అన్వేషించండి

Eluru Municipal Corporation: ఏలూరు కార్పొరేషన్ పై వైసీపీ జెండా.. కార్పొరేషన్లు అన్నీ ఫ్యాన్ ఖాతాలోనే

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ను వైసీపీ దక్కించుకుంది. 50 డివిజన్లు ఉండగా అందులో 47 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

 


ఏలూరు కార్పొరేషన్  వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 47 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉండగా ఎన్నికల ముందే 3 ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఈ కారణంగా మార్చి 10న 47 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి. 

ఏలూరు కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు.. వైసీపీ ఖాతాలోకి వెళ్లడంతో ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఇవాళ వచ్చిన ఫలితాల్లో వైసీపీ 44, టీడీపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. గతంలో ఏకగ్రీవమైన 3 స్థానాలు కలిపి వైసీపీ 47 గెలిచినట్టైంది.  2, 4, 5, 6, 8, 10, 11, 13, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 31, 33, 35, 36, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 48, 49, 50 సహా మరికొన్ని డివిజన్లలో వైసీపీ గెలవగా..  28, 37, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్లను లెక్కిస్తోంది. ఏలూరులోని సీఆర్‌రెడ్డి కాలేజీలోని నాలుగు కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఇవాళ మధ్యాహ్నం వరకు ఏలూరు కార్పోరేషన్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే.

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.  సింగిల్ జడ్జి ఎన్నికలపై స్టే విధించగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఓ పిటీషనర్ ఆ తీర్పును సవాలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి నేృతృత్వంలోని ధర్మాసనం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు అనుమతిచ్చారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశాలిచ్చింది. హైకోర్టు తాజా ఆదేశాల మేరకు ఇవాళ ఓట్లను లెక్కించారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 75 మున్సిపల్ స్థానాలకు గానూ ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ 73 చోట్ల విజయం సాదించింది. టీడీపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రమే ఆధిక్యం దక్కించుకుంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి మున్సిపాలిటీ సీటు దక్కించుకుంది. 

గతంలో 12 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా ఏలూరులో కౌంటింగ్ జరగలేదు. మిగిలిన 11 మునిసిపల్ కార్పొరేషన్లలో వైసీపీనే జెండా ఎగరేసింది. ఇవాళ వెలువడిన ఏలూరు ఫలితాలతో అన్నీ.. కార్పొరేషన్లు వైసీపీ దక్కించుకున్నట్టైంది.

Also Read: Congress Conflict: రంగంలోకి కాంగ్రెస్ అధిష్ఠానం.. రాజస్థాన్ రాజకీయంపై దృష్టి

                CM Yediyurappa Profile: యడియూరప్ప రాజకీయ జీవితంలో ఆఖరి పేజీ ఇదేనా?

                Ladakh Conflict: లద్దాఖ్ లో యుద్ధ మేఘాలు.. భారీగా బలగాల మోహరింపు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ప్రమాణస్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన ఎంపీలు
ప్రమాణస్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన ఎంపీలు
YS Jagan Tweet SHG Loans Decline: డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
MP Putta Mahesh Drunk and Drive Comments: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ షాకింగ్ కామెంట్స్ - తాగి నడిపితే కేసులు పెడతారా? ఎస్పీ కిషోర్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్!
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ షాకింగ్ కామెంట్స్ - తాగి నడిపితే కేసులు పెడతారా? ఎస్పీ కిషోర్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్!
Tungabhadra Dam 33 New Crest Gates : ముగ్గురు సీఎంల చేతుల మీదుగా తుంగభద్రకు కొత్త జీవం , 33 నూతన గేట్లు ప్రారంభం - హాజరైన కేంద్రమంత్రి సి.ఆర్. పాటిల్!
ముగ్గురు సీఎంల చేతుల మీదుగా తుంగభద్రకు కొత్త జీవం , 33 నూతన గేట్లు ప్రారంభం - హాజరైన కేంద్రమంత్రి సి.ఆర్. పాటిల్!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Darshanam Mogilaiah Land Dispute: వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
వివాదాల్లో ఉన్న భూమి ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం - కోర్టుల చుట్టూ తిరుగుతున్న దర్శనం మొగిలయ్య - ఆదుకోవాలని వేడుకోలు
YS Jagan Tweet SHG Loans Decline: డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
డ్వాక్రా మహిళలకు కూటమి ద్రోహం - రూ. 6,000 కోట్లు నొక్కేశారు.. గణాంకాలతో వైఎస్ జగన్ సంచలన ట్వీట్!
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
Peddi OTT : పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ - మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మా?
MP Putta Mahesh Drunk and Drive Comments: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ షాకింగ్ కామెంట్స్ - తాగి నడిపితే కేసులు పెడతారా? ఎస్పీ కిషోర్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్!
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ షాకింగ్ కామెంట్స్ - తాగి నడిపితే కేసులు పెడతారా? ఎస్పీ కిషోర్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్!
Puri Jagannadh: ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
ఛార్మి కంట్రోల్‌లో పూరి... పెళ్ళాం పిల్లల్ని వదిలేశాడు... కెరీర్ నాశనం చేసుకున్నాడు
Shanmukh Jaswanth : నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?
నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?
Mirzapur The Movie Teaser: 'మీర్జాపూర్' సినిమా టీజర్ రివ్యూ... బబ్లూ పండిట్ బదల్ హోగయా!
'మీర్జాపూర్' సినిమా టీజర్ రివ్యూ... బబ్లూ పండిట్ బదల్ హోగయా!
Embed widget