అన్వేషించండి

Surya Gochar in Virgo 2024: కన్యా రాశిలోకి సూర్యుడు - ఆగష్టు 17 నుంచి ఈ 7 రాశులవారికి ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

Surya Gochar 2024: నెల రోజులకు ఓ రాశిలోకి పరివర్తనం చెందే సూర్యుడు ఆగష్టు 17న సింహరాశి నుంచి కన్యారాశిలోకి పరివర్తనం చెందుతాడు. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది.. ఈ 7 రాశులవారికి శుభఫలితాలున్నాయి

Sun Transits Virgo 16 Sep till 17 Oct 2024: సింహరాశిలో సంచరిస్తున్న సూర్యుడు..ఆగష్టు 17న కన్యారాశిలోకి ప్రవేశించి సెప్టెంబరు 17 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. కన్యా రాశిలో సూర్యప్రవేశం కొన్ని రాశులవారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది.

మేష రాశి

కన్యా రాశిలో సూర్య సంచారం మేష రాశివారికి వృత్తిపరంగా మంచి  ఫలితాలను ఇస్తుంది...అయితే ప్రత్యర్థులపట్ల జాగ్రత్త వహించాలి. అహంకారం కారణంగా గొడవలు, వ్యక్తిగత సంబంధాలలో సవాళ్లు ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రేమికుల మధ్య వివాదాలుంటాయి. విద్యార్థులు చదువుపై మాత్రమే దృష్టిసారిస్తే మంచి లక్ష్యాలు సాధిస్తారు.  ఆరోగ్యం బావుంటుంది..ఆహార నియమాలు అనుసరించండి.  

కర్కాటక రాశి

సూర్య సంచారం ఈ రాశివారికి వృత్తిపరమైన సవాళ్లను అధిగమించేందుకు సహాయపడుతుంది. వ్యక్తిగత సంబంధాలలో మంచి అవగాహన ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఉన్నత ఉద్యోగులు, సహోద్యోగులతో సంతోషంగా కలసిపోతారు. మీ ప్రియమైనవారితో మంచి అవగాహనతో కూడిన బంధాన్ని కలిగి ఉంటారు. అహంకార పూరిత ప్రవర్తన మీ బంధాలపై ప్రభావం చూపిస్తుంది. 

Also Read: గోలపడిపోతున్నారా.. అయితే మీ రక్షణకోసం ఈ 5 ఆయుధాలు ఉపయోగించండి!

సింహ రాశి

సూర్యుడు మీ రాశి నుంచి కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ సమయం మీకు ఆర్థిక స్థిరత్వానికి అనుకూల సమయం. అయితే వ్యక్తిగత, వృత్తిగత సంబంధాలలో మీరు ఆశించిన స్థాయిలో సహకారం ఉండదు. మీ మాటతీరుపై నియంత్రణ అవసరం. ఆర్థికపరిస్థితి అద్భుతంగా అనిపించినా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అనవసర ఘర్షణలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.  

కన్యా రాశి

సూర్య సంచారం మీ రాశిలోనే కావడంతో మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అయితే మీ వ్యక్తిగత బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైఖరి కారణంగా ఎదుటివారు బాధపడతారు. విదేశాలలో ఉద్యోగాలు చేసేవారు లాభపడతారు.  పనిభారం పెరుగుతుంది కానీ మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన పెట్టుబుడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది.

తులా రాశి

కన్యా రాశిలో సూర్య సంచారం తులారాశివారి జీవితంలో కొత్త వెలుగులు తీసుకొస్తుంది. ఉద్యోగం, వ్యాపారం బాగా సాగుతుంది. విదేశీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి. కుటుంబంలో, కార్యాలయంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే మీ ప్రియమైనవారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు మాటతీరుపై జాగ్రత్తలు అవసరం. ఆర్థిక లాభాలనిచ్చే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.  

Also Read: వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటరా అంటారా..అసలు పెళ్లెందుకు చేసుకోవాలో తెలుసా!

వృశ్చిక రాశి 

ఆగష్టు 17 నుంచి నెల రోజులపాటూ వృశ్చికరాశివారి జీవితంలో కొత్తవెలుగులుంటాయి.  వృత్తిపరమైన శ్రేయస్సు ఉంటుంది..ఊహించని  ఆర్థిక లాభాలుంటాయి. ఇప్పుడు మీరుపడే కష్టానికి రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. తోబుట్టువులతో బంధం బావుంటుంది. వ్యక్తిగత సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.  

ధనస్సు రాశి

ధనుస్సు రాశి వారికి కన్యారాశిలో సూర్య సంచారం అన్నీ శుభఫలితాలనే అందిస్తోంది. వృత్తి జీవితం అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలు ఆనందాన్నిస్తాయి. ఏకాగ్రతతో అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచిసమయం. ప్రమోషన్ తో పాటూ జీతం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  

గమనిక: పండితులు సూచించిన విషయాలు, ఆధ్యాత్మిగ గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. పైన సూచించిన నియమాలు అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడిఉంటుంది..

Also Read: వరలక్ష్మీ వ్రతం సులువుగా చేసుకునే విధానం - ఈ రోజు చదువుకోవాల్సిన వ్రత కథ!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget