News
News
X

Daily Horoscope Today 22nd November 2022: ఈ రాశివారి జీవితంలో కొన్ని ప్రశాంతమైన మార్పులు రాబోతున్నాయి, నవంబరు 22 రాశిఫలాలు

Horoscope Today 22th November 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

22th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. కొంతమంది తమ శక్తికి మించిన వాగ్ధానాలు చేస్తారు. అవసర విషయాలని ఎక్కువ ఆలోచించేలా చేసే స్నేహితులకు దూరంగా ఉండండి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు

వృషభ రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ఈ రాశి వారికి ఈరోజు ఒక ప్రముఖ అకాడమీలో చేరే ఆఫర్ వస్తుంది..ఇది మీ మనసుకి ఆనందాన్నిస్తుంది. ప్రారంభించిన పనిలో సోదరుల నుంచి సహకారం ఉంటుంది.

మిథున రాశి
ఈ రోజు మీరు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు.పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ ఏ పనినీ వాయిదా వేయకండి. ముఖ్యమైన సమాచారం పొందుతారు.  ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి

News Reels

Also Read: కొందరు మీ ఇమేజ్ కి డ్యామేజ్ కలిగించే ప్రయత్నం చేస్తారు, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

కర్కాటక రాశి
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితుల మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించవచ్చు..అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామితో సరైన సమయం గడపలేని పరిస్థితులు ఏదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసర విషయాలకు ఎక్కువ సమయం కేటాయించడం మానుకుంటే మంచిది.

సింహ రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. గృహోపకరణాలపై ఖర్చులు పెరగుతాయి. మీ మాటతీరు ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించవచ్చు..జాగ్రత్తగా మాట్లాడండి. సొంత వ్యవహారాలు కూడా అనుకున్నట్టు పూర్తిచేయలేరు. కుటుంబంలో సవాల్ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 

కన్యా రాశి
ఈ రోజు మీరు ఎవరి నుంచైనా ఆర్థిక సహాయం పొందుతారు. కొత్త పనులు చేపడితే వాటిలో విజయం సాధిస్తారు. మీ మనస్సు కొత్త ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఎవరితోనైనా వివాదం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏదైనా పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Also Read: 2023లో ఈ రాశివారు అన్నింటా సక్సెస్ అవుతారు, ఏడాది సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది

తులా రాశి
సృజనాత్మకంగా ఆలోచించే మీ సామర్థ్యాన్ని...ఆర్థిక సమస్యలు నాశనం చేశాయి. మీ విపరీత స్వభావాన్ని కుటుంబ సభ్యులే విమర్శిస్తారు. భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే డబ్బు ఆదా చేసుకోవాలి..లేదంటే రానున్న రోజుల్లో మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.

వృశ్చిక రాశి
ఈ రోజు మీలో నూతన శక్తి నిండిఉంటుంది. ఎదురయ్యే సవాళ్లను ఓర్పుతో సులభంగా ముగించుకుంటారు. అనుకున్న పనులు పూర్తి కాగలవు. ఆకస్మిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన పనుల ఫలితం ఇప్పుడు పొందే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో లాభసాటి అవకాశాలు ఉంటాయి. నమ్మకమైన వ్యక్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది. మీ జీవితంలో కొన్ని ప్రశాంతమైన మార్పులు జరగబోతున్నాయి 

మకర రాశి
నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే..అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని పెట్టడం మంచిది. తోడబుట్టిన వారి ప్రోత్సాహం మిమ్మల్ని సక్సెస్ దిశగా నడిపిస్తుంది. చిన్న చిన్న విషయాలపై కోపాన్ని ప్రదర్శించవద్దు. కోపం కారణంగా చాలా కోల్పోతారు.

కుంభ రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు మంచి రోజు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. మీరు మీ జీవితంలో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నిస్తారు, ఇది భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మీన రాశి
ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగానే ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. తలపెట్టిన పనుల్లో పురోగతి పొందుతారు. మీన రాశి వారు ఈరోజు ఆస్తి విషయాల్లో లాభపడతారు. పాత స్నేహితులను కలుస్తారు.

Published at : 22 Nov 2022 04:56 AM (IST) Tags: Horoscope Today astrological predictions forNovember 2022 22th November horoscope today's horoscope 22 November 2022 22th November 2022 Rashifal

సంబంధిత కథనాలు

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం,  కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం, కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

Horoscope for December 2022 :ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు

Horoscope for December 2022 :ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు

Love Horoscope Today 29th November 2022: ఈ రాశి దంపతుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది

Love Horoscope Today 29th November 2022:  ఈ రాశి దంపతుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది

Daily Horoscope Today 29th November 2022: ఈ రాశి ఉద్యోగులకు ఇంకొన్నాళ్లు ఇబ్బందులు తప్పవు, నవంబరు 29 రాశిఫలాలు

Daily Horoscope Today 29th November 2022: ఈ రాశి ఉద్యోగులకు ఇంకొన్నాళ్లు ఇబ్బందులు తప్పవు, నవంబరు 29 రాశిఫలాలు

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్