అన్వేషించండి

అక్టోబరు 10 రాశిఫలాలు - దుర్గాష్టమి రోజు ఈ రాశులవారిపై శక్తి అనుగ్రహం...చేపట్టిన పనుల్లో విజయం!

Horoscope Prediction 10th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 10th October 2024 

మేష రాశి

దుర్గాష్టమి మేషరాశివారికి మంచి రోజు అవుతుంది. కొత్తగా ప్రారంభించే పనులన్నీ సక్సెస్ అవుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వచనం మీపై ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారికి గౌరవం పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరించేందుకు ఇదే మంచి సమయం. అప్పులు చేయాల్సి రావొచ్చు జాగ్రత్త పడండి. 

వృషభ రాశి

ఈ రోజు వృషభ రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది..అనుకోని ఆదాయం చేతికందుతుంది. కొత్త వ్యక్తులతో వ్యక్తిగత విషయాల గురించి చర్చించవద్దు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. నూతన పెట్టుబుడులు పెట్టే ఆలోచన ఉంటే అడుగు ముందుకు వేయండి. 

మిథున రాశి

ఈ రాశివారు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సహనంతో వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు తీవ్రంగా నష్టపోతారు. మీ మాటతీరుపై నియంత్రణ కొనసాగించండి. మీ పురోగతికి ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read: దసరాకి కాశీ వెళితే చాలు.. మొత్తం 9 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చు!

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తికి సంబంధించిన వివాదాలు రావొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ పనితీరుకి అవార్డులు వస్తాయి. మీ మనసులో ఉండే గందరగోళాన్ని పరిష్కరించుకోవడం మంచిది. 

సింహ రాశి

సింహ రాశి వారు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు. రాజకీయాల్లో ఉండేవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ శత్రువులు ఉత్సాహంగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ తెలివితేటలతో కొన్ని సమస్యలను అధిగమించి అడుగు ముందుకు వేస్తారు. 

కన్యా రాశి

దుర్గాష్టమి రోజు మీకు మంచి జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు సమన్వయంతో పనిచేయడం ఉత్తమం. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలి. కుటుంబంలో వ్యక్తులు మీ మాటకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపారులు చిన్న చిన్న లాభాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాత స్నేహితులను కలుస్తారు.

Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే!

తులా రాశి
 
ఈ రాశివారు  అలవాట్లపై నియంత్రణను కొనసాగించాలి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల కారణంగా కొన్ని ఇబ్బందులుంటాయి. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. మీ మాటలో సౌమ్యత మీకు గౌరవాన్ని పెంచుతుంది. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. 

వృశ్చిక రాశి

ఈ రాశివారు ఈ రోజు చట్టపరమైన విషయాలలో సమస్యలను ఎదుర్కోవచ్చు.  మీరు మీ పని గురించి ఆందోళన చెందుతారు. అధిక పని కారణంగా,  అలసిపోతారు.  తలనొప్పి పెరుగుతుంది.  కుటుంబంలో కొన్ని అనవసర విభేదాలు తలెత్తవచ్చు.  ప్రయాణాలలో మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. కొన్ని పనుల విషయంలో టెన్షన్ ఉండవచ్చు.

ధనుస్సు రాశి 

ఈ రాశివారు దుర్గాష్టమి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. రోజంతా సంతోషంగా ఉంటారు.  ఏ పనిలోనూ తొందరపడకూడదు. అనవసర వాగ్ధానాలు చేయకుండా ఉండడం మంచిది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంటారు. 

మకర రాశి

ఈ రోజు మీరు నూతన కార్యక్రమాలు చేపట్టేందుకు మంచి రోజు అవుతుంది. ఆదాయం, ఆరోగ్యం బావుంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 

కుంభ రాశి
 
ఈ రోజు మీకు కొంత అశాంతిగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన అనవసర చర్చల్లో పాల్గొనకుండా ఉండాలి. సాధ్యమైనంతవరకూ మౌనం వహించడం మంచిది. అనుకున్న పనిని సకారంలో పూర్తిచేయకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు పొందలేరు. 

మీన రాశి

ఈ రోజు ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. రోజంతా బిజీగా ఉంటారు. చాలా రోజులుగా ఉన్న కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి.  

Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Embed widget