Z Category Security: నారా లోకేష్‌కి జెడ్ కేటగిరీ భద్రత - కేంద్ర హోం శాఖ ఆదేశాలు
Andhra Pradesh News: టీడీపీ నేత నారా లోకేష్ కు భద్రతాపరమైన ఇబ్బందుల కారణంగా జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Z Category Security for Nara Lokesh: అమరావతి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ (VIP Wing) బలగాలతో లోకేష్‌కు భద్రత కల్పిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. అక్టోబర్ 2016 ఏఓబి ఎన్ కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత (Nara Lokesh Z Category Security) కల్పించాలని నాటి ఎస్ఆర్సీ( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మరోవైపు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్‌కు భద్రత తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ గతంలో చేసిన సిఫార్సులు పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. లోకేష్ కి వై క్యాటగిరి భద్రత మాత్రమే కల్పిస్తూ వస్తోంది.
లోకేష్‌కు భద్రత తగ్గించిన వైసీపీ ప్రభుత్వం!
ముప్పు ఉన్నా లోకేష్‌కు వైసిపి ప్రభుత్వం లోకేష్ కి భద్రత తగ్గించిందని, తగిన భద్రత కల్పించాలి అంటూ రాష్ట్ర హోమ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి లోకేష్ భద్రతా సిబ్బంది 14 సార్లు లేఖలు రాశారు. భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని పలుమార్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది లోకేష్ భద్రతా సిబ్బంది. యువగళం పాదయాత్రలో లోకేష్ టార్గెట్ గా అనేక సార్లు వైసిపి ప్రేరేపిత భౌతిక దాడులు జరిగాయంటూ రాష్ట్ర హోమ్ శాఖ, కేంద్ర హోమ్ శాఖ, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సు పక్కన పెట్టి, భద్రత తగ్గించిన విషయాన్ని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంది. గతంలో మావోయిస్ట్ హెచ్చరికలు, భద్రతా పరంగా ఉన్న నిఘా వర్గాల సమాచారం మేరకు లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. సీఆర్పిఎఫ్ ( విఐపి వింగ్ ) బలగాలతో లోకేష్‌కు భద్రత కల్పించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

