అన్వేషించండి

2025 అక్టోబర్ 12 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

రేపటి రాశిఫలం: 12 రాశుల వారికి ముఖ్యమైనది. మేషం, తుల, కన్య, వృశ్చిక రాశి వారు ధన విషయంలో జాగ్రత్త వహించండి.

2025 అక్టోబర్ 12 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 12 October 2025

మేష రాశి

ఈ రోజు మీరు చేసిన పనికన్నా ప్రదర్శన పెరుగుతుంది. నచ్చకపోయినా కొన్ని పనులు మీరు లోకానికి భయపడి చేయవలసి వస్తుంది. మతపరమైన పనులపై ఆసక్తి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బద్ధకం వీడండి. ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారులు నష్టపోతారు. కుటుంబంలోని మహిళల నుంచి సహకారం లభిస్తుంది.

శుభ సంఖ్య: 3
రంగు: గులాబీ
పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి.

వృషభ రాశి

ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది కానీ పనులలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. సహోద్యోగుల నుంచి సహకారం తీసుకోవాల్సి వస్తుంది.  అకస్మాత్తుగా చేసిన ప్రయాణ ప్రణాళిక వాయిదా పడుతుంది. ఆర్థికంగా లాభపడేందుకు ఎక్కువ కష్టపడాలి..కానీ విజయం సాధించిన తర్వాత సంతోషంగా ఉంటారు. పెద్దల ఆశీర్వాదం మీపై ఉంటుంది.  

శుభ సంఖ్య: 6
రంగు: తెలుపు
పరిహారం: లక్ష్మీదేవికి  పాయసం సమర్పించండి.

మిథున రాశి

ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశసంలు అందుకుంటారు. అదృష్టం కలిసొస్తుంది, మీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. సహోద్యోగులు మీ ఆత్మవిశ్వాసాన్ని  గౌరవిస్తారు. కుటుంబంలోని మహిళల నుంచి సహకారం , ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

శుభ సంఖ్య: 4
రంగు: ఆకుపచ్చ
పరిహారం: గణేశుడికి దూర్వ సమర్పించండి.

కర్కాటక రాశి

తెలివితేటలతో ధనం సంపాదిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి రిస్క్ తీసుకోవచ్చు.  ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో పిల్లల విజయం ఆనందాన్నిస్తుంది. పెద్దలు కొంచెం అసంతృప్తి చెందవచ్చు కాని మహిళలు వైవాహిక జీవితాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తారు.

శుభ సంఖ్య: 2
రంగు: తెలుపు
పరిహారం: పాలలో చక్కెర కలిపి శివలింగంపై సమర్పించండి

సింహ రాశి

ఉదయం సమయం ఆశించిన విధంగా ఉంటుంది .. పాత ఒప్పందం నుంచి ధన లాభం ఉంటుంది. కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది, కాని అడ్డంకులు పెరుగుతాయి. మధ్యాహ్నం తర్వాత గందరగోళంగా ఉంటుంది. అత్యాశకు గురై తప్పుడు మార్గాలను అనుసరించకుండా ఉండండి. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది, మహిళల సలహా ఉపయోగకరంగా ఉంటుంది.

శుభ సంఖ్య: 9
రంగు: పసుపు
పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.

కన్యా రాశి

ఉదయం నిరాశ ఉంటుంది ..చేయాల్సిన పనులపై మనసు లగ్నం కాదు. ఇల్లు, కుటుంబంలో శాంతి ఉండదు. మధ్యాహ్నం తరువాత పరిస్థితి మెరుగుపడుతుంది. నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. లాభదాయకమైన ఒప్పందాలు లభిస్తాయి. మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు, ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

శుభ సంఖ్య: 7
రంగు: నీలం
పరిహారం: దుర్గామాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి.

తులా రాశి

రోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉదయం శుభవార్త అందుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరిదైనా సలహా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం తరువాత స్వభావంలో చంచలత్వం ఉంటుంది, దీనివల్ల తీవ్రమైన పనులు ప్రభావితమవుతాయి. సాయంత్రానికి అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం ఉంది.

శుభ సంఖ్య: 8
రంగు: ఊదా
పరిహారం: పేదలకు భోజనం పెట్టండి.

వృశ్చిక రాశి

ఈ రోజు పనులలో విజయం లభిస్తుంది . స్వభావంలో కఠినత్వం వల్ల అంతా మీపై కోపంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆదాయం, వ్యయం సమానంగా ఉంటాయి. మహిళల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

శుభ సంఖ్య: 1
రంగు: ఎరుపు
పరిహారం: నీటిలో ఎర్రటి పువ్వులు వేసి సూర్యునికి సమర్పించండి.

ధనుస్సు రాశి

ఉదయం పనుల్లో క్రమబద్ధత ఉంటుంది. సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారుతుంది. నష్టం కలిగే అవకాశం ఉంది. ఏదైనా ఒప్పందం రద్దు కావచ్చు. మహిళలు పనిలో జాగ్రత్త వహించాలి.

శుభ సంఖ్య: 5
రంగు: నారింజ
పరిహారం: తులసి మొక్కకు నీరు పోయండి.

మకర రాశి

రోజు ప్రారంభం పనిచేసే ప్రదేశంలో నిరాశ ఉంటుంది. కుటుంబంలో అనవసర వాదనలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది   కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. సాయంత్రం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

శుభ సంఖ్య: 6
రంగు: నలుపు
పరిహారం: శని దేవాలయానికి నువ్వుల నూనె సమర్పించండి.

కుంభ రాశి

రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో అకస్మాత్తుగా ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మధ్యాహ్నం లోపు ముఖ్యమైన పనులు పూర్తి చేయండి. ఆ తర్వాత వాతావరణం కొంచెం ప్రతికూలంగా ఉండవచ్చు. గొడవలు వచ్చే అవకాశం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో వివాదాస్పద విషయాలు మాట్లాడకుండా ఉండండి.

శుభ సంఖ్య: 3
రంగు: నీలం
పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

మీన రాశి

ఉదయం పనిలో విజయం , ధన లాభం ఉంటుంది. ప్రియమైన వారి నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. మధ్యాహ్నం తరువాత ప్రతికూల పరిస్థితి ఏర్పడవచ్చు. అకస్మాత్తుగా నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రయాణం మరియు విద్యుత్ పరికరాల విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరుగుతాయి

శుభ సంఖ్య: 7
రంగు: ఆకుపచ్చ
పరిహారం: విష్ణువుకు తులసి ఆకులను సమర్పించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Advertisement

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget