అన్వేషించండి

YV Subbareddy: షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్లినా నష్టం లేదు - రాయబారం చేయలేదన్న వైవీ సుబ్బారెడ్డి !

YSRCP : షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లకుండా తాను రాయబారం నిర్వహించలేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్నారు.

YCP leader YV Subbareddy:  షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరకుండా తాను రాయబారం నిర్వహించలేదని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విజయమ్మను మాత్రమే లోటస్ పాండ్ లో కలిశానని కుటుంబ విషయాలు మాట్లాడానన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ను వైవీ సుబ్బారెడ్డి కలిశారు. క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్న మీడియాతో మాట్లాడారు.  జగన్ తరపున తాను వైఎస్ షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రచారం జరుగుతోంది కానీ అది నిజం కాదన్నారు. తాను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదని తెలిపారు. తాను మామూలుగానే అప్పుడప్పుడు విజయమ్మను కలసి కుటుంబ విషయాలపై మాట్లాడతానని చెప్పారు. నెల రోజుల తర్వాత ఆదివారం విజయమ్మను హైదరాబాద్ లో కలిశానన్నారు. కొద్దిసేపు కుటుంబ విషయాలపై విజయమ్మ, తాను మాట్లాడుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారో లేదో తెలియదు !                  

చంద్రబాబును దత్తపుత్రుడిని సీఎం చేసేందుకు తమపై బురద జల్లుతున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు చేస్తూ, వైఎస్ కుటుంబ సభ్యులను బజారు కెక్కిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా.. సీఎం జగన్ కు నష్టమేమీ లేదని తెలిపారు. తామేమీ రాయబారాలు చేయాల్సిన పని లేదని చెప్పారు. ప్రజలే జగన్ ను మరోసారి ఆశీర్వదించి సీఎంను చేస్తారన్నారు.  షర్మిల కాంగ్రెస్ పార్టీలో   చేరుతున్నారో లేదో తనకు సమాచారం లేదని చెప్పారు. సీఎం జగన్ వెంట మేమంతా ఉంటాం.. రాబోయే రోజుల్లో జగన్ ను సీఎంను చేసుకుంటామని పేర్కొన్నారు.

షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లిన జగన్‌కు నష్టం లేదు !                      

షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లినా.. తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చేసే అభివృద్ది కార్యక్రమాలే తమకు విజయాన్ని అందిస్తాయని తెలిపారు. చాలా స్థానాల్లో వైసీపీ నష్ట పోకుండా ఉండేందుకే అభ్యర్థులను మార్చుతున్నాం.. వాస్తవ పరిస్థితులు, వేర్వేరు కారణాలతో సీట్లు మార్చుతున్నట్లు తెలిపారు. ఏడాది నుంచి మార్పుల విషయాన్ని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు చెబుతున్నారన్నారు. పలువురు ఎమ్మెల్యేలు షర్మిల వైపు వెళ్తున్నారని కొందరు సృష్టిస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీలు మారుతున్నారు.. వ్యక్తిగత కారణాలతోనే షర్మిల వెంట వెళ్లాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే నిర్ణయమని చెప్పారు. 

దాడి వీరభద్రరావుకు సీటు ఇచ్చే అవకాశం లేదు !                  

సీట్లు ఇవ్వలేని వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని సీఎం హామీ ఇస్తున్నారని తెలిపారు. గెలుపు అవకాశాలను బట్టి, అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతను బట్టి సీట్లు మార్పు ఉంటుందని అన్నారు. ఎన్ని సీట్లలో మార్పులు ఉంటాయన్నది ఇప్పుడేమీ చెప్పలేమని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖలోని అనకాపల్లిలో  ప్రత్యేక  పరిస్థితులు ఉన్నాయని అక్కడ దాడి వీరభద్రరావుకు కానీ ఆయన కుమారులకు కానీ సీటు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.కొంత ఓపిక పట్టాలని చెప్పామని కానీ ఆయన వినిపించుకోలేదన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:విశాఖలో సైకిల్‌పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్
విశాఖలో సైకిల్‌పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
YS Sharmila Rajya Sabha Seat: చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
Embed widget