Tamballapalle YSRCP : తంబళ్లపల్లె వైఎస్ఆర్‌సీపీలో ముసలం.. పెద్దిరెడ్డి సోదరుడిపై జడ్పీటీసీ భర్త తీవ్ర ఆరోపణలు !
మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిపై తంబళ్లపల్లె వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు కేసులుపెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అగ్రనేతలు.. ద్వితీయ శ్రేణి నేతల మధ్య పొసగని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజాపై ఐదు మండలాల నేతలు తిరుగుబాటు చేశారు . తాజాగా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై ఆ పార్టీ జడ్పీటీసీ భర్త తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి తన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. స్థానికుడు కాకపోయినప్పటికీ ఆయన విజయం సాధించారు. అయితే ఇప్పుడు స్థానిక నేతలు ఆయనపై మండిపడుతున్నారు. తమను లెక్కచేయడం లేదని ... తమపైనే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read: నగరి వైఎస్ఆర్‌సీపీలో కోవర్టులు.. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి రోజా ఫిర్యాదు !
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఓ మండలంలో గట్టి పట్టు ఉన్న నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఆయన తన భార్యను జడ్పీటీసీగా గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేశారు. సీఏం జగన్మోహన్ రెడ్డిని చూసి తంబళ్లపల్లెలో ద్వారకానాథ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించామని... ఇప్పుడు ఆయన సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా దాడులు చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరు నుండి తమ నియోజకవర్గంకు వచ్చి తమపై తమ వారిపై దౌర్జన్యం చేస్తూ కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్ఆర్‌సీపీ కోసం కష్టపడిన తమను మానసికంగా వేధింపులకు గురి చేయడం దారుణంమని, ఇదే విషయంను సీఎం జగన్మోహన్ రెడ్డి కి కలిసి తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రయత్నిస్తుంటే కలవనీయకుండా అడ్డు పడుతున్నారని ఆరోపించారు.. అందుకే సొంత పార్టి నేతలను పార్టి కార్యక్రమాలకు అనుమతించకుండా అవమానంకు గురి చేస్తూ, తమ అనుచర వర్గం వారిపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తంబళ్లపల్లెలో ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పాలనలో వాలంటీర్లు కూడా బ్రతకలేని పరిస్ధితిలో ఉన్నారని, అధికారులను అసభ్యకర పదజాలం ఉపయోగించడం చాలా భాధాకరంమని కొండ్రెడ్డి వాపోయారు..
Also Read: మందుబాబులకు న్యూ ఇయర్ గిఫ్ట్... అర్ధరాత్రి వరకూ షాపులు ఓపెన్... ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
పార్టి కోసం పని చేస్తున్న తమకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, పెద్దిరెడ్డి అనుచరవర్గంకు మాత్రమే అన్ని పనులు చేసుకుంటున్నారని మండిపడ్డారు.. కరువు ప్రాంతంమైన తంబళ్లపల్లెలో బయట ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.. అంతే గానీ అటువంటి సమయంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన ఎమ్మెల్యే సొంత పార్టి నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ సాగించే పాలన ఎన్ని రోజులు సాగుతుందో చూస్తామని కొండ్రెడ్డి హెచ్చరించారు. ఈ పరిణామంపై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
Also Read: అంబేడ్కర్ వల్ల వచ్చిన హక్కులేమీ లేవు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి