మార్చి 22 ఉగాది శోభకృత్ నామసంవత్సరం మొదటి రోజు ఈ 5 రాశులవారికి అద్భుతంగా ఉంది
Rasi Phalalu Today 22nd March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
శ్రీ శోభకృత్ నామసంవత్సర ప్రారంభం..ఉగాది రోజు ఏ రాశివారికి ఎలా ఉందంటే....
మేష రాశి
ఈ రాశివారికి కార్యాలయంలో పనిభారం అధికంగా ఉంటుంది. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. అనుకోకుండా ప్రయాణం చేయవలసి రావొచ్చు. మహిళలు తమ భద్రతపై శ్రద్ధ వహించాలి. ఏ పనిలోనూ తొందరపడకండి. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. ఉద్యోగులు శుభవార్త వింటారు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
వృషభ రాశి
ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన విషయాలకు ఈ రోజు మంచిరోజు. ఈ రాశి ఉద్యోగులు పనివిషయంలో శ్రద్ధగా ఉంటారు. వివిదాస్పద విషయాల్లో చిక్కుకున్నప్పటికీ దాన్నుంచి బయటపడతారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. స్నేహితుల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ కలహాలు తొలగిపోతాయి.
మిథున రాశి
ఈ రాశివారికి పదవి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇతరుల నుంచి గౌరవం ఆశిస్తారు. ఆఫీసు పనులపై బయటకు వెళ్లాల్సి రావచ్చు. సహోద్యోగులతో మీ స్నేహం పెరుగుతుంది. మీరు ఆసక్తికరమైన పని చేసే అవకాశాలను పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. ఎవరితోనైనా విభేదాలుంటే తొలగిపోతాయి.
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు
కర్కాటక రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీరు సానుకూలంగా ఉండాలి. వ్యాపార భాగస్వామ్యం గురించి చర్చ ఉండవచ్చు. మీ పని నిదానంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తెలియని వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకోకండి. విద్యార్థులు చదువుకు బదులు ఇతర పనుల్లో ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు
సింహ రాశి
ఈ రోజు మీకు అంత మంచిరోజు కాదు. మళ్లీ పాత వివాదాలు తలెత్తవచ్చు. మీ మంచి సలహాను కూడా ఎవ్వరూ పరిగణలోకి తీసుకోరు. ఎవ్వరినీ అప్పు అడగవద్దు. ఎక్కువ ఆలోచించే బదులు, మీ స్వంత వ్యాపారాన్ని చూసుకోవడం మంచిది. ఆర్థిక హామీలు ఇవ్వకపోవడం మంచిది. బంధువులతో వివాదం ఉంది
కన్యా రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. సామాజిక పరిచయం పెరుగుతుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ, కార్యాలయంలో మీ పనితీరు బాగానే ఉంటుంది. విద్యార్థులు నిపుణులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. మీ పని సమయానికి ముందే పూర్తవుతుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు విజయం సాధించే అవకాశం ఉంది. రోజంతా బిజీగా ఉంటారు.
తులా రాశి
ఈ రాశివారు అప్పులు తీసుకోకుండా ఉండడం మంచిది. స్నేహితుడిని కలుస్తారు. రోజంతా చాలా బిజీగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి విషయాలలో చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉంది. రహస్య శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. చాలా పనులను ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సమస్యలు దూరమవుతాయి.
Also Read: ఉగాది ప్రత్యేకత ఏంటి, చైత్రమాస పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!
వృశ్చిక రాశి
ఈ రాశివారు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటారు. పెద్దల సాంగత్యం నచ్చుతుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి డైట్ కంట్రోల్ యోగా చేయడం మంచిది. ఈరోజు విలువైన బహుమతులు అందుకుంటారు. స్నేహితులతో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. అపరిచితుడిని వెంటనే నమ్మవద్దు.
ధనుస్సు రాశి
ఈ రాశి యువత కెరీర్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. సహాయం చేయడం వల్ల మీకు ఆత్మ తృప్తి కలుగుతుంది. మీరు తేలికగా భావించే పని సమస్యలను కలిగిస్తుంది. సన్నిహితుల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సంభాషణలో అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు.
మకర రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఈరోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహాయం ఉంటుంది. ఏ పనీ చేయడంలో అలసత్వం వహించవద్దు. మధ్యాహ్నం తర్వాత మీకు శుభవార్తలు అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భౌతిక సుఖాలను సంపూర్ణంగా అనుభవిస్తారు. వివిధ మార్గాల నుంచి ఆదాయం ఉంటుంది.
కుంభ రాశి
మీ ప్రత్యర్థులు బలహీనపడుతున్నట్లు కనిపిస్తుంది. రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకుని, మీరు కొత్త పనుల వైపు మొగ్గు చూపవచ్చు. మీ బాధ్యతలను మీరు పూర్తిగా నిర్వర్తించండి. ఎవరి పట్లా పక్షపాతం చూపవద్దు. రోజు మొదటి అర్ధభాగంలో ముఖ్యమైన పనులను పూర్తి చేయడం లాభదాయకంగా ఉంటుంది. ప్రభావశీల వ్యక్తులను కలుస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
మీన రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆగిపోయిన పనులు ప్రారంభించవచ్చు. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. తల్లిదండ్రులతో చర్చించి వారి ఆశీస్సులు పొందడం మంచిది. వివాహ సంబంధాలలో అవగాహన సామరస్యం పెరుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు. పనిచేసే విధానంలో మార్పులు తీసుకురానున్నారు.