారు. ఈ రెండు రాశుల వారికి ఒకరితో ఒకరికి గాఢమైన సంబంధం ఏర్పడుతుంది
వృషభ రాశి - కన్యా రాశి
ఈ రెండు రాశులకు చెందిన వారు పెళ్లిచేసుకుంటే వారి జీవితం సంతోషమయం. ఇద్దరి స్వభావం బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇద్దరూ ఒకరితో మరొకరు నిజాయితీగా ఉంటారు. అసలు ఈ రెండు రాశుల వ్యక్తులు ఒక్కటైతే వారిమధ్య దాపరికం అనే మాటే ఉండదు
సింహ రాశి - ధనస్సు రాశి
సింహ రాశివారికి సరైన జోడీ ధనస్సు రాశివారు. ఈ రెండు రాశులకు చెందిన వారు పెళ్లిచేసుకుంటే ఒకరికి అనుకూలంగా మరొకరు ఉంటారు. ఏ పని తలపెట్టినా ఇద్దరూ సంప్రదించుకునే ముందడుగు వేస్తారు. ఈ జంటలో ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకం అస్సలు సడలదు. ఇద్దరూ కలసి ఎక్కువ సమయం స్పెండ్ చేసేందుకు ఇష్టపడతారు.
Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ వాహనం( టూ వీలర్ or ఫోర్ వీలర్) ఏ రంగు ఉండాలో తెలుసా!
కన్యా రాశి - మకర రాశి
వివాహానికి అనుకూలమైన జోడీగా కన్యా రాశి- మకర రాశివారుంటారు. ఈ రెండు రాశులవారు వివాహం చేసుకుంటే ఏడేడు జన్మలకు అదే బంధాన్ని కోరుకునేలా ఉంటారట. ఎలాంటి అరమరికలు లేని జీవితాన్ని గడుపుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఈ రెండు రాశులవారికి ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణ ఉంటుంది. ఇద్దరి మధ్యా నిజాయితీ నెలకొంటుంది. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కలిసే ఉంటారు కానీ ఒంటరిగా ఉండాలన్న ఆలోచన రాదు వీరికి.
గమనిక: ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.