Raghu Rama Krishna Raju: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ
ఈ నెల 13న నర్సాపురం వస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రెండు రోజులు అక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయాల్నుంచి తప్పుకుంటానన్నారు.
![Raghu Rama Krishna Raju: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ Ysrcp rebal mp raghurama krishna raju criticizes ap govt he will visit narsapuram Raghu Rama Krishna Raju: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/10/376b810f81fdcd808403008b70c31b7a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేస్తానని ఇటీవల ప్రకటించారు. తాజాగా ఆయన మరోసారి వైసీపీ సర్కార్ కు సవాల్ విసిరారు. ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటుకు వైసీపీకి ఛాన్స్ ఇస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం తెలిపారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని వెల్లడించారు. ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. తాను గెలిస్తే ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న నర్సాపురం వెళ్తున్నానని రెండు రోజులు అక్కడే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న రెండు రోజులు పోలీసులు తనకు భద్రత కల్పించాలన్నారు. అమరావతి కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని రఘురామకృష్ణరాజు స్పష్టంచేశారు.
Also Read: త్వరలో ఎంపీ పదవికి రఘురామ రాజీనామా ... అమరావతి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం !
సచివాలయ ఉద్యోగులకు బెదిరింపులు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. ఫిబ్రవరి 5లోగా తనను ఎంపీగా డిస్ క్వాలిఫై చేయించాలన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, స్పీకర్ ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని సవాల్ చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముందన్న ఎంపీ రఘురామ.. సచివాలయ ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్నానన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి ప్రజల కష్టాలు పట్టించుకోవాలని హితవుపలికారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండానే ఆరోగ్యశ్రీ తొలగించారని ఆయన విమర్శించారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదని, ఉద్యోగుల ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. భీమిలి ఏంఆర్‌వో ఉద్యోగులను బెదిరిస్తున్నారని, ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపణలు చేశారు.
Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?
అనర్హత వేటుకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు. కొంత కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తూ...ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఎంపీ రఘురామ. ఆయనపై అనర్హతా వేటు వేయాలంటూ వైఎస్ఆర్‌సీపీ ఎంపీలంతా ఓసారి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చి స్పీకర్‌కు విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చారు. అయితే తాను పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదని ఆయన కూడా రివర్స్‌లో స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)